EPAPER

NATO Warns Iran, China| ‘రష్యాకు ఆయుధాల సరఫరా ఆపండి’.. ఇరాన్, చైనాలకు నాటో వార్నింగ్!

అమెరికాలో బుధవారం నాటో దేశాల 32 మంది నాయకులు సమావేశమయ్యారు. సమావేశంలో రష్యాకు చైనా, ఇరాన్ చేస్తున్న మిలటరీ సహాయాన్ని వ్యతిరేకిస్తూ.. ప్రకటన చేశారు. ఆ తరువాత వైట్ హౌస్ లో విందు కార్యక్రమంలో పాల్గొన్నారు. 2019 తరువాత చైనాను తీవ్ర పదజాలంతో విమర్శిస్తూ నాటో సభ్య దేశాలు ప్రకటన విడుదల చేయడం ఇదే తొలిసారి.

NATO Warns Iran, China| ‘రష్యాకు ఆయుధాల సరఫరా ఆపండి’.. ఇరాన్, చైనాలకు నాటో వార్నింగ్!

NATO Warns Iran, China| ఉత్తర అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (NATO) సభ్య దేశాల నాయకులు బుధవారం రష్యాకు మిలిటరీ ఆయుధాల సరఫరా నిలిపివేయాలని ఇరాన్, చైనా‌ను హెచ్చరించారు. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణకు ఇరాన్, చైనా మద్దతు కొనసాగిస్తే.. తీవ్ర పరిణామాలు ఉంటాయని డిక్లరేషన్ విడుదల చేశారు.


అమెరికాలో బుధవారం నాటో దేశాల 32 మంది నాయకులు సమావేశమయ్యారు. సమావేశంలో రష్యాకు చైనా, ఇరాన్ చేస్తున్న మిలటరీ సహాయాన్ని వ్యతిరేకిస్తూ.. ప్రకటన చేశారు. ఆ తరువాత వైట్ హౌస్ లో విందు కార్యక్రమంలో పాల్గొన్నారు. 2019 తరువాత చైనాను తీవ్ర పదజాలంతో విమర్శిస్తూ నాటో సభ్య దేశాలు ప్రకటన విడుదల చేయడం ఇదే తొలిసారి.

ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో యూరోపియన్ యూనియన్ దేశాల కూడా రష్యాపై ఆంక్షలు విధించాయి. రష్యాకు వందలాది కమికేజ్ మిలిటరీ డ్రోన్‌ లు, క్షిపణులు ఇరాన్ సరఫరా చేస్తోంది. రష్యాకు ఇరాన్ మిలిటరీ సహాయం చేయడం వల్ల యూరో అట్లాంటిక్ దేశాలు భద్రతకు ముప్పు పొంచి ఉందని నాటో దేశాలు అభిప్రాయం వ్యక్తం చేశాయి. నెల రోజుల క్రితం ఇటలీలో జరిగిన సమావేశంలో జీ సెవెన్ దేశాలు.. రష్యాకు ఎటువంటి ఆయుధాలు సరఫరా చేయకూడదని ఇరాన్ కు హెచ్చరించాయి.


ఫిబ్రవరిలో బాలిస్టిక్ మిసైల్స్, డ్రోన్స్, అన్ క్రూడ్ ఏరియల్ వెహికల్స్.. తక్కువ ధరకే రష్యాకు అనధికారికంగా ఇరాన్ సరఫరా చేస్తోందని రాయిటర్స్ వార్తా సంస్థ నివేదిక ద్వారా తెలుస్తోందని.. యుకె రక్షణ కార్యదర్శి గ్రాంట్ షాప్స్ అన్నారు. బాలిస్టిక్ మిసైల్స్ తయారు చేసే ఫాక్టరీలను ఇరాన్ లో మరింత వ్యాప్తి చేసిందని రాయిటర్స్ నివేదికలో ఇటీవలి ప్రచురించింది.

రష్యా, ఇరాన్ దేశాలపై ఇప్పటికే అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలు వ్యాపార్ ఆంక్షలు విధించాయి. అయినా రష్యా మిత్ర దేశాలైన చైనా, ఇరాన్ వాటిని లెక్క చేయకపోగా.. అమెరికా డాలర్స్ లో కాకుండా ఇతర కరెన్సీలో అంతర్జాతీయ లావాదేవీలే జరుపుతున్నాయి. ఇరాన్, రష్యా మధ్య అంతర్జాతీయ వాణిజ్యం 4 బిలియన్ డాలర్స్ కు చేరింది.

Also Read: ‘ఎన్నికల బరి నుంచి బైడెన్ తప్పుకోవడమే బెటర్’.. హలీవుడ్ సీనియర్ హీరో షాకింగ్ ప్రకటన!

మరోవైపు చైనాకు వ్యతిరేకంగా నాటో దేశాలు హెచ్చరికలు జారీచేయడం అంతర్జాతీయంగా చాలా సీరియస్ అంశం. రష్యాకు సైనిక సహకారం చైనా అందిస్తోందని నాటో దేశాలు ఖండించడం ఇదే తొలిసారి.

ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు ఆయుధాలు, మిలిటరీ టెక్నాలజీ, కంప్యూటర్ చిప్స్ అందిస్తున్న చైనా.. దీని వల్ల యూరోపియన్ దేశాలకు జరిగే నష్టానికి కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని.. నాటో దేశాలు తీవ్ర స్వరంతో చెప్పాయి. చైనాకు వ్యతిరేకంగా మాట్లాడడానికి సంకోచించే నాటో దేశాలు.. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం.. ఇదే తొలిసారి.

Also Read: Donald Trump: బైడెన్‌కు ట్రంప్ సవాల్.. ఆటలో గెలిస్తే మిలియన్ డాలర్లు !

చైనా అందిస్తున్న మిలిటరీ టెక్నాలజీ ద్వారా రష్యాలో పెద్ద ఎత్తున మిలిటీరీ ఆయుధాల తయారీ జరుగుతోందని, ఈ రెండు దేశాల సైనికులు జాయింట్ ట్రైనింగ్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయని నాటో దేశాలు పేర్కొన్నాయి. చైనాపై మరిన్ని ఆర్థిక ఆంక్షలు విధించడానికి వెనుకాడబోమని తెలిపాయి.

 

Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Big Stories

×