EPAPER

Jacinda: ఆ సామర్థ్యం లేనప్పుడు కొనసాగలేం.. న్యూజిలాండ్ ప్రధాని రాజీనామా

Jacinda: ఆ సామర్థ్యం లేనప్పుడు కొనసాగలేం.. న్యూజిలాండ్ ప్రధాని రాజీనామా


Jacinda: న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ సంచలన ప్రకటన చేశారు. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన రాజీనామాకు ఇదే తగిన సమయమని వెల్లడించారు. జెసిండా తీసుకున్న నిర్ణయంతో ఆదేశ ప్రజలతో పాటు ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోతున్నాయి. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో, క్రైస్ట్‌చర్చ్ నగరంలోని ఓ చర్చిపై ఉగ్రదాడి జరిగిన సమయంలో ఆమె వ్యవహరించిన తీరుపై ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు.

జెసిండా పదవికి రాజీనామా చేసినప్పటికీ.. ఫిబ్రవరి 7 వరకు ఆ పదవిలో కొనసాగనున్నారు. ఆ తర్వాత అక్టోబర్ 14న జరగనున్న సార్వత్రిక ఎన్నికల వరకు ఎంపీగా కొనసాగుతారు. జెసిండా రాజీనామాతో కొత్త ప్రధానిని ఈ నెల 22న ఎన్నుకోనున్నారు. 2017లో మొట్టమొదటిసారి న్యూజిలాండ్ ప్రధానిగా ఎన్నికైన జెసిండా.. 2020లో జరిగిన ఎన్నికల్లో లేబర్ పార్టీ విజయం సాధించడానికి ఎంతగానో కృషి చేశారు.


ఒక దేశానికి నాయకత్వం వహించడం అనేది అత్యంత ఉన్నతమైందని.. ప్రభుత్వాన్ని నడిపే పూర్తి సామర్థ్యం లేనప్పుడు ముందుకు కొనసాగలేమని లేబర్ పార్టీ నేతలతో జెసిండా అన్నారు. రానున్న ఎన్నికల్లో తమ పార్టీ తప్పకుండా విజయం సాధించగలదని ధీమావ్యక్తం చేశారు. తన రాజీనామా వెనుక ఎటువంటి రహస్యం లేదని చెప్పుకొచ్చారు.

Tags

Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Big Stories

×