EPAPER

NASA Dragon Fly: నాసా.. నెక్ట్స్ టార్గెట్ టైటాన్..

NASA Dragon Fly: నాసా.. నెక్ట్స్ టార్గెట్ టైటాన్..

NASA Dragon Fly: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా శాస్త్రవేత్తల తదుపరి లక్ష్యం శనిగ్రహం. ఇప్పటికే అంగారక గ్రహం(Mars)పై ల్యాండయ్యే దిశగా ఏర్పాట్లు చకచకా సాగిపోతున్నాయి. ఇది పూర్తయిన తర్వాత శాటర్న్‌ను నాసా టార్గెట్‌గా చేసుకోనుంది. సౌరవ్యవస్థలో సూర్యుడి నుంచి ఆరోగ్రహం ఇది. దీని చంద్రుడు టైటాన్‌(Titan)పై అన్వేషణ చేపట్టడమే నాసా తాజా ప్రాజెక్టు. ఈ మిషన్‌ను నాసా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది.


ఇందుకోసం డ్రాగన్‌ఫ్లై మిషన్‌ను చేపడుతోంది. పేరుకు తగ్గట్టే చూసేందుకు ఇది తూనీగలా ఉంటుంది.
ఒక చోటి నుంచి మరో చోటికి తుర్రున ఎగరగలిగే ల్యాండర్. వాస్తవానికి ఇదో
రోటార్ క్రాఫ్ట్. 2026లో డ్రాగన్‌ఫ్లై‌ను టైటాన్ పైకి పంపుతుంది. 2034 నాటికి ఇది శనిగ్రహానికి ఉన్న అతిపెద్ద చంద్రుడే టైటాన్‌ను చేరుతుంది.

టైటాన్‌ను ఇప్పటివరకు ఎవరూ పూర్తి స్థాయిలో పరిశీలించలేదు. ఈ మిషన్‌పై నాసా ఎన్నో ఆశలు పెట్టుకుంది. మన సౌర వ్యవస్థలో.. జీవుల మనుగడకు అనుకూలమైన వాతావరణం, ఆర్గానిక్ ఇసుకదిబ్బలు, మంచుతో నిండి ఉన్న ఉపగ్రహం ఇదే కావడం ఇందుకు కారణం.


భూమిలాగే టైటాన్‌పైనా నైట్రోజెన్ ఆధారిత వాతావరణం ఉంటుంది. అక్కడా మేఘాలు వర్షిస్తాయి. కానీ భూమిలాగా నీటిని కాకుండా మిథేన్‌ను అవి వర్షిస్తాయి.
మన చందమామ కంటే టైటాన్ కాస్త పెద్దది. ఉపరితలంపై ఉష్ణోగ్రత మైనస్ 179 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.

టైటాన్‌పై ఏయే రసాయనాలు ఉన్నాయన్నదీ డ్రాగన్ ఫ్లై పరిశీలిస్తుంది.
ఇక్కడి ఆర్గానిక్ ఇసుకతిన్నెలు వేల సంవత్సరాల క్రితం నాటివి. టైటాన్‌పై ఆర్గానిక్ పదార్థాలు ఏమిటన్నదీ డ్రాగన్ ఫ్లై తెలుసుకుంటుంది. ఇప్పటికే అక్కడ జీవుల మనుగడ ఉందా? లేదా? అన్నది ధ్రువీకరించుకోవడం ఈ మిషన్ ప్రధాన లక్ష్యం.

శనిగ్రహం దగ్గరకు 1997లో నాసా క్యాసినీ మిషన్‌ (Cassini mission)ను పంపింది. అది అప్పుడే టైటాన్‌ని కొద్దిగా పరిశీలించింది. ఆ తర్వాత దానిపై మరిన్ని సందేహాలు తలెత్తాయి శాస్త్రవేత్తలకు. ఇప్పుడు వాటికి సమాధానాలు వెతికేందుకే డ్రాగన్ ఫ్లై మిషన్‌ను చేపడుతోంది నాసా.

భూమిలాగానే.. టైటాన్‌పై ఇసుక దిబ్బలు, సరస్సులు, పర్వతాలు ఉన్నట్టుగా క్యాసినీ పంపిన వివరాల వల్ల బోధపడింది. ఆ సమాచారం అందుకున్న నాసాకు టైటాన్‌పై ఆశలు మరింతగా పెరిగాయి. ఆవాసానికి భవిష్యత్తులో అది మరో భూగోళం కాగలదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

2005లో క్యాసినీ హ్యూజెన్స్ మాడ్యూల్.. టైటాన్‌కు సంబంధించి కొద్ది డేటాను మాత్రమే ఇచ్చింది. అది దిగిన చోట… గడ్డకట్టిన నీటి నుంచి బుడగలు రావడం శాస్త్రవేత్తలు గమనించారు. ఉపరితలం కూడా కాషాయ వర్ణాన్ని సంతరించుకుని ఉంది. టైటాన్‌పైకి పంపే ల్యాండర్ 175 కిలోమీటర్ల దూరానికి పైగా ఎగరగలదు. మార్స్ రోవర్లన్నీ ప్రయాణించిన దూరం కంటే ఇది రెట్టింపు. ఇసుక దిబ్బలను దాటుకుంటూ టైటాన్ వాతావరణంలో కిలోమీటర్ల కొద్దీ ఎగరగలగడం ఈ రోటార్ క్రాఫ్ట్ ప్రత్యేకత.

డ్రోన్ తరహాలో ఉండే డ్రాగన్ ఫ్లై బరువు 400 నుంచి 450 కిలోల వరకు ఉంటుంది.
రాత్రిళ్లు డ్రాగన్ ఫ్లై టైటాన్ ఉపరితలంపై ఉంటుంది. టైటాన్ రాత్రి మన భూమిపై 8 రోజులతో సమానం. అంటే 192 గంటలు. ఆ సమయంలో శాంపిళ్లు సేకరించడం, విశ్లేషించడం వంటి పనులను డ్రాగన్ ఫ్లై చక్కబెడుతుంది. టైటాన్ మిషన్ వ్యయం 850 మిలియన్ డాలర్లు. లాంచింగ్ ఖర్చులు కూడా కలిపితే వ్యయం 1 బిలియన్ డాలర్లకు చేరుతుంది.

Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Big Stories

×