EPAPER

Monkeypox: మంకీపాక్స్ కూడా ఎయిడ్స్ లాంటిదేనా? ఎలా వ్యాపిస్తుంది?

Monkeypox: మంకీపాక్స్ కూడా ఎయిడ్స్ లాంటిదేనా? ఎలా వ్యాపిస్తుంది?

Monkeypox or Mpox: మంకీ పాక్స్.. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఆఫ్రికా దేశంలో పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్న విషయం మనందరికి తెలిసిందే. రోజు రోజుకు మంకీ పాక్స్ పలు దేశాలకు విస్తరిస్తోంది. అసలు ఈ వైరస్ ఎలా సోకుతుంది. హెచ్ఐవి మాదిరిగానే మంకీ పాక్స్ కూడా వ్యాప్తి చెందుతుందా.. అంటే అవుననే చెప్పాలి. ఈ వైరస్ అధికంగా వ్యాప్తి చెందటానికి శృంగారమే ప్రధాన కారణం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తేల్చి చెప్పింది. మంకీ పాక్స్ ఉన్న వాళ్లు ఇతరులతో శారీరకంగా కలవడం కారణంగా వైరస్ వ్యాప్తి చెందుతుందని ఇటీవల WHO తెలిపింది. నిజంగానే హెచ్ఐవి మాదిరిగా మంకీ పాక్స్ సోకుతుందా లేదా అని తెలుసుకోవడానికి 2022లో వైరస్ సోకిన కొందరి వ్యక్తుల నుంచి వివరాలు సేకరించారు.


విక్టర్ అనుభవం.

జార్జియాలోని అట్లాంటా నివాసి అయిన 37 ఏళ్ల విక్టమ్ అనే వ్యక్తి తనకి మంకీ పాక్స్ సోకినప్పుడు ఎదురైన అనుభవాలు చెప్పాడు. ఆగష్టు 2022 లో ఒక రోజు తన ముఖంపై విచిత్రమైన మొటిమలు చూసి ఎంతగానో షాక్ అయ్యానని వివరించాడు. మొదట చిన్న చిన్న మొటిమలు అనుకున్నాను కానీ.. అవి రోజు రోజుకి ఎక్కువైనట్లు తాను వివరించాడు. తాను హాస్పిటల్ చేరగా అతనికి వైద్యులు మంకీ పాక్స్ వ్యాధి సోకిందని నిర్ధారించారు. ఆ సమయంలో తీవ్రమైన లక్షణాలలో తలనొప్పి, జ్వరం, టాన్సిల్ వాపు ఉన్నాయని వివరించాడు. కొద్ది రోజులు తర్వాత తన ముఖం బాగా వాచిపోయి, గొంతు మూసుకుపోయిందని వివరించాడు. తినడానికి, నిద్రపోవడానికి చాలా కష్టంగా ఉండేదని తెలిపాడు. మంకీ పాక్స్ రావడానికి కారణం శారీరకంగా ఓ వ్యక్తితో కలిసి ఉండటం వల్ల ఈ వ్యాధి సోకినట్లు తాను నమ్మానని చెప్పాడు.


ట్రిస్టన్ అనుభవం.

లండన్ కి చెందిన 31 ఏళ్ల ట్రిస్టన్ మంకీ పాక్స్ వ్యాధికి గురయ్యాడు. అతను మాట్లాడుతూ.. టురిన్ లో జరిగిన యూరోవిజన్ ఫైనల్ కి హాజరవుతున్నప్పుడు.. ఆ సమయంలో తనకు.. బాగా అలసి పోయినట్లు, తీవ్రమైన నడుము నొప్పి కలిగిందని చెప్పాడు. ఇక అక్కడ నుంచి లండన్ తిరిగి వచ్చిన తర్వాత.. అతని శరీరంపై కొన్ని మచ్చలు ఉండటం గమనించాడు. అయితే అతని శరీరంలో రోజు రోజుకి మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ తరుణంలో అతను వైద్యులను సంప్రదించగా.. మంకీపాక్స్ సోకిందని డాక్టర్లు నిర్ధారించారు. అతనికి చికిత్స అందించి ఐసోలేషన్ లో ఉంచారు. కొన్ని రోజులు తర్వాత అతనికి తగ్గిముఖం పట్టినట్లు పేర్కొన్నాడు.

Also Read: ఈ ఫేస్ ప్యాక్‌తో ముఖంపై మొటిమలు, మచ్చలు మాయం !

టామ్ పోరాటం

అట్లాంటాకు చెందిన 25 ఏళ్ల టామ్ కూడా మంకీ పాక్స్ వ్యాధికి గురయ్యాడు. మొదట పెదవిపై ఒక చిన్న గడ్డ లాగా వచ్చిందని.. ఆతర్వాత రోజు రోజుకి నోటి చుట్టూ, మిగతా శరీర భాగాలకు వ్యాప్తి చెందిందని పేర్కొన్నాడు. తీవ్రమైన తలనొప్పి వచ్చేదని.. ఆ సమయంలో తాను ఏంచేయాలో తెలియక ఏడుపు వచ్చేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తినడానికి కూడా కష్టంగా ఉండేదని, స్పూతీస్, ఆపిల్ సాస్ పైనే ఆధారపడ్డానని చెప్పుకొచ్చాడు. అయితే ఈ వ్యాధికి కారణం.. స్వలింగ సంపర్కుల బాత్‌హౌస్‌లో త్రీ-వే ముద్దు వల్ల తనకు మంకీపాక్స్  సోకిందని వివరించాడు. ఆ తర్వాత వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకున్నాని చెప్పాడు. ఈ వ్యాధి పూర్తిగా నయమైనప్పటికి.. భవిష్యత్తులో ఎక్కవయ్యే ప్రమాదం ఉందని టామ్ ఆవేదన వ్యక్తం చేశారు.

Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Big Stories

×