EPAPER

Modi wishes to Yunus: బంగ్లాలో హిందువులకు భరోసా ఇవ్వండి.. కొత్త ప్రధాని యూనుస్ కి మోదీ వినతి

Modi wishes to Yunus: బంగ్లాలో హిందువులకు భరోసా ఇవ్వండి.. కొత్త ప్రధాని యూనుస్ కి మోదీ వినతి

PM Extends Best Wishes To Muhammad Yunus Says Hopes For Safety Of Hindus: దేశవ్యాప్త హింసాత్మక చర్యలు, అల్లర్లతో అట్టుడికిపోతున్న బంగ్లాదేశ్ లో మెల్లిగా శాంతియుత పరిస్థితులు నెలకొంటున్నాయి. అక్కడ తాత్కాలిక ప్రధానిగా నోబెల్ బహుమతి గ్రహీత మహ్మద్ యూనుస్ పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. నూతన ప్రధాని మహ్మద్ యూనిస్ కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తన అధికారక ఎక్స్ వేదికగా బంగ్లా నూతన ప్రధానికి ఓ సందేశం పంపించారు. గత కొంతకాలంగా బంగ్లాదేశ్ లో శాంతియుత పరిస్థితితులు నెలకునేలా నూతన ప్రధాని కృషి చేయాలని ఆకాంక్షించారు. బంగ్లాదేశ్ తో ఎప్పటిలాగానే భారత్ స్నేహ బంధం కొనసాగిస్తుందని.. ఇరు దేశాల మధ్య గతంలో మాదిరిగానే సంబంధ బాంధవ్యాలు కొనసాగించాలని భారత్ భావిస్తోందని.. ఇందుకు నూతన ప్రధానిగా పదవీ ప్రమాణం చేసిన మహ్మద్ యూనుస్ తన వంతు సహకారం అందజేస్తారని కోరారు.


వేలాది విద్యార్థుల భవిత ప్రశ్నార్థకం

బంగ్లాదేశ్ లో అల్లర్ల కారణంగా వేలాది భారత విద్యార్థుల భవిత ఆందోళనకరంగా మారిందని.. సాధ్యమైనంత త్వరలో ప్రత్యామ్నాయ మార్గం చూపాలని అన్నారు. అలాగే బంగ్లాదేశ్ అల్లర్లలో జరిగిన హింసాత్మక సంఘటనలతో అక్కడి మైనారిటీ హిందువులు భయాందోళనల మధ్య జీవిస్తున్నారని.. అటువంటి వారికి నూతన ప్రభుత్వం భరోసా ఇవ్వాలని.. కొంతమంది తమ ప్రాణాలను రక్షించుకునేందుకు సొంత ఇల్లు, ఆస్తులు అక్కడే వదిలేసి కట్టుబట్టలతో భారత్ కు వచ్చేశారని అన్నారు. బంగ్లాదేశ్ నూతన ప్రభుత్వం తక్షణమే వారు పోగొట్టుకున్న ఆస్తులను తిరిగి వారికి అప్పగించే ప్రయత్నాలు చేయాలని ప్రధాని మోదీ ఆకాంక్షిస్తున్నారు.


ఎన్నికలు జరిపించండి

ఇరు దేశాలు బంగ్లాదేశ్ లో శాంతి భద్రతలు నెలకొనే విధంగా అడుగులు వేద్దామని ఎక్స్ వేదికగా మోదీ బంగ్లాదేశ్ నూతన ప్రధానిని కోరారు. భారత విదేశాంగ శాఖ ప్రతినిధి కూడా ఈ సందర్భంగా స్పందించారు. హిందూ ఆలయాలను, మహిళలను టార్గెట్ చేస్తూ అక్కడ దుండగులు రెచ్చిపోతున్నారని.. ఇప్పటికైనా ఇలాంటి హింసాత్మక చర్యలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. సాధ్యమైనంత తొందరలో బంగ్లాదేశ్ లో ఎన్నికలు జరిపించాలని ప్రపంచ దేశాలు సూచిస్తున్నాయి. అలా జరిగితేనే బంగ్లాదేశ్ లో శాంతియుత పరిస్థితులు నెలకొంటాయని చెబుతున్నారు.

Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Big Stories

×