EPAPER
Kirrak Couples Episode 1

PM Narendra Modi: శాంతికి టెర్రరిజం పెనుముప్పు.. గ్లోబల్ యాక్షన్ అవసరమని మోదీ పిలుపు

PM Narendra Modi: శాంతికి టెర్రరిజం పెనుముప్పు.. గ్లోబల్ యాక్షన్ అవసరమని మోదీ పిలుపు

PM Modi at Summit of the Future at UN: ప్రపంచ శాంతికి టెర్రరిజం పెనుముప్పు అని, ప్రపంచ సంస్థల్లో సంస్కరణలు చేపట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమతిలో జరిగిన సమ్మిట్ ఆఫ్ ద ప్యూచర్ మీటింగ్ లో నరేంద్ర మోదీ పాల్గొని సుదీర్ఘంగా ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా శాంతి వర్ధిల్లాలని ఆశించారు.


ప్రపంచ శాంతి, అభివృద్ధి విషయంలో ప్రపంచ సంస్థల్లో సంస్కరణలు కీలకమని ప్రధాని మోదీ వెల్లడించారు. ప్రస్తుతం ఆధునీకరణకు సంస్కరణలు చాలా ముఖ్యమని చెప్పారు. సంయుక్తంగా కలిసి ఉండడంలోనే మానవత్వం విజయం సాధిస్తుందని, యుద్ధ రంగంలో కాదని మోదీ తెలిపారు.

ప్రపంచ శాంతికి టెర్రరిజం పెనుముప్పుగా మారగా.. సైబర్, మారిటైం, స్పేస్ రంగాల్లో పలు కొత్త సవాళ్లు ఎదురువుతున్నాయని మోదీ గుర్తు చేశారు. గ్లోబల్ యాంబీషన్ సాధించేందుకు గ్లోబల్ యాక్షన్ సాధించేందుకు గ్లోబల్ యాక్షన్ అవసరమని మోదీ పిలుపునిచ్చారు. సుస్థిరాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూనే మానవ సంక్షేమం, ఆహారం, ఆరోగ్య భద్రత కల్పించాలన్నారు.


భారత్‌లో 25 కోట్ల మందిని పేదరికంలో నుంచి బయటకు తీసుకొచ్చామని మోదీ వివరించారు. దీంతో సుస్థిరాభివృద్ధిని సాధించవచ్చని నిరూపించినట్లు చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించిన విషయాలతో పాటు తీసుకున్న చర్యలను ప్రపంచంతో పంచుకునేందుకు భారత్ సిద్ధంగా ఉందని మోదీ వెల్లడించారు.

ఇదిలా ఉండగా, అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ న్యూయార్క్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోల్డమిర్ జెలెన్ స్కీని కలిశారు. ఈ మేరకు ద్వైపాక్షిక చర్చల్లో పాల్గోన్నారు. అయితే నెల రోజుల వ్యవధిలోనే వీరిద్దరూ ఇలా కలవడం రెండోసారి. అంతకుముందు ఆగస్టు 23న ఉక్రెయిన్ లో మోదీ పర్యటించిన విషయం తెలిసిందే.

Also Read: ప్రవాస భారతీయులే బ్రాండ్ అంబాసిడర్లు.. అమెరికా పర్యటనలో మోదీ

కాగా, ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన ముగిసింది. ఈ మేరకు అమెరికాలో తీసుకున్న నిర్ణయాలపై పలువురు సీఎంలు ప్రశంసల వర్షం కురిపించారు.దీంతోపాటు నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు.

Related News

Earthquake Japan: జపాన్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.9 తీవ్రత.. సునామీ హెచ్చరికలు!

Israel-Hezbollah: భీకర దాడులతో దద్దరిల్లిన లెబనాన్‌.. 356 మంది మృతి!

Chinese Rocket: ల్యాండింగ్ సమయం.. ఒక్కసారిగా పేలిన చైనా రాకెట్

Boy Kidnapped Returns After 70 Years: 1951లో పిల్లాడు కిడ్నాప్.. 70 ఏళ్ల తరువాత గుర్తుపట్టిన ఫ్యామిలీ..

Sri Lanka: శ్రీలంక ప్రధాని రాజీనామా.. కొత్త అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకరం చేయనున్న దిసనాయకె

Man Wins Energy Drink Lottery: రొటీన్ గా సూపర్ మార్కెట్ వెళ్లాడు.. అనుకోకుండా రూ.8 కోట్ల జాక్ పాట్ కొట్టాడు!

Big Stories

×