EPAPER

Miss South Africa Deaf: అందాల పోటీల్లో విన్నర్ గా దివ్యాంగురాలు.. వివాదాస్పదంగా మిస్ సౌత్ ఆఫ్రికా కాంపిటీషన్!

Miss South Africa Deaf: అందాల పోటీల్లో విన్నర్ గా దివ్యాంగురాలు.. వివాదాస్పదంగా మిస్ సౌత్ ఆఫ్రికా కాంపిటీషన్!

Miss South Africa Deaf| అందాల పోటీల్లో పాల్గొనే మహిళలకు అందం, శరీర సౌష్టవం, కొలతలు, ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధ్యానత ఉంటుంది. కానీ చరిత్రలో తొలిసారి ఒక దివ్యాంగురాలు అందాల పోటీల విజేతగా నిలిచింది. ఈ సంవత్సరం జరిగిన దక్షిణ ఆఫ్రిక అందాల పోటీల్లో విజేతగా మియా లి రౌక్స్ ని విన్నర్ ప్రకటించారు. 28 ఏళ్ల మియాకు చిన్నప్పటి నుంచే వినికిడి సమస్య ఉంది. మియా వయసు ఒక సంవత్సరం ఉన్నపప్పుడే డాక్టర్లు ఆమె చెవుల్లో తీవ్ర సమస్య ఉందని నిర్ధారించారు.


చెవిటి సమస్య వల్ల మియా తన జీవితంలో.. ఎదుటివారితో సంభాషణ విషయంలో చాలాసార్లు ఇబ్బందులు పడింది. అయినా అధైర్యపడకుండా సౌత్ ఆఫ్రికా అందాల పోటీల్లో పాల్గొనింది. విజేత పేరు ప్రకటించిన తరువాత ఆమెతో మీడియా మాట్లాడినప్పుడు మియా భావోద్వేగానికి లోనైంది. ఈ పోటీల్లో తన గెలుపు ని చూసి చాలామంది దివ్యాంగులకు ధైర్యం వస్తుందని. తమ కలలు సాకారం చేసుకునేందుకు అంగవైకల్యం అడ్డుకాదని వారు అర్థం చేసుకుంటారని తెలపింది. పోటీల్లో విన్నర్ గా తనకు లభించే ప్రైజ్ మనీని ఆర్థికంగా వెనుకబడిన వారికి, దివ్యాంగుల సహాయం కోసం ఉపయోగిస్తానని మియా ప్రకటించింది.

Also Read: నా ఈ మెయిల్స్ హ్యాక్ అయ్యాయి.. ఇదంతా ఇరాన్ వలనే అంటున్న డొనాల్డ్ ట్రంప్


మియా లి రౌక్స్ ఒక కోక్లియర్ పరికరం సహాయంతో తన వినికిడి సమస్యను అధిగమించగలిగారు. తనకు చినప్పుడు మాటలు పలకడానికి కూడా ఇబ్బంది ఉండేదని.. అందుకోసం రెండు సంవత్సరాలు స్పీచ్ ట్రీట్ మెంట్ తీసుకున్నానని తెలిపింది. ఒక కంపెనీలో మార్కెటెంగ్ మేనేజర్ గా ఉద్యోగం చేస్తున్నమిస్ సౌత్ ఆఫ్రికా పోటీలు విన్నర్ అయినందుకు గర్వంగా ఉందని చెప్పింది.

మరోవైపు మిస్ సౌత్ ఆఫ్రికా అందాల పోటీలు వివాస్పదంగా మారాయి. పోటీల ఫైనల్ రౌండ్ అర్హత సాధించిన మరో అభ్యర్థి చిడిమ్మా అదేషీనా (23)పై జ్యూరీ సభ్యులు అనర్హత వేటు వేశారు. ఆమె ఆఫ్రికన్ అయిన్పటికీ ఆమెకు నైజీరియా మూలాలున్నాయని.. నైజీరియాకు చెందిన వారు ఈ పోటీల్లో పాల్గొనడానికి వీల్లేదని సౌత్ ఆఫ్రికా కల్చరల్ మినిస్టర్ గేటన్ మెకన్జీ ట్విట్టర్ ఎక్స్ ద్వారా తెలిపారు.

Also Read: ‘కలియుగం.. ఆడవాళ్లు ఇలా కూడా చేస్తున్నారు’.. పాకిస్తాన్ లో డివోర్స్ పార్టీపై ట్రోలింగ్

అందాల పోటీ ఫైనలిస్ట్ అయిన చిడిమ్మా అదేషీనా తల్లి ఒక సౌత్ ఆఫ్రికన్, కానీ ఆమె తండ్రి నైజీరియా పౌరుడు. కానీ ఆమె కుటుంబం మరో ఆఫ్రికా దేశం మొజాంబిక్ లో స్థిరపడింది. అదేషీనా తనను పోటీ నుంచి తొలగించడంతో జ్యూరీ సభ్యులపై విమర్శలు చేసింది. నల్ల జాతీయులను ఆఫ్రికా దేశస్తులే ఇష్టపడరని సోషల్ మీడియా లో వ్యాఖ్యలు చేసింది. దీంతో అందాల పోటీల నిర్వహకులపై నెటిజెన్లు మండిపడుతున్నారు. ఈ కారణంగా మిస్ సౌత్ ఆఫ్రికా పోటీలపై విచారణ చేయాలని హోమ్ మినిస్టర్ లియోన్ ష్రెయిబర్ ఆదేశాలు జారీ చేశారు.

Also Read: డిగ్రీ చదవకుండానే సంవత్సరానికి రూ.5 కోట్లు సంపాదిస్తున్న యువతి.. ఎలాగంటే?..

Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Big Stories

×