EPAPER

Canada Protests: కెనెడాలో దేశవ్యాప్తంగా భారీ నిరసనలు.. భయం గుప్పిట్లో 70 వేల విదేశీ విద్యార్థులు!

Canada Protests: కెనెడాలో దేశవ్యాప్తంగా భారీ నిరసనలు.. భయం గుప్పిట్లో 70 వేల విదేశీ విద్యార్థులు!

Canada Protests: కెనెడా దేశంలో ఇటీవల ప్రభుత్వం కొత్త విదేశీ విధానాలు తీసుకొచ్చింది. ముఖ్యంగా ఇమ్మిగ్రేషన్ పాలసీలో కీలక మార్పులు చేసింది. ఇందులో భాగంగా విదేశాల నుంచి కెనెడా వచ్చి ఉన్నత చదువులు అభ్యసించాలనే విద్యార్థులకు కష్టాలు మొదలయ్యాయి. విదేశీ విద్యార్థులకు ఇచ్చే విసాలపై ప్రభుత్వం పరిమితిని తగ్గించింది. పైగా చదువులు పూర్తి చేసి ఉద్యోగాల కోసం ప్రయత్నించే విద్యార్థులకు కూడా గడువు తగ్గించింది.


ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. కొత్త చట్టాలతో కెనెడాలో దేశ వ్యాప్తంగా 70 వేల మంది విద్యార్థులు తిరిగి తమ దేశాలకు వెళ్లిపోవాల్సి వస్తుంది. ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ.. భారీ సంఖ్యలో ప్రజలు రోడ్లపై నిరసనలు చేస్తున్నారు. ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. నిరసనలు చేస్తున్నవారిలో ఎక్కువగా భారతీయ విద్యార్థులే ఉండడం గమనార్హం.

కెనెడా లో తమ భవిష్యత్తు బాగుంటుందని భావించి చాలా ఖర్చు పెట్టి వచ్చామని.. అయితే కొత్త చట్టం తమ కలలను నాశనం చేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెనెడాలో చదువు పూర్తిచేసుకున్న విద్యార్థులకు ప్రభుత్వం వర్క్ పర్మిట్ గడువు ఇస్తుంది. ఈ గడువులోగా వారు ఉద్యోగం లో చేరాలి. లేదా తమ దేశానికి తిరిగి వెళ్లిపోవాలి. ఇప్పుడు కొత్త చట్టంతో ఆ గడువు మరింత తగ్గడంతో ఎక్కువ శాతం విదేశీ విద్యార్థులు డిసెంబర్ లోగా తమ దేశాలకు తిరిగి వెళ్లిపోవాల్సిన పరిస్థితి.


వేల మంది విదేశీ విద్యార్థులు కెనెడాలో శాశ్వత నివాస పర్మిట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే కొత్త చట్టం కారణంగా వారికి ఈ అనుమతి ఇక లభించదు. దీంతో వారంతా చదువుల కోసం తీసుకున్న భారీ రుణాలను ఎలా తిరిగి చెల్లించాలని? ప్రశ్నిస్తున్నారు.

Also Read:  ‘ఆఫీసు బయట బాస్ ఆదేశాలు పాటించాల్సిన అవసరం లేదు’.. అక్కడ కొత్త చట్టం!

నిరసనల్లో భాగంగా విద్యార్ధులు గ్రూపులుగా ఏర్పడి గత మూడు నెలలుగా ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్ లోని పార్లమెంట్ భవనం బయట టెంట్లలో నివసిస్తున్నారు. కొత్త చట్టం ప్రకారం.. ఇమ్మిగ్రేషన్ పాలసీలో కీలక మార్పుటు చేస్తూ.. కెనడా ప్రభుత్వం 25 శాతం పరిమితిని తగ్గించింది. ఈ మార్పు వల్ల ప్రత్యక్షంగా విదేశీ విద్యార్థుల పై ప్రభావం ఉంటుంది. కెనెడాలోని ఒన్టారియో, మానిటోబా, బ్రిటీష్ కొలంబియాలో భారీ స్థాయిలో విదేశీయలు నిరసనలు చేస్తున్నారు.

నిరసనలు చేస్తున్న భారతీయ విద్యార్థుల్లో మెహక్ దీప్ సింగ్ అనే మహిళా విద్యార్థి మాట్లాడుతూ.. ”నేను గత 6 ఏళ్లుగా కెనెడాలో నివసిస్తున్నాను. చదువు పూర్తిచేశాను. కొనాళ్లు ఉద్యోగం చేశాను. పన్నులు కట్టాను. చట్ట ప్రకారం.. సిఆర్‌ఎస్ ప్రక్రియ పూర్తిచేశాను. కానీ కెనెడా ప్రభుత్వం ఒక్కసారిగా నా పడిన కష్టాలను, శ్రమను దోచుకున్నాను. మా తల్లిదండ్రులు నా కోసం కోట్లు ఖర్చు పెట్టారు. ఇప్పుడదంతా వ్యర్థమైంది. ” అని ఆవేదన వ్యక్తం చేసింది.

కెనెడా లో భారీగా ఇమ్మిగ్రేషన్ సమస్య
కెనెడాలో విదేశీ విద్యార్థులు, తాత్కాలిక నివాస వీసాతో నివసించే విదేశీయులు పెరిగిపోవడంతో స్థానికులకు ఉద్యోగాల్లో సమస్య వస్తోందని భావించి ప్రభుత్వం ఈ చట్టం తీసుకువచ్చింది. అందుకే విద్య, వైద్యం రంగాలలో కఠిన నిర్ణయాలు తీసుకొచ్చింది. చదువులు పూర్తి చేసి టెంపరరీ జాబ్స్ చేస్తున్న విద్యార్థులు, విదేశీయుల పరిమితిని తగ్గిస్తూ.. నిర్ణియం తీసుకున్నామని ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో ట్వీట్ చేశారు. గత కొన్నేళ్లుగా లేబర్ మార్కెట్ లో ఉద్యోగాలు తగ్గిపోవడం వల్ల కెనడా దేశస్థులకు సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. అందుకోసం 2026 వరకు కెనెడా వచ్చి చదువుకోవాలనే విదేశీ విద్యర్థుల పరిమితి కూడా తగ్గించామని చెప్పారు.

Related News

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 9 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Longest working hours: ఈ దేశాలకి వెళ్లే అవకాశం వచ్చినా వెళ్ళకండి.. అత్యధిక పని గంటలు ఉన్న దేశాలు ఇవే..

Big Stories

×