EPAPER

Landslides kill 12 on Indonesia: ఇండోనేషియాలో బంగారు గనిలో ప్రమాదం.. 12 మంది మృతి

Landslides kill 12 on Indonesia: ఇండోనేషియాలో బంగారు గనిలో ప్రమాదం.. 12 మంది మృతి

Landslides kill 12 on Indonesia: ఇండోనేషియాలో విషాదం చోటుచేసుకుంది. సులవేసి ద్వీపంలోని ఓ బంగారు గనిలో ప్రకృతి వైపరీత్యానికి 12 మంది దుర్మరణం చెందగా.. 18 మందికిపైగా ఆచూకీ లభ్యం కావడం లేదని అధికారులు వెల్లడించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గనిలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో మృతి చెందిన 12 మంది మృతదేహాలను రెస్క్యూ ఏజెన్సీ వెలికితీసింది.


గోరోంటలోని ప్రావిన్స్‌లో సుమావా జిల్లాలో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ సంఘటను సమీపంలో ఓ బంగారు గనిలో నివసిస్తున్న గ్రామస్తులపై కొండచరియలు విరిగి మట్టి పడింది. ఒక్కసారిగా మట్టి పడడంతో ఊపిరాడగా చనిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. రిమోట్ బోన్ బొలాంగోలో అక్రమంగా పనిచేస్తున్న సుమారు 33 మందిలో 12 మంది మృతి చెందిన్లు గోరంటా సెర్చ్ అండ్ రెస్క్యూ ఏజెన్సీ ప్రతినిధి అఫీఫుద్దీన్ ఇలాహుడే తెలిపాడు.

సమాచారం అందుకున్న పోలీసులు రక్షణ బృందాలతో సహాయక చర్యలు చేపట్టారు. ఇందులో చిక్కుకున్న ఒకరిని సురక్షితంగా వెలికితీశారు. గల్లంతైన మిగతా వారికోసం గాలింపు చేపట్టారు. చిక్కుకున్న ప్రతి ఒక్కరిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు అన్ని విధాల కృషి చేస్తున్నట్లు ఏజెన్సీ బృందం తెలిపింది.


Also Read: సౌత్ కొరియాలో జీతాలు పెంచాలని ఉద్యోగుల నిరసన.. శాంసంగ్ చరిత్రలో అతిపెద్ద స్ట్రైక్!

భారీ వర్షాల నేపథ్యంలో నేషనల్ రెస్క్యూటీమ్, పోలీసులు, ఆర్మీ సిబ్బందితో సహా 164 మంది సిబ్బంది మోహరించారు. కొండచరియలు విరిగి పడిన ప్రాంతంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. అయితే గత కొంతకాలంగా ఇండోనేషియాలో అక్రమ మైనింగ్ జరుగుతోందని, ఈ విషయంలో అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగానే అక్రమంగా పనిచేయడంతో చాలామంది ప్రమాదబారిన పడుతున్నట్లు చెబుతున్నారు.

Tags

Related News

Continent Turns Green: అక్కడ మొక్కలు మొలిచాయంటే.. భూమి అంతమైనట్లే, శాస్త్రవేత్తల తాజా పరిశోధనలో తేలింది ఇదే!

Conflict: మూడో ప్రపంచ యుద్ధం తప్పదా..?

Dominica Citizenship: ‘ఎవరైనా రావొచ్చు’.. తక్కువ ధరకే పౌరసత్వం విక్రయిస్తున్న దేశం ఇదే..

Elon Musk Brazil: బ్రెజిల్‌లో ట్విట్టర్ ఎక్స్ ఆగని కష్టాలు.. తప్పుడు బ్యాంకులో ఫైన్ చెల్లింపులు!

India’s Iron Dome: ఇండియాపై శత్రువులు మిసైల్ దాడి చేస్తే పరిస్థితి ఏంటి? ఇజ్రాయెల్ తరహా యాంటి మిసైల్ టెక్నాలజీ మన దగ్గర ఉందా?

Trump Advice To Israel: ‘ఇరాన్ అణు స్థావారాలపై వెంటనే దాడి చేయండి’.. ఇజ్రాయెల్ కు ట్రంప్ సలహా

Israel India Iran: ‘దాడి చేయవద్దని ఇండియా ద్వారా ఇరాన్‌కు ముందే హెచ్చరించాం’.. ఇజ్రాయెల్ అంబాసిడర్

×