Meta: మైక్రోబ్లాగింగ్ సంస్థ ట్విట్టర్ బ్లూటిక్ సబ్‌స్క్రిప్షన్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దీని ద్వారా జనరల్ యూజర్లు కూడా డబ్బులు చెల్లించి బ్లూటిక్ వెరిఫికేష్ అందుకోవచ్చు. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేశాక ఈ బ్లూటిక్ సబ్‌స్క్రిప్షన్‌ను తీసుకొచ్చాడు. ప్రస్తుతం ట్విట్టర్ బాటలోనే ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా నడుస్తోంది. బ్లూటిక్ సబ్‌స్క్రిప్షన్ పాలసీని మెటా అమల్లోకి తీసుకొచ్చింది.
ఇక నుంచి సాధారణ యూజర్లు కూడా ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ అకౌంట్లకు డబ్బులు చెల్లించి బ్లూటిక్ వెరిఫికేష్ పొందవచ్చు. ఇప్పటికే అమెరికాలో ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. వెబ్ వర్షన్‌పై 11.99 డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.990), మొబైల్ యాప్ వర్షన్‌లో వాడితే 14.99 డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.1230) చెల్లించాలి. అయితే వెబ్ వర్షన్‌కు ఫీజు పే చేసిన యూజర్లకు కేవలం ఫేస్‌బుక్‌లో మాత్రమే బ్లూ టిక్ వస్తుంది. అదే మొబైల్ వర్షన్ యూజర్లు మాత్రమే రెండు అకౌంట్స్‌లోనూ బ్లూ టిక్ పొందొచ్చు.
ఆర్థిక పరమైన నష్టాల నుంచి గట్టెక్కేందుకు ఈ నిర్ణయం తీసుకోలేక తప్పలేదని మెటా వెల్లడించింది. త్వరలోనే ఈ ఫీచర్‌ను భారత్‌తో పాటు ప్రపంచ దేశాల్లో అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించింది.