EPAPER

PM Modi’s Ukraine and Poland Visit: ఉద్రిక్తతల మధ్య మోదీ ఉక్రెయిన్ పర్యటన

PM Modi’s Ukraine and Poland Visit: ఉద్రిక్తతల మధ్య మోదీ ఉక్రెయిన్ పర్యటన

PM Modi’s Ukraine and Poland Visit Modi ahead of two-nations tour: మూడో సారి ప్రధాని పదవిని చేపట్టాక మోదీ విదేశీ పర్యటనలపై దృష్టి సారించారు. విదేశాలతో భారత దౌత్య సంబంధాలను పునరుద్ధరించే ప్రక్రియలో భాగంగా నరేంద్ర మోదీ ఉక్రెయిన్, పోలెండ్ దేశాల పర్యటనకు బయలుదేరారు. తొలుత పోలెండ్ దేశాన్ని సందర్శించి ఆ తర్వాత ఉక్రెయిన్ వెళ్లనున్నారు మోదీ. ఉక్రెయిన్ దేశాధ్యక్షుడు జెలెన్ స్కీ ఆహ్వానం మేరకు ఆ దేశాన్ని సందర్శిస్తున్నట్లు ప్రదాని మోదీ తన సోషల్ మీడియా ఎక్స్ ద్వారా పోస్ట్ పెట్టారు. కేవలం భారత్ ఉక్రెయిన్, పోలెండ్ ల మధ్య వాణిజ్యపరమైన దౌత్య సంబంధాలను బలంగా చేసేందుకు ఈ విదేశీ పర్యటన చేపట్టినట్లు మోదీ తెలిపారు. పోలెండ్ తో భారత వాణిజ్య, దౌత్స సంబంధాలను డెభ్బై ఏళ్లు పూర్తవుతున్నాయని పోలెండ్ తో భారత సంబంధాలు ఈ పర్యటనతో బలోపేతం అవుతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు మోదీ. ఆ దేశ అధ్యక్షుడు అండ్రేజ్ దుడా, ప్రధాని డొనాల్డ్ టస్క్ లతో కీలక భేటీ కానున్నామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా పోలెండ్ లో భారత సంతతి ప్రజలను కూడా కలవనున్నామని చెప్పారు. అలాగే ఉక్రెయిన్ దేశానికి తొలిసారి ప్రధాని హోదాలో అడుగుపెడుతున్నామని మోదీ తెలిపారు. ప్రస్తుతం ఉక్రెయని్, రష్యా దేశాల మధ్య గత కొంతకాలంగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయని..త్వరలోనే ఉక్రెయిన్ లో శాంతి నెలకొనాలని అన్నారు. అక్కడి పౌరులంతా స్వేచ్ఛాయుత వాతావరణంలో జీవించాలని రుకుంటున్నారని..త్వరలోనే అన్ని సమస్యలు తొలగిపోతాయని మోదీ అన్నారు.


ట్రైన్ ఫోర్స్ వన్ లో ప్రయాణం

ఈ నెల 23న ట్రైన్ ఫోర్స్ వన్ లో ప్రధాని మోదీ ఉక్రెయిన్ కు వెళ్లనున్నారు. చాలా మంది ప్రపంచ దేశాధినేతలంతా ఇందులోనే ప్రయాణించారు. ఈ రెండు దేశాల పర్యటన సంతృప్తికరమైన వాతావరణంలో చర్చలు జరగాలని కోరుకుంటున్నానని మోదీ అన్నారు. భారత్ కు అటు రష్యా, ఇటు ఉక్రెయిన్ రెండూ కావసనిన దేశాలే..ఇరు దేశాలు భారత్ కు మిత్ర దేశాలే. ప్రస్తుతం ఈ రెండు దేశాల మధ్య ఉత్కంఠకర వాతావరణం నెలకొంది. ఈ రెండు దేశాల శతృత్వంతో మూడో ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం ఉందని ప్రపంచ మేధావులు అంచనాలు వేస్తున్నారు. అదే జరిగితే ప్రపంచ వినాశనం తప్పదు. ఇప్పటికే జరిగిన రెండు ప్రపంచ యుద్ధాలతో చాలా వరకూ చిన్నదేశాలకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇప్పుదు మరో సారి మూడో ప్రపంచ యుద్ధాన్ని కోరుకోవడం లేదు ఏ ఒక్కరూ..ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల మధ్య మోదీ ఉక్రెయిన్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.


Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Big Stories

×