EPAPER

Paris Train Network Vandalised| పారిస్ రైలు నెట్‌వర్క్ ధ్వంసం చేసిన దుండగులు.. ట్రైన్ లో చిక్కుకున్న ఒలింపిక్స్ క్రీడాకారులు!

Paris Train Network Vandalised| పారిస్ రైలు నెట్‌వర్క్ ధ్వంసం చేసిన దుండగులు.. ట్రైన్ లో చిక్కుకున్న ఒలింపిక్స్ క్రీడాకారులు!

Paris Train Network Vandalised| ప్రాన్స్ దేశ రాజధాని పారిస్ నగరంలో ఒలింపిక్స్ క్రీడల ప్రారంభోత్సవానికి ముందు కొందరు దుండగులు శుక్రవారం నగరానికి చెందిన హై స్పీడ్ టిజివి రైల్వే నెట్ వర్క్‌ని ధ్వంసం చేశారు. దీంతో పారిస్ నగరానికి ఇతర నగరాల నుంచి రాకపోకలు చేసే రైళ్లన్నీ ఆగిపోయాయి. దాదాపు 8 లక్షల మంది ప్రయాణికులకు అసౌకర్యం కలిగింది.


ముఖ్యంగా ఒక ట్రైన్ లో పారిస్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొనడానికి వెళుతున్న పలువురు క్రీడాకారులున్నారు. ఆ ట్రైన్ కూడా మార్గ మధ్యలోనే ఆగిపోయింది. ఒలింపిక్స్ వేడుకకు సరిగ్గా కొన్ని గంటల ముందు ఈ విధ్వంసం చేసిన దుండగులెవరో తెలియలేదు. ఈ ఘటనపై ఫ్రాన్స్ ఆపధర్మ్ ప్రధాన మంత్రి గేబ్రియల్ అటల్ మాట్లాడుతూ.. ”ఈ దాడి ఎవరు చేశారో.. ఇంతవరకూ స్పష్టం కాలేదు. కానీ ఒక్కటి మాత్రం తెలిసింది. ఇదంతా ఒక ముఠా ఉద్దేశపూర్వకంగా చేసింది. ఈ దాడి ఒక ప్లాన్ ప్రకారం చేశారు. దాడి చేసిన వారికి నగర రైల్వే నెట్ వర్క్ ఎలా పనిచేస్తుందో పూర్తిగా తెలుసు. త్వరలోనే వారికి పట్టుకుంటాం,” అని అన్నారు.

Also Read: ’50 ఏళ్లు సాయం చేసినందుకు థ్యాంక్స్ ‘.. బైడెన్‌ రిటైర్మెంట్ సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధాని


కేవలం పారిస్ నగరానికి రాకపోకలు చేసే రైల్వే నెట్ వర్క్ ని మాత్రమే దుండగులు ధ్వంసం చేశారు. ఫ్రాన్స్ దేశానికి ఇతర పొరుగు దేశాలకు రాకపోకలు చేసే రైలు మార్గాల్లో ఏ సమస్య లేదని స్థానిక మీడియా తెలిపింది. ఈ ధ్వంసం జరిగిన వెంటనే పారిస్ నగరానికి వెళ్లే రైళ్లన్నీ మధ్యలోనే ఆగిపోయాయి. వీటిలో రెండు ట్రైన్లలో దాదాపు 1000 మంది ఒలింపిక్స్ క్రీడాకారులున్నారు. వారంతా ప్రారంభోత్సవ వేడుకకు వెళ్లడానికి ఇబ్బందులు పడ్డారు.

ట్రైన్లు నిలిచిపోవడంతో ఆ తరువాత బయలుదేరాల్సిన రైళ్లన్నీ గంటలతరబడి ఆలస్య మయ్యాయి. దీని వల్ల దాదాపు 8 లక్షల మంది ఇబ్బందులు పడ్డారని సమాచారం.

ఫ్రాన్స్ లోని టిజివి నెట్ వర్క్.. దేశంలోని ఇంటర్ హై స్పీడ్ ట్రైన్స్ రాకపోకలను నిర్వహిస్తుంది. ఈ నెట్ వర్క్ సెంటర్లలోని సిగ్నల్స్ ని పేలుడు పదార్థాలతో ధ్వంసం చేసినట్లు నెట్ వర్క్ ఆపరేటర్ చీఫ్ తెలిపారు. ఈ ఘటన జరిగిన వెంటనే దుండగులను పట్టుకోవడానికి, ఒలింపిక్స్, ట్రైన్ ల భద్రత కోసం ఫ్రాన్స్ ప్రభుత్వం 45 వేల మంది పోలీసులు, పది వేల మంది సైనికులు, రెండు వేల మంది ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెంట్లను రంగంలోకి దింపింది. ఎత్తైన భవనాల మీద స్నైపర్ గన్లు, డ్రోన్లతో నిఘా ఏర్పాట్లు చేశారు. ఒలింపిక్స్ క్రీడలకు గట్టి బందోబస్తు చేశారు.

Also Read:‘ఆ సామాజిక వర్గంపై దాడులు ఆపండి’.. పాకిస్తాన్ కు ఐరాస మానవ హక్కుల సంఘం హెచ్చరిక

 

Related News

Crime: స్కూల్ బాత్రూంలో కాల్పులు.. బాలుడు మృతి

Russia president Putin: కమలా హ్యారిస్ కు జై కొట్టిన రష్యా అధ్యక్షుడు పుతిన్

USA Gun Fire: తండ్రి గిఫ్ట్‌గా ఇచ్చిన గన్‌తోనే స్కూల్‌లో అరాచకం.. ఐదుగురిని కాల్చి చంపిన ఆ నిందితుడి వయస్సు 14 ఏళ్లే!

PM Modi: భారత్‌లోనూ సింగపూర్‌లను సృష్టిస్తున్నాం: మోదీ

Muhammad Yunus: షేక్ హసీనాకు యూనస్ స్ట్రాంగ్ వార్నింగ్.. ఎందుకంటే ?

Japan Resignation Companies: ఉద్యోగుల చేత రాజీనామా చేయించడం కూడా ఒక బిజినెస్.. జపాన్ లో కొత్త వ్యాపారం

US’s Georgia school shooting: అమెరికాలో మళ్లీ కాల్పులు.. ఈసారి స్కూల్ లో.. నలుగురు మృతి

Big Stories

×