EPAPER

Pakistan : పాక్ లో ఆటో మొబైల్ పరిశ్రమ కుదేలు .. నెలకు కేవలం 5,000 కార్లే అమ్మకం.!

Pakistan : పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ పతనానికి చేరింది. ప్రజలకు తినడానికి తిండి కూడా దొరకని పరస్థితి నెలకొంది. అప్పుల కోసం విదేశాలకు తిరగడం రాజకీయ నాయకులనకు , అధికారలకు అలవాటుగా మారిపోయింది. ఆర్థిక వ్యవస్థ పతనంతో ఆటో మొబైల్స్ పరిశ్రమ కూడా పూర్తిగా దెబ్బతింది.

Pakistan : పాక్ లో ఆటో మొబైల్ పరిశ్రమ కుదేలు .. నెలకు కేవలం 5,000 కార్లే అమ్మకం.!

Pakistan : పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ పతనానికి చేరింది. ప్రజలకు తినడానికి తిండి కూడా దొరకని పరస్థితి నెలకొంది. అప్పుల కోసం విదేశాలకు తిరగడం పాకిస్తాన్ రాజకీయ నాయకులకు , అధికారలకు అలవాటుగా మారిపోయింది. ఈ తరుణంలో ఆర్థిక వ్యవస్థ పతనంతో ఆటో మొబైల్స్ పరిశ్రమ కూడా పూర్తిగా దెబ్బతింది.


పాక్ ప్రభుత్వం విద్యుత్ , గ్యాస్ ,పెట్రోల్ ఇలా అన్నిటిపై విపరితంగా పన్నులు పెంచేసింది. పాక్ లో కేవలం గతేడాది ఇదే కాలానికి 15,432 కార్లు అమ్ముడయ్యాయి. కానీ ఈ ఏడాది 4875 కార్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఇంత తక్కువ సంఖ్యలో అమ్మకాలు జరగడానికి కారణం కార్ల కంపెనీలు విపరీతంగా ధరలను పెంచడమే. దీంతో ఆర్థికంగా చితికిపోయిన సామాన్యులు కార్లు కొనుగోలు చేయ్యడానికి అనాశక్తి చూపిస్తున్నారు. ప్రభుత్వం అధిక పన్నులు విధించడం కూడా అక్కడి ఆటో మొబైల్ పరిశ్రమ పతానానికి దారి తీసింది. దిగ్గజ కార్ల కంపెనీలు కూడా పాకిస్తాన్‌లో దివాలా స్థితికి చేరుకున్నాయి.

సుజుకి కంపెనీ ఈ ఏడాది అమ్మకాలు 72శాతం క్షీణించాయి. ఇండస్ మోటర్ కంపెనీ లిమిటెడ్ 71 క్షీణత నమోదు చేసింది. చాలా కంపెనీలు ఉత్పత్తులను నిలిపివేశాయి. పాకిస్తాన్‌లో ఒక నెలలో అమ్ముడుపోయే కార్లను భారతదేశంలో కేవలం 10గంటల్లోనే అమ్ముడు అవుతున్నాయి. భారత దేశంలో కేవలం నవంబర్ నెలలోనే 3.6 లక్షలు కార్ల అమ్మకాలు జరిగాయి. దాదాపు ఒక గంటకు 500 కార్లు అమ్మకం జరిగినట్లు ఎఫ్ఏడీఏ(Federation of Automobile Dealers Associations) తన నివేదికలో పేర్కొంది.


Tags

Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Big Stories

×