EPAPER

Nepal’s prime minister: విశ్వాస పరీక్షలో ఓడిపోయిన ప్రచండ..కుప్పకూలిన నేపాల్ ప్రభుత్వం

Nepal’s prime minister: విశ్వాస పరీక్షలో ఓడిపోయిన ప్రచండ..కుప్పకూలిన నేపాల్ ప్రభుత్వం

Nepal’s prime minister loses: నేపాల్‌ రాజకీయాల్లో మరోసారి కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రభుత్వంపై పెట్టిన విశ్వాస తీర్మానంలో ప్రధాని పుష్ప కమల్ దహాల్ ‘ప్రచండ’ ఓడిపోయారు. 275 మంది సభ్యులు ఉన్న హౌజ్ ఆప్ రిప్రజెంటేటివ్స్‌లో ప్రచండకు కేవలం 63 మంది మాత్రమే మద్దతు పలకగా.. 194 ఓట్లు విశ్వాస పరీక్షకు వ్యతిరేకంగా వచ్చాయి.


నేపాల్ పార్లమెంట్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు 138 ఓట్ల మెజార్టీ అవసరం ఉంటుంది. అయితే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ యూనిఫైడ్ మార్క్సిస్స్ లెనినిస్ట్ ప్రచండ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడంతో విశ్వాస పరీక్ష అనివార్యమైంది. దీంతో ప్రస్తుత ప్రభుత్వం కూలిపోయినట్లయింది.

ప్రచండ నాయకత్వంలోని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ మావోయిస్ట్ సెంటర్ అధికార బదలాయింపు ఒప్పందం పాటించకపోవడంతో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ యూనిఫైడ్ మార్క్సిస్స్ లెనినిస్ట్ ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ యూనిఫైడ్ మార్క్సిస్స్ లెనినిస్ట్‌కు మాజా ప్రధాని కేపీ శర్మ ఓలీ నాయకత్వం వహిస్తున్నారు.


నేపాల్ ప్రధానిగా 2022 డిసెంబర్ 25న పుష్ప కమల్ దహల్ ప్రచండ బాధ్యతలు చేపట్టారు. మాజీ ప్రధాని ఓలీ నేతృత్వంలోని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ యూనిఫైడ్ మార్క్సిస్స్ లెనినిస్ట్‌తో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఈ క్రమంల ప్రచండ ఇప్పటికే మూడు సార్లు విశ్వాసం ఎదుర్కొన్నారు.

ఇదిలా ఉండగా, మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ నేతృత్వంలోని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ యూనిఫైడ్ మార్క్సిస్స్ లెనినిస్ట్ గత వారం సభలో అతిపెద్ద పార్టీ అయిన నేపాలీ కాంగ్రెస్‌తో అధికారం కోసం ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ప్రచండ నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంది. నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూర్ దేవుబా ఇప్పటికే ఓలీని తదుపరి ప్రధానమంత్రిగా ఆమోదించారు.

Also Read: మళ్లీ తడబడిన జోబైడెన్.. ఈసారి ఏమన్నారంటే..?

నేపాల్ పార్లమెంట్‌లో నేపాల్ కాంగ్రెస్‌కు 89 సీట్లు ఉండగా.. సీపీఎన్ యూఎంఎల్‌కు 78 సీట్లు ఉన్నాయి. మెజార్టీకి అవసరమైన 138 సీట్లు కంటే వీరి బలం 167గా ఉంది. కాగా, ప్రచండకి చెందిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ మావోయిస్ట్ సెంటర్‌కు 30 మంది సభ్యుల బలం మాత్రమే ఉంది.

Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Big Stories

×