EPAPER

PM Modi On Russia Visit| రష్యాకు బయలుదేరిన ప్రధాని మోదీ.. ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తరువాత ఇదే తొలిసారి!

PM Modi On Russia Visit| రష్యాకు బయలుదేరిన ప్రధాని మోదీ.. ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తరువాత ఇదే తొలిసారి!

PM Modi On Russia Visit| మూడోసారి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రష్యా, ఆస్ట్రియా దేశాల పర్యటనకు బయలుదేరారు. షెడ్యూల్ ప్రకారం.. ముందుగా ఆయన రష్యా రాజధాని మాస్కో చేరుకుంటారు. మంగళవారం అక్కడ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశంలో పాల్లొంటారు. ఆ తరువాత జూలై 9న ఆస్ట్రియాకు బయల్దేరనున్నారు.


రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య సుదీర్ఘకాలంగా జరుగుతున్న యుద్దం మొదలైన తరువాత భారత ప్రధాని రష్యా పర్యటనపై వెళ్లడం ఇదే తొలిసారి కావడం విశేషం. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఖండిస్తూనే.. సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ఇండియా తొలినుంచి తన అభిప్రాయం వ్యక్తం చేస్తూనే ఉంది.

Also Read: Joe Biden| బైడెన్ పనితీరుపై సందేహాలు!.. అధ్యక్ష ఎన్నికల నుంచి వైదొలగాలని డెమోక్రాట్ సెనేటర్ల సూచన


భారత్-రష్యా సంబంధాలను ప్రశంసించిన ప్రధాని మోదీ
తన పర్యటనకు ముందు, ప్రధాన మంత్రి రెండు దేశాల మధ్య సంబంధాలకు ఒక ప్రత్యేకత ఉందని ప్రశంసించారు. గత 10 సంవత్సరాలలో రష్యాతో ఇండియా సంబంధాలు అభివృద్ధి చెందాయని అన్నారు.. “తన స్నేహితుడు” పుతిన్‌తో ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలను సమీక్షించడానికి తాను ఎదురుచూస్తున్నానని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. అయితే, రష్యా సైన్యంలో బలవంతంగా పని చేస్తున్న భారతీయుల సమస్యపై దృష్టి సారిస్తారా లేదా అనే విషయాన్ని ప్రధాని ప్రకటనలో ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. అయితే, విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా.. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. యుద్ధ ప్రాంతంలో భారతీయుల సమస్యకు రష్యా సమావేశంలో ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు.

ప్రధాని మోదీ రష్యా పర్యటన పూర్తి షెడ్యూల్
జూలై 5న జరిగిన MEA ప్రత్యేక బ్రీఫింగ్ ప్రకారం, ప్రధాని మధ్యాహ్నం మాస్కోలో ల్యాండ్ అవుతారని, ఆయనకు వనుకోవో విమానాశ్రయంలో ఘనమైన స్వాగత కార్యక్రమాలు ఏర్పాటు చేశారని క్వాత్రా తెలిపారు. అనంతరం ప్రధాని కట్టుదిట్టమైన భద్రతతో తన హోటల్‌కు వెళ్లనున్నారు.

Also Read: Myanmar Fake Job Alert| మయన్మార్‌లో నకిలీ ఉద్యోగాల రాకెట్.. భారత్ ఐటీ నిపుణులే టార్గెట్!

సాయంత్రం ప్రెసిడెంట్ పుతిన్ డాచా (రష్యన్ వేసవి ఇల్లు)లో ప్రధానమంత్రి కోసం ఒక ప్రైవేట్ విందును ఏర్పాటు చేశారు. రష్యన్ బాస్ ఇలాంటి విందు కొంతమంది ప్రపంచ నాయకులకు మాత్రమే అందించే ప్రత్యేక సంజ్ఞ.

మరుసటి రోజు, ప్రధాన మంత్రి మోదీ రష్యాలోని భారతీయ వ్యాపార, విద్యార్థి సంఘాలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం ప్రధాని మోదీ, పుతిన్ తో రహస్య సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశంలోని అంశాల గురించి విదేశాంగ శాక ఎటువంటి సమాచారం వెల్లడించలేదు.

 

 

Related News

Continent Turns Green: అక్కడ మొక్కలు మొలిచాయంటే.. భూమి అంతమైనట్లే, శాస్త్రవేత్తల తాజా పరిశోధనలో తేలింది ఇదే!

Conflict: మూడో ప్రపంచ యుద్ధం తప్పదా..?

Dominica Citizenship: ‘ఎవరైనా రావొచ్చు’.. తక్కువ ధరకే పౌరసత్వం విక్రయిస్తున్న దేశం ఇదే..

Elon Musk Brazil: బ్రెజిల్‌లో ట్విట్టర్ ఎక్స్ ఆగని కష్టాలు.. తప్పుడు బ్యాంకులో ఫైన్ చెల్లింపులు!

India’s Iron Dome: ఇండియాపై శత్రువులు మిసైల్ దాడి చేస్తే పరిస్థితి ఏంటి? ఇజ్రాయెల్ తరహా యాంటి మిసైల్ టెక్నాలజీ మన దగ్గర ఉందా?

Trump Advice To Israel: ‘ఇరాన్ అణు స్థావారాలపై వెంటనే దాడి చేయండి’.. ఇజ్రాయెల్ కు ట్రంప్ సలహా

Israel India Iran: ‘దాడి చేయవద్దని ఇండియా ద్వారా ఇరాన్‌కు ముందే హెచ్చరించాం’.. ఇజ్రాయెల్ అంబాసిడర్

×