EPAPER

Interruption To Microsoft Services: మైక్రోసాఫ్ట్ ఎర్రర్.. ప్రపంచమంతా ఎఫెక్ట్

Interruption To Microsoft Services: మైక్రోసాఫ్ట్ ఎర్రర్.. ప్రపంచమంతా ఎఫెక్ట్
Interruption To Microsoft Services: ప్రపంచ వ్యాప్తంగా ఎదురైన సాంకేతిక సమస్య ఇప్పుడు గ్లోబల్‌ మార్కెట్‌ను బెంబేలెత్తిస్తోంది. మైక్రోసాఫ్ట్‌ విండోస్‌లో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా అనేక సర్వీసుల్లో అంతరాయం ఏర్పడుతోంది. విమాన సర్వీసుల దగ్గరి నుంచి బ్యాంకింగ్ వరకు అనేక రంగాల్లో సమస్యలు తలెత్తుతున్నాయి. సమస్య వెంటనే పరిష్కారం కాకపోతే పెద్ద ఎత్తున గందరగోళం తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి.

 


ఈ గ్లోబల్‌ ఐటి సమస్య మూలంగా.. భారత్‌లో అనేక దేశీయ విమానయాన సంస్థల్లో చెకిన్‌, బుకింగ్‌ సహా విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ఆస్ట్రేలియాలో వార్తా సంస్థల ప్రసారాల్లోనూ ఇబ్బందులు తలెత్తాయి. బ్రిటిష్‌ న్యూస్‌ ఛానెల్‌ స్కై న్యూస్‌ కూడా వార్తలను ప్రసారం చేయడంలో అవాంతరాలు ఎదుర్కొంది. ఆస్ట్రేలియాలోని వూల్‌వర్త్స్‌ అనే సూపర్‌మార్కెట్‌ సేవల్లోనూ అంతరాయం తలెత్తింది. పాయింట్‌ ఆఫ్‌ సేల్స్‌లో కస్టమర్ల బ్యాంకు కార్డులు కూడా పనిచేయడం లేదు. కొన్ని దేశాల్లో ఆన్‌లైన్‌తో అనుసంధానమై ఉన్న పోలీసుల వ్యవస్థలు సైతం క్రాష్‌ అయ్యాయి.

లండన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో కూడా సమస్యలు తలెత్తాయి. అక్కడి మెట్రో సర్వీసులు సైతం నిలిచిపోయినట్లు సమాచారం అందుతోంది. అమెరికా ఫెడరల్ ఏవియేషన్‌ అడ్మినిష్ట్రేషన్‌ కార్యకలాపాలు సైతం దెబ్బతిన్నాయి. అమెరికాలో 911 అత్యవసర సర్వీసుల్లోనూ ఇబ్బందులు ఏర్పడ్డాయి. గ్లోబల్ ఐటి సమస్య ఢిల్లీ విమానాశ్రయంలోని కొన్ని సర్వీసులపై ప్రభావం చూపింది. గ్లోబల్ ఐటి సమస్య కారణంగా, ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లోని కొన్ని సేవలు తాత్కాలికంగా ప్రభావితమయ్యాయి.


Also Read: అమెరికాలోనూ రుణమాఫీ? నిజమేనా?

ప్రయాణీకులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామంటూ ప్రకటించాయి ఢిల్లీ విమానాశ్రయ వర్గాలు. ఈ క్రమంలోనే దాదాపు అన్ని విమానయాన సంస్థలు కూడా వారి సమస్యను ఎక్స్‌ వెదికగా ప్రకటించాయి.
గ్లోబల్ ఐటి సమస్య తలెత్తిన క్షణాల్లోనే విమానయాన సంస్థలతో పాటు పలు వ్యాపార సంస్థలు వారి సర్వీసులకు అంతరాయం కలిగినట్టు ప్రకటించడంతో సామాన్య ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.

 

Tags

Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Big Stories

×