EPAPER

Wildfires in Texas: టెక్సాస్‌లో కార్చిచ్చు.. సురక్షిత ప్రాంతాలకు ప్రజల తరలింపు..

Wildfires in Texas: టెక్సాస్‌లో కార్చిచ్చు.. సురక్షిత ప్రాంతాలకు ప్రజల తరలింపు..

Rapidly expanding fires in texas


Rapidly expanding fires in Texas: అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రం కార్చిచ్చుల్లో చిక్కుకొంది. ఎండిన గడ్డికి గాలి తోడవ్వటంతో మంటలు శరవేగంగా వ్యాపిస్తున్నాయి. నివాసితులను ఖాళీ చేయమని అధికారులు ఆదేశించారు. టెక్సాస్ ఫారెస్ట్ సర్వీస్ ప్రకారం స్మోక్‌హౌస్ క్రీక్ ఫైర్ ప్రాంతంలో సోమవారం మధ్యాహ్నం మంటలు వ్యాపించాయి.

ఈ మంటలు దాదాపు 200,000 ఎకరాలకు విస్ఫోటనం చెందాయి. తీవ్రమైన గాలులు, ఉష్ణోగ్రత, ఎండు గడ్డి ఈ మంటలకు ఆజ్యం పోశాయి. హెంఫిల్, రాబర్ట్స్ కౌంటీలలోని కొన్ని ప్రాంతాలలో మంటలు జనావాస ప్రాంతాలను ఆక్రమించాయి. దీంతో మంగళవారం మధ్యాహ్నం ప్రజలను అక్కడి నుంచి తరలించాలని ఆదేశించారు.


గాలి దిశలు మారడంతో మంటలు కొత్త దిశలలో వ్యాపిస్తున్నాయి. దీంతో 11 మిలియన్ల మంది ప్రజలకు మంగళవారం రెడ్ ఫ్లాగ్‌ హెచ్చరికలు జారీ చేశారు. టెక్సాస్, ఓక్లహోమా అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులకు కేంద్రబిందువుగా మారాయి. ఫారెస్ట్‌ సర్వీస్‌ అధికారుల ప్రకారం.. దాదాపు 2,00,000 ఎకరాలు అంటే 780 కి.మీ అగ్నికి ఆహుతైపోయింది. చలి తీవ్రత నేపథ్యంలో బుధవారం మంటలు  తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Tags

Related News

Crime: స్కూల్ బాత్రూంలో కాల్పులు.. బాలుడు మృతి

Russia president Putin: కమలా హ్యారిస్ కు జై కొట్టిన రష్యా అధ్యక్షుడు పుతిన్

USA Gun Fire: తండ్రి గిఫ్ట్‌గా ఇచ్చిన గన్‌తోనే స్కూల్‌లో అరాచకం.. ఐదుగురిని కాల్చి చంపిన ఆ నిందితుడి వయస్సు 14 ఏళ్లే!

PM Modi: భారత్‌లోనూ సింగపూర్‌లను సృష్టిస్తున్నాం: మోదీ

Muhammad Yunus: షేక్ హసీనాకు యూనస్ స్ట్రాంగ్ వార్నింగ్.. ఎందుకంటే ?

Japan Resignation Companies: ఉద్యోగుల చేత రాజీనామా చేయించడం కూడా ఒక బిజినెస్.. జపాన్ లో కొత్త వ్యాపారం

US’s Georgia school shooting: అమెరికాలో మళ్లీ కాల్పులు.. ఈసారి స్కూల్ లో.. నలుగురు మృతి

Big Stories

×