EPAPER

Norovirus Usa: నోరొవైరస్‌తో అమెరికన్ల బెంబేలు

Norovirus Usa: నోరొవైరస్‌తో అమెరికన్ల  బెంబేలు
noro virus usa


Norovirus is spreading in US states: అమెరికాలోని ఈశాన్య ప్రాంతాన్ని సరికొత్త వైరస్ ప్రబలింది. పొత్తికడుపునకు సంబంధించిన నోరొవైరస్ విస్తృతంగా వ్యాపిస్తోంది. ఈ కేసులు మూడువారాల సగటు 13.9 శాతానికి పెరిగిందని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(CDC) డేటా చెబుతోంది.

డిసెంబరు నెల నుంచి ఈ వైరస్ పాజిటివిటీ రేటు పదిశాతంగా నమోదైంది. అమెరికా దక్షిణ ప్రాంతంలో ఇది 9.5%, మిడ్‌‌వెస్ట్‌లో 10%, పశ్చిమ ప్రాంతంలో 12% గా ఉంది. ఈ వైరస్ బారిన పడినవారు వాంతులు, డయేరియాతో బాధపడతారు. ఆహారం వల్ల అనారోగ్యానికి గురవుతారు.

ఈ వైరస్ సులువుగా, వేగంగా వ్యాప్తి చెందుతుందని సీడీసీ తెలిపింది. లైఫ్‌టైమ్‌లో ఎన్నో సార్లు ఈ వైరస్ బారిన పడొచ్చు. అయితే అవన్నీ నోరొవైరస్‌కు చెందిన వేర్వురు రకాలు. ఒక రకం వైరస్ మాత్రం ఇన్ఫెక్షన్‌‌ను కలగజేస్తుంది. కొన్ని రకాల నోరొవైరస్‌లను ఎదుర్కొనే శక్తి, రక్షణ మన శరీరం స్వయంగా కల్పించగలిగినా.. అది ఎంత కాలం ఉంటుందన్న విషయం కచ్చితంగా తెలియదు.
శీతాకాలంలో, వేసవికి ముందు ఈ వైరస్ మరింతగా ప్రబలుతుంది.


బాధితుల్లో తలనొప్పి, ఒంటినొప్పులు, డీహైడ్రేషన్ వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఏటా 19 నుంచి 21 మిలియన్ల కేసులు వెలుగుచూస్తాయని సీడీసీ అంచనా. వీరిలో 1,09,000 మంది ఆస్ప్రతులను ఆశ్రయించగా.. 900 మరణాలు సంభవిస్తుంటాయి. వయోధికులు ఎక్కువగా దీని బారిన పడతారు.

Tags

Related News

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Longest working hours: ఈ దేశాలకి వెళ్లే అవకాశం వచ్చినా వెళ్ళకండి.. అత్యధిక పని గంటలు ఉన్న దేశాలు ఇవే..

Nigeria boat accident : నైజీరియాలో బోటు ప్రమాదం..64 మంది మృతి

Sunita williams: అంతరిక్ష కేంద్రం నుంచి ఓటేస్తానంటున్న సునీతా విలియమ్స్

US Teacher Student Relation| 16 ఏళ్ల అబ్బాయితో టీచర్ వివాహేతర సంబంధం.. విద్యార్థి తండ్రి తెలుసుకొని ఏం చేశాడంటే?..

Big Stories

×