EPAPER
Kirrak Couples Episode 1

Man Wins Energy Drink Lottery: రొటీన్ గా సూపర్ మార్కెట్ వెళ్లాడు.. అనుకోకుండా రూ.8 కోట్ల జాక్ పాట్ కొట్టాడు!

Man Wins Energy Drink Lottery: రొటీన్ గా సూపర్ మార్కెట్ వెళ్లాడు.. అనుకోకుండా రూ.8 కోట్ల జాక్ పాట్ కొట్టాడు!

Man Wins Energy Drink Lottery| మనలో చాలామంది జ్యూస్, కూల్ డ్రింక్స్ లాంటివి తీసుకొనేందుకు తరుచూ సూపర్ మార్కెట్ కు వెళుతుంటారు. అలా రోటీన్ గా వెళ్లినప్పుడు ఎప్పుడైనా మీరు కోట్ల రూపాయలు గెలుచుకున్నారు అని తెలిస్తే.. ఏం చేస్తారు? సంతోషంగా ఎగిరి గంతేస్తారు కదా. ఎందుకంటే అది అనుకోకుండా వచ్చిన అదృష్టం. ఇలాంటి అదృష్టం ఇటీవల ఒక యువకుడికి వరించింది.


వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలో రనౌకె నగరానికి చెందిన నికోలాస్ ఫాక్స్ అనే యువకుడు కొన్ని రోజుల క్రితం పక్కనే ఉన్న అల్టావిస్టా పట్టణంలో తన బంధువుల ఇంటికి వెళ్లాడు. అతనికి ప్రతి రోజు ఎనర్జీ డ్రింక్ తాడం అలవాటు. ఇంట్లో ఫ్రిడ్జ్ లో డ్రింక్స్ అయిపోతే తెచ్చుకోవడానికి పరిసరాల్లో ఉన్న ఎ1 మినీ మార్ట్ అనే సూపర్ మార్కెట్ కు వెళ్లాడు. అక్కడికి వెళ్లాక అతను కౌంటర్ వద్ద వర్జీనియా లాటరీ 20X మనీ గేమ్ అనే లాటరీ టికెట్లు చూశాడు. ఎందుకో నికోలాస్ కు ఎప్పుడూ లేనిది ఆ లాటరీ టికెట్లు కొందామనిపిచ్చింది.

Also Read: వెయిట్ లాస్ ఇన్‌ఫ్లుయెన్సర్‌ని బ్యాన్ చేసిన టిక్ టాక్.. ఆమెను చూస్తే ఆశ్చర్యపోకతప్పదు!


వెంటనే నికోలాస్ కొన్ని లాటరీ టికెట్లు కొని స్రాచ్ చేశాడు. అలా చేయగానే అతనికి లాటరీ విన్నింగ్ నెంబర్ వచ్చేసింది. దీంతో అతను కళ్లు పెద్దవి చేసి చూశాడు. నిజంగానే సూపర్ మార్కెట్ కౌంటర్ బోర్డుపై ఉన్న విన్నింగ్ నెంబర్ తో అతని లాటరీ టికెట్ నెంబర్ మ్యాచ్ అయిపోయింది. ఆ లాటరీ ప్రైజ్ మనీ ఒక మిలియన్ డాలర్లు. అంటే దాదాపు రూ.8 కోట్ల 35 లక్షలు నికోలాస్ గెలుచుకున్నాడు.

అయితే లాటరీ సంస్థ గెలిచిన రెండు ఆఫర్లు ఇస్తుంది. గెలుచుకున్న మొత్తం 30 ఏళ్ల పాటు ప్రతీ సంవత్సరం కొంత మొత్తంలో తీసుకోవాలి. లేదా అందులో 37 శాతం పన్నులు, డిస్కౌంట్ తో తక్షణమే తీసుకోవచ్చు. నికోలాస్ అలా రెండో ఆఫర్ తీసుకున్నాడు. అంటే అతని చేతికి దాదాపు రూ.5 కోట్ల 22 లక్షలు అందాయి.

లాటరీ గెలుచుకున్న తరువాత నికోలాస్ మీడియాతో మాట్లాడుతూ.. ”నేను లాటీర నెంబర్ చూసినప్పుడు. అసలు నమ్మలేదు. నేను తప్పుగా చదివాను ఏమో? అని సందేహం కలిగింది. మీకు తెలుసా ఇంతకుముందు అంత మొత్తంలో ఎవరూ లాటరీ గెలుచుకోలేదట!” అని సంతోషంగా చెప్పాడు. అంత డబ్బుతో ఏం చేయబోతున్నావ్? అని మీడియా ప్రశ్నించినప్పుడు. తాను ఇంకా ప్లాన్ చేయలేదని తెలిపాడు.

Also Read: పేదవారి బ్యాంక్ అకౌంట్ల నుంచి లక్షలు, కోట్లు లావాదేవీలు.. మోసగత్తె అరెస్ట్!

నికోలాస్ లాటరీ గెలుచుకోవడంతో ఆ సూపర్ మార్కెట్ వారికి కూడా పది వేల డాలర్లు బోనస్ లభించింది.

వర్జీనియా లాటరీ సంస్థ 20X మనీ గేమ్ లాటరీ ప్లాన్ లో ఎవరైనా లాటరీ కొనుగోలు చేస్తే.. ప్రతి 19,58,400 లాటరీలలో ఒక విన్నింగ్ లాటరీ నెంబర్ ఉంటుంది. పైగా లాటరీ గెలుచుకున్న వారి ప్రైజ్ మనీ నుంచి మినహాయింపులు తీసి ఆ డబ్బుని రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్ల సంక్షేమం కోసం ఖర్చు చేస్తుంది.

ఇటీవలే ఇలాంటి ఘటన మరొకటి జరిగింది. న్యూ యార్క్ పోస్ట్ వార్తా సంస్థ ప్రచురించిన కథనం ప్రకారం.. అమెరికాలో ఒక 54 ఏళ్ల మహిళకు.. సెకండ్ చాన్స్ ఆన్ లైన్ లాటరీ గేమ్స్ కంపెనీ ద్వారా ఒక ఈ మెయిల్ వచ్చింది. ఆమెకు లాటరీ గెలుచుకుందని ఆ మెయిల్ లో సమాచారం ఉంది. కానీ ఆ మెయిల్ జంక్ అని చూపించడంతో ఆమె దాన్ని పట్టించుకోలేదు. కానీ రెండు రోజుల తరువాత ఎందుకైనా సరే తెలుసుకుందామని ఆ ఈ మెయిల్ లో ఉన్న సమాచారాన్ని వెరిఫై చేసింది. ఆ మెయిల్ రియల్ అని తెలియగానే ఆమె ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ఆ ఆన్ లైన్ లాటరీ ప్రైజ్ మనీ దాదాపు రూ.1.73 కోట్లు.

Related News

Boy Kidnapped Returns After 70 Years: 1951లో పిల్లాడు కిడ్నాప్.. 70 ఏళ్ల తరువాత గుర్తుపట్టిన ఫ్యామిలీ..

Sri Lanka: శ్రీలంక ప్రధాని రాజీనామా.. కొత్త అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకరం చేయనున్న దిసనాయకె

Pakistan Diplomat Convoy: పాకిస్తా‌న్ లో రష్యా, ఇరాన్ సహా 12 మంది డిప్లమాట్స్ పై బాంబు దాడి.. పోలీస్ ఆఫీసర్ మృతి

PM Narendra Modi: ప్రవాస భారతీయులే బ్రాండ్ అంబాసిడర్లు.. అమెరికా పర్యటనలో మోదీ

Chiranjeevi : గిన్నిస్ రికార్డులో మెగాస్టార్ కి చోటు.. అమీర్ ఖాన్ చేతుల మీదుగా..!

Iran coal mine: ఇరాన్‌లో ఘోర విషాదం.. భారీ పేలుడుతో 30 మంది మృతి

Big Stories

×