EPAPER

Mohamed al fayed Egypt: ‘400 మహిళలపై అత్యాచారం చేశాడు’.. ఈజిప్ట్ వ్యాపారవేత్తపై తీవ్ర ఆరోపణలు

Mohamed al fayed Egypt: ‘400 మహిళలపై అత్యాచారం చేశాడు’.. ఈజిప్ట్ వ్యాపారవేత్తపై తీవ్ర ఆరోపణలు

Mohamed al fayed Egypt| తమపై అత్యాచారం చేశాడని ఒక బడా వ్యాపారవేత్తపై 400 మందికి పైగా మహిళలు, సాక్షులు మీడియా ముందుకు వచ్చారు. అయితే ఆ నిందితుడు సంవత్సరం క్రితమే చనిపోయాడు. ఈ ఘటన బ్రిటన్ దేశంలో గురువారం అక్టోబర్ 31, 2024న జరిగింది.


వివరాల్లోకి వెళితే.. ఈజిప్ట్‌కు చెందిన బిలియనీర్ బిజినెస్‌మెన్ మొహమ్మద్ అల్ ఫయేద్ (94) ఆగస్టు 2023లో చనిపోయాడు. మొహమ్మద్ అల్ ఫయేద్‌కు బ్రిటన్ లో హర్రోడ్స్ పేరుతో ఒక పెద్ద సూపర్ మార్కెట్ డిపార్ట్‌మెంటల్ స్టోర్స్ బిజినెస్ ఉంది. అయితే సెప్టెంబర్ నెలలో ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ బిబిసి మొహమ్మద్ అల్ ఫయెద్ పై సెప్టెంబర్ 2024లో ఒక డాక్యుమెంటరి విడుదల చేసింది. అందులో దాదాపు 20 మందికి పైగా మహిళలు తమపై మొహమ్మద్ అల్ ఫయేద్ అత్యాచారం చేశాడని తమని లైంగికంగా వేధించాడని చెప్పారు.

అయితే ఈ సంఖ్య 20 కాదు 400కుపైగా ఉందని బ్రిటన్ లో మొహమ్మద్ అల్ ఫయేద్ కు వ్యతిరేకంగా లాయర్లు మీడియా ముందుకు వచ్చి తెలిపారు. వీరిలో హార్రోడ్స్ సూపర్ మార్కెట్స్ పనిచేస్తున్న మహిళలు, ఫుల్హామ్ ఫుట్‌బాల్ క్లబ్, పారిస్ లోిన రిట్జ్ హోటల్ లో ఉద్యోగం చేస్తున్నారే ఎక్కువ శాతం బాధితులుగా ఉన్నారు.


Also Read: సహజీవనం చేసిన వ్యక్తిపై రేప్ కేసు పెట్టిన యువతి.. ఈజీగా బెయిల్ తెచ్చుకున్న నిందితుడు.. ఎలాగంటే?

మొహమ్మద్ అల్ ఫయేద్ బాధితులంతా జస్టిస్ ఫర్ హర్రోడ్స్ సర్వైవర్స్ పేరుతో ఒక గ్రూప్ గా ఏకమై ఇప్పుడు న్యాయపోరాటం చేస్తున్నారు. వీరి తరపున బ్రిటన్ లాయర్లు డీన్ ఆర్మ్‌స్ట్రాంగ్, బ్రూస్ డ్రమ్మాండ్ న్యాయస్థానంలో వాదిస్తున్నారు. లాయర్లు డీన్, బ్రూస్ మాట్లాడుతూ.. ”ఇప్పటివరకు 421 మంది మహిళలు మొహమ్మద్ అల్ ఫయేద్ కు వ్యతిరేంగా ముందుకు వచ్చారు. వీరంతా లైంగికంగా వేధించబడ్డవారే. ఈ సంఖ్యలో ఇంకా పెరిగే అవకాశాలున్నాయి.” అని మీడియా సమావేశంలో లాయర్లు చెప్పారు.

ఈ 421 మందిలో ఎక్కువ శాతం యునైటెడ్ కింగ్‌డమ్ కు చెందినవారున్నారని.. అయితే తమకు ఇతర దేశాల నుంచి కూడా ఫిర్యాదులు అందుతున్నాయని.. తన కంపెనీల్లో పనిచేసే ప్రతి యువతిని మొహమ్మద్ అల్ ఫయేద్ వేధించాడని లాయర్ బ్రూస్ వెల్లడించారు. ఈ యువతుల తరపున హార్రోడ్స్ గ్రూప్ కంపెనీ యజమాన్యానికి లీగల్ నోటీసులు పంపించామని తెలిపారు. ఇలాంటి నోటీసులు వందల సంఖ్యలో పంపించాల్సి ఉందని అన్నారు.

మరోవైపు హార్రోడ్స్ కంపెనీ యజమాన్యం దీనిపై స్పందిస్తూ.. ఇప్పటివరకు 250 మంది మహిళలు తమను సంప్రదించారని.. వీరంగా కోర్టు బయట సెటిల్‌మెంట్ కోరుతున్నారని తెలిపింది. లండన్ మెట్రోపాలిటన్ పోలీసు అధికారులు కూడా తమను 60 మంది మహిళలు సంప్రదించారని.. వీరిలో 1979లో తమపై అత్యాచారం జరిగిందంటూ ఇప్పుడు కేసులు నమోదు చేశారని చెప్పారు. ఎక్కువ శాతం కేసులు 1979 నుంచి 2013 వరకు జరిగిన ఘటనలకు చెందినవని వెల్లడించారు.

హార్రోడ్స్ సూపర్ మార్కెట్ బిజినెస్ ని 1985లో కొనుగోలు చేసిన మొహమ్మద్ అల్ ఫయేద్ ఆరేళ్ల తరువాత ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో రిట్జ్ హోటల్, 1997లో ఫుల్హామ్ ఫుట్ బాల్ క్లబ్ ని కొనుగోలు చేశాడు.

మొహమ్మద్ అల్ ఫయేద్ బ్రిటన్ దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తల్లో ఒకరు. ఆయన కుమారుడు డోడి 1997లో జరిగిన పారిస్ కారు ప్రమాదంలో చనిపోయాడు. అయితే అతనితో పాటు ప్రస్తుత బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ 3 భార్య ప్రిన్సెస్ డయానా కూడా కారు ప్రమాదంలో చనిపోవడం గమనార్హం.

Related News

Iran War Khamenei: ‘చేతకాని వాళ్లం కాదు.. యుద్ధానికి సిద్ధం కండి’.. సైన్యానికి ఇరాన్ అధ్యక్షుడి ఆదేశం

Trump Hindus Minorities: ‘హిందువులను నిర్లక్ష్యం చేసిన కమలా హ్యారిస్, బైడెన్’.. ఎన్నికల ప్రచారంలో ట్రంప్ దాడి

Taliban New Rule : మితిమీరిన తాలిబన్ల ఆగడాలు.. మహిళలు మాట్లాడితే తుపాకీ గురే..

North Korea – US : ఉత్తర కొరియా ఖండాతర క్షిపణి ప్రయోగం.. అమెరికానే టార్గెట్ అంటున్న కిమ్ జోంగ్ ఉన్

Trump Garbage Truck: చెత్త ట్రక్కులో ట్రంప్.. బైడెన్ వ్యాఖ్యలకు గట్టి కౌంటర్

Israel Hezbollah: ‘ఇజ్రాయెల్‌తో సంధికి మేము రెడీ.. కానీ’.. హిజ్బుల్లా కొత్త చీఫ్ ప్రకటన

Big Stories

×