EPAPER

Israel Hamas War: ప్రశాంతంగా ఉన్న ప్రజల జీవితాలను అల్లకల్లోలం చేసిన హామాస్-ఇజ్రాయెల్ వార్.. నేటికి ఏడాది పూర్తి

Israel Hamas War: ప్రశాంతంగా ఉన్న ప్రజల జీవితాలను అల్లకల్లోలం చేసిన హామాస్-ఇజ్రాయెల్ వార్.. నేటికి ఏడాది పూర్తి

One year of Israel-Hamas war: అక్టోబర్ 7, 2023. సరిగ్గా ఏడాది క్రితం. ఆ నరమేధానికి ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. యుద్దరీతుల్లో , గూఢచర్యంలో ప్రపంచంలో నెంబర్‌వన్‌గా ఉన్న ఇజ్రాయెల్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఇజ్రాయెల్‌పై మెరుపుదాడి చేశారు హమాస్‌ తీవ్రవాదులు. హమాస్ చేసిన ఆ ఒక్క అటాక్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కి శాపంగా మారింది. నాడు హమాస్ మొదలు పెట్టిన యుద్ధానికి ఇజ్రాయెల్ ఇంకా జవాబు ఇస్తూనే ఉంది.


సరిగ్గా ఏడాది క్రితం మ్యూజిక్ ఫెస్టివల్ లో హమాస్ ఉగ్రవాదులు విచక్షణ రహితంగా దాడికి తెగబడ్డారు. తొలిదాడిలో సుమారు 14 వందల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 250 మందికిపైగా సామాన్య ప్రజలను హమాస్ ఉగ్రవాదులు బందీలుగా తీసుకెళ్లారు. బందీల్లో కనీసం వంద మందిని వారు హతమార్చినట్లు ఇజ్రాయెల్ చెబుతోంది. ఏడాదిగా జరుగుతున్న ఈ మారణ హోమం ఇంకా కొనసాగుతోంది. హమాస్‌పై చేసే దాడిలో భాగంగానే ఇజ్రాయెల్ అంచనా వేయలేని దాడులు కూడా ప్రారంభించింది. ఈ వ్యూహంలో భాగంగా, సిరియాలోని ఇరాన్ కాన్సులేట్‌పై ఏప్రిల్‌లో జరిగిన వైమానిక దాడిలో పలువురు ఇరాన్ టాప్ కమాండర్లు మరణించారు.

అయితే ఇరాన్ ఆ తర్వాత ఇజ్రాయెల్‌ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పింది. డ్రోన్లు, రాకెట్ల‌తో ఇజ్రాయెల్‌పై దాడి చేసింది. అదే సందర్భంలో.. ఇజ్రాయెల్ తనను తాను రక్షించుకోవడానికి అవసరమైన ఏ చర్యనైనా చేస్తుంది అని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చెప్పారు. అయితే, ఇజ్రాయెల్ కాస్త సమయం తీసుకుంది. ఇరాన్‌ను అయోమయంలోకి నెట్టింది. అయితే జూలై 31న, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ప్రమాణ స్వీకారోత్సవానికి అతిథిగా టెహ్రాన్‌‌కి వచ్చిన హమాస్ రాజకీయ నాయకుడు ఇస్మాయిల్ హనియేను ఇజ్రాయెల్ చంపింది. ఈ పరిణామంతో, రెండవ రౌండ్‌లో, అక్టోబర్ 1న దాదాపు 200 బాలిస్టిక్ క్షిపణులతో ఇరాన్ ఇజ్రాయెల్‌పై దాడి చేసింది. ఈ క్షిపణి దాడి, టెహ్రాన్‌లో హనియేను చంపినందుకు ప్రతిస్పందన అని ఇరాన్ చెప్పింది. అయితే ఇలాంటి ప్రతిస్పందన కోసమే ఇజ్రాయెల్ వేచి చూసిందా అనేది తేలాల్సి ఉంది.


ఇజ్రాయెల్‌పై ఇరాన్ చేసిన రెండవ దాడి తర్వత కూడా ఇజ్రాయెల్ వేగంగా స్పందించలేదు. ఇప్పటికీ, తాను హిజ్బుల్లాపై చేస్తున్న యుద్ధాన్ని మాత్రమే కొనసాగిస్తోంది. అయితే, హిజ్బుల్లా అగ్రనేత హసన్ నస్రల్లాను చంపినందుకు ప్రతీకారంగా, అక్టోబర్ 1 రాత్రి ఇరాన్ 200 క్షిపణులతో ఇజ్రాయెల్‌పై విరుచుకుపడింది. దీనితో.. ఇరాన్ పెద్ద తప్పు చేసిందని, దానికి తగిన మూల్యం చెల్లించుకుంటుందని, మాపై ఎవరు దాడి చేసినా మేం వారిపై దాడి చేస్తామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చెప్పారు. నిజానికి, ఇప్పుడు ఇజ్రాయెల్ వంతు. కానీ, ఇప్పటి వరకూ ఇరాన్‌పై ప్రత్యక్షంగా ఎలాంటి దాడీ చేయలేదు. లెబనాన్‌లో హిజ్బుల్లాను ఏరిపారేసే పనిపైన దృష్టి పెట్టింది. ఇలా ఇజ్రాయెల్ ఎందుకు గ్యాప్ తీసుకుందన్నది అందరి మదిలో మెదులుతున్న సందేహం. ఒకవేళ, దశాబ్ధాలుగా అక్టోబర్ 7కి ఉన్న చరిత్రను మళ్లొకసారి గుర్తుచేద్దామని ఇజ్రాయెల్ వేచి చూస్తుందనే అనుమానాలు కలుగుతున్నాయి. అక్టోబరు 7 నాటికి మధ్య ప్రాశ్చంలో సామాన్య ప్రజలు ఊహించిన పెద్ద ప్రమాదమేదో కళ్ల ముందుకొస్తుందని భయపడుతున్నారు.

Also Read: ఇరాన్‌పై దాడికి ఇజ్రాయెల్ వ్యూహం ఇదే!

ఇరాన్‌ మిస్సైళ్ల దాడుల తర్వాత ఇజ్రాయెల్‌ ప్రతీకారంతో రగులుతోందన్నది స్పష్టమే. కానీ ప్రతీకారం తీర్చుకోవడానికి ఎందుకు ఎదురుచూస్తోంది. ఒకవేళ, ఇరాన్‌‌పై దాడి అనివార్యమైతే ఇజ్రాయెల్ చేసే యుద్ధం ఇరాన్‌తో మాత్రమే ఉండదు. అది, ప్రస్తుతానికి, సిరియా, యెమెన్‌లను తాకినా.. తర్వాత, యోమ్ కిప్పూర్ యుద్ధంలా అరబ్ దేశాలన్నింటికీ పాకుతుందనే భయం కావచ్చు. అయితే, ఈసారి ఇజ్రాయెల్‌కు అమెరికా మరింత బలంగా సహకరిస్తుంది. ఇప్పటి వరకూ ఇజ్రాయెల్ అంతర్జాతీయ చట్టాలను ఎన్ని సార్లు అతిక్రమించినప్పటికీ అమెరికా కిమ్మనకుండా ఉంది. ఇప్పుడు, ఇజ్రాయెల్ యుద్ధానికి దిగితే.. ఇరాన్‌లోని చమురు, సహజవాయువు క్షేత్రాలు, అణు స్థావరాలను టార్గెట్‌ చేస్తుందనే సమాచారం ఉంది. అయితే, అణు స్థావరాలను మాత్రం తాకొద్దని అమెరికా చెబుతున్నప్పటికీ, ఇజ్రాయెల్ వింటుందా అనేది సందేహం. ఇక, ఇరాన్‌పై యుద్ధంలో ఇరాన్‌ని ఆర్థికంగా, సైనికపరంగా దెబ్బతియ్యడం లక్ష్యంగా పెట్టుకుంది. అంత వరకూ అంతా ఊహించేదే కానీ, అంతకుమించి, అక్టోబర్ 7న ఇంకా ఏదో జరుగుతుందనే అనుమానాలు లేకపోలేదు. అయితే, అది ఇజ్రాయెల్ నుండి వస్తుందా.. లేదంటే, ఇరాన్ చేస్తుందా అనేది ఇప్పటికైతే అంతుబట్టడం లేదు. ఏది ఏమైనా, అక్టోబర్ 7 పెద్ద టార్గెట్ ఏదో హిట్ కానుందనే అభిప్రాయం అందరిలోనూ ఉంది.

ప్రస్తుతం లెబనాన్‌ సరిహద్దు గ్రామాల్లో ఇజ్రాయెల్‌ బలగాలకు, హిజ్బుల్లా సైన్యానికి మధ్య భీకర పోరు జరుగుతోంది. హిజ్బుల్లా అంతమే లక్ష్యంగా లెబనాన్‌లో ఇజ్రాయెల్‌ యుద్ధం చేస్తోంది. మరోవైపు గాజా, సిరియాలపై కూడా ఇజ్రాయెల్‌ విరుచుకుపడుతుంది. కానీ, రెండు సార్లు తమపై అటాక్ చేసిన ఇరాన్‌ విషయంలో మాత్రం ఇంకా స్పందించలేదు. ఎందుకిలా చేస్తుందనేది పెద్ద ప్రశ్నగా ఉంది. ఇజ్రాయెల్ మైండ్‌లో ఉన్న వ్యూహమేంటో ఎవ్వరికీ అర్థం కావట్లేదు. అందుకే, ఈ వైటింగ్ అంతా అక్టోబర్ 7 అంటే ఈరోజు కోసమేనా అనే అనుమానం కలుగుతోంది.

 

Related News

Israel-Iran War: ఇజ్రాయెల్ మరోసారి భీకర దాడులు.. 24 మంది మృతి.. విమానాలు రద్దు చేసిన ఇరాన్

Elon Musk: ట్రంప్ ర్యాలీలో మస్క్ మామ డ్యాన్స్.. ఇలా తయారయ్యావేంటి సామి

Continent Turns Green: అక్కడ మొక్కలు మొలిచాయంటే.. భూమి అంతమైనట్లే, శాస్త్రవేత్తల తాజా పరిశోధనలో తేలింది ఇదే!

Conflict: మూడో ప్రపంచ యుద్ధం తప్పదా..?

Dominica Citizenship: ‘ఎవరైనా రావొచ్చు’.. తక్కువ ధరకే పౌరసత్వం విక్రయిస్తున్న దేశం ఇదే..

Elon Musk Brazil: బ్రెజిల్‌లో ట్విట్టర్ ఎక్స్ ఆగని కష్టాలు.. తప్పుడు బ్యాంకులో ఫైన్ చెల్లింపులు!

×