EPAPER
Kirrak Couples Episode 1

Pakistan Diplomat Convoy: పాకిస్తా‌న్ లో రష్యా, ఇరాన్ సహా 12 మంది డిప్లమాట్స్ పై బాంబు దాడి.. పోలీస్ ఆఫీసర్ మృతి

Pakistan Diplomat Convoy: పాకిస్తా‌న్ లో రష్యా, ఇరాన్ సహా 12 మంది డిప్లమాట్స్ పై బాంబు దాడి.. పోలీస్ ఆఫీసర్ మృతి

Pakistan Diplomat Convoy: పాకిస్తాన్ లోని స్వాట్ వ్యాలీలో ఆదివారం పర్యటనకు వెళ్లిన ఇరాన్, రష్యా సహా ఇతర దేశాల 12 మంది డిప్లొమాట్స్ పై బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో సెక్యూరిటీ గా వెళ్లిన వారిలో ఒక పోలీస్ ఆఫీసర్ చనిపోగా మరో నలుగురు ఆఫీసర్లుకు గాయాలయ్యాయి.


స్వాట్ వ్యాలీలోని లోకల్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఆ ప్రాంతాన్ని టూరిస్ట్ డెస్టినేషన్ గా అభివృద్ధి చేసేందుకు 12 మంది డిప్లొమాట్స్ (ఇండోనేషియా, పోర్చుగల్, కజకిస్తాన్, బోస్నియా, హెర్జెగోవినా, జింబాబ్వే, రువాండా, తుర్క్మెనిస్తాన్, వియత్నాం, ఇరాన్, రష్యా మరియు తజికిస్తాన్) ఆహ్వానించింది. వారంతా స్వాట్ వ్యాలీ పర్యటనకు వెళ్లినప్పుడు ఈ బాంబు దాడి జరిగింది.

Also Read: పండుగ రోజు విషాదం.. ఇడ్లీ తిని వ్యక్తి మృతి.. అత్యాశకు పోయి


ఈ ఘటన గురించి స్వాట్ జిల్లా డెప్యూటి ఇన్‌స్పెక్టర్ జెనెరల్ (DIG) మీడియాతో మాట్లాడుతూ.. ”విదేశాలకు చెందిన 12 మంది దౌత్యాధికారుల డెలిగేషన్ స్వాట్ వ్యాలీ సందర్శనకు వచ్చినప్పుడు.. వారికి సెక్యూరిటీ కాన్వాయ్ అందించాం. డిప్లొమాట్స్ కాన్వాయ్.. మలమ్ జబ్బా అనే హిల్ స్టేషన్, స్కీ రిసార్ట్ కు వెళ్లే మార్గంలో బాంబు దాడి జరిగింది. అయితే బాంబు సెక్యూరిటీ కాన్వాయ్ వాహనంపై పడింది. బాంబు పేలుడు ఘటనలో కానిస్టేబుల్ బుర్హాన్ మరిణించాడు. మరో ఇద్దరు కానిస్టేబుళ్లు, ఒక సబ్ ఇన్‌స్పెక్టర్ కు తీవ్ర గాయాలయ్యాయి. డిప్లొమాట్స్ అందరూ సురక్షితంగా ఉన్నారు. వారందరినీ ఇస్లామాబాద్ కు సురక్షితంగా తరలించాం.” అని తెలిపారు.

ఈ బాంబు పేలుడు ఎవరు చేశారనేది ఇంతవరకు తెలియలేదు. ఇది ఉగ్రవాద సంస్థల పనే అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఆసిఫ్ అలీ జర్దారీ , ప్రధాన మంత్రి షెష్‌బాజ్ షరీఫ్ ఈ బాంబు దాడి ఘటనను ఖండించారు.

Also Read:  జూపార్క్ లో పాండాలను చూడడానికి ఎగబడిన జనం.. నకిలీ పాండాలని తెలియడంతో హంగామా!

పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయం ఈ ఘటనపై ఒక ప్రకటన విడుదల చేసింది. ”డిప్లొమాట్స్ అందరూ సురక్షితంగా ఇస్లామాబాద్ చేరుకున్నారు. ఇలాంటి హింసాత్మక ఘటనలు.. ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు పాకిస్తాన్ చేస్తున్న పోరాటాన్ని ఆపలేవు.” అని ప్రకటనలో ఉంది.

స్వాట్ వ్యాలీలో చాలా సంవత్సరాలుగా ఇస్లామిస్ట్ మిలిటెంట్లు.. హింసాత్మక దాడులు చేస్తున్నారు. వారిని అడ్డుకునేందకు పాకిస్తాన్ ప్రభుత్వం కౌంటర్ టెర్రరిస్ట్ ఫోర్స్ ని స్వాట్ వ్యాలీలో మోహరించింది. గత రెండు సంవత్సరాలుగా ఈ ఇస్లామిస్ట్ మిలిటెంట్లు యాక్టివ్ ఉన్నారని పోలీసులు తెలిపారు.

2012లో ఈ ఇస్లామిస్ట్ మిలిటెంట్లే నోబెల్ పీస్ ప్రైజ్ గ్రహీత మలాలా యూసఫ్‌జాయి.. స్వాట్ వ్యాలీ పర్యటనకు వచ్చినప్పుడు ఆమెపై దాడి చేశారు. ఈ దాడిల ఆమె తీవ్రంగా గాయిపడింది.

Related News

Boy Kidnapped Returns After 70 Years: 1951లో పిల్లాడు కిడ్నాప్.. 70 ఏళ్ల తరువాత గుర్తుపట్టిన ఫ్యామిలీ..

Sri Lanka: శ్రీలంక ప్రధాని రాజీనామా.. కొత్త అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకరం చేయనున్న దిసనాయకె

Man Wins Energy Drink Lottery: రొటీన్ గా సూపర్ మార్కెట్ వెళ్లాడు.. అనుకోకుండా రూ.8 కోట్ల జాక్ పాట్ కొట్టాడు!

PM Narendra Modi: ప్రవాస భారతీయులే బ్రాండ్ అంబాసిడర్లు.. అమెరికా పర్యటనలో మోదీ

Chiranjeevi : గిన్నిస్ రికార్డులో మెగాస్టార్ కి చోటు.. అమీర్ ఖాన్ చేతుల మీదుగా..!

Iran coal mine: ఇరాన్‌లో ఘోర విషాదం.. భారీ పేలుడుతో 30 మంది మృతి

Big Stories

×