EPAPER

Smart Bomb: లెబనాన్‌పై ‘స్మార్ట్ బాంబ్’ వదిలిన ఇజ్రాయెల్.. క్షణాల్లో బిల్డింగులు ధ్వంసం, ఈ బాంబు ప్రత్యేకత తెలుసా?

Smart Bomb: లెబనాన్‌పై ‘స్మార్ట్ బాంబ్’ వదిలిన ఇజ్రాయెల్.. క్షణాల్లో బిల్డింగులు ధ్వంసం, ఈ బాంబు ప్రత్యేకత తెలుసా?

Israel SPICE 2000 Bomb Attack: పక్కలో బల్లెంగా మారిన ఉగ్రమూక హిజ్బుల్లాను కూకటి వేళ్లతో సహా పెకిలించే ప్రయత్నం చేస్తోంది ఇజ్రాయెల్. హిజ్బుల్లా స్థావరాలపై వార్ హెడ్స్ తో భీకరదాడులకు దిగుతోంది. తాజాగా లెబనాన్ లోని హిజ్బుల్లా స్థావరాలపై స్మార్ట్ అటాక్స్ కు దిగింది. బీరుట్ లోని ఆపార్ట్ మెంట్ పై స్మార్ట్ బాంబును వదిలింది. క్షణాల వ్యవధిలో భవనం నేలమట్టం అయ్యింది. ఇందులో హిజ్బుల్లా కార్యకలాపాలు కొనసాగుతున్నాయనే సమాచారంతో దాడికి దిగింది. బాంబ్ అటాక్ కు ముందు ప్రజలను ఖాళీ చేయించింది. ప్రజలు బయటకు వెళ్లిపోయిన కాసేపటికే జెట్ ద్వారా బాంబును జారవిడిచింది. ఇంతకీ స్మార్ట్ బాంబ్ అంటే ఏంటి? దాని శక్తి ఎంత ఉంటుంది? ఎంత దూరం నుంచి టార్గెట్ ఛేదిస్తుంది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.


స్మార్ట్ బాంబ్ ప్రత్యేకత ఏంటి?

ఇజ్రాయెల్ అమ్ముల పొదిలో ఉన్న అత్యంత శక్తివంతమైన వార్ హెడ్లలో స్మార్ట్ బాంబ్ ఒకటి. దీన్ని SPICE 2000 వార్ హెడ్ గా పిలుస్తారు. ఈ బాంబు తీవ్రతకు క్షణాల్లో పెద్ద పెద్ద భవనాలు క్షణాల్లో కుప్పకూలుతాయి. రాఫెట్ జెట్ ఫైటర్ల ద్వారా ఈ బాంబును ఇజ్రాయెల్ జార విడుస్తున్నది. దీనిని గైడెడ్ బాంబు అని కూడా వ్యహరిస్తారు. సుమారు 2000 పౌండ్ల బరువు ఉంటుంది. అత్యంత కచ్చితంగా టార్గెట్లను ఛేదించడంలో ఈ వార్ హెడ్ సమర్థవంతంగా పని చేస్తుంది. ఇజ్రాయెల్ ప్రభుత్వ యాజమాన్యంలోని రాఫెల్ అడ్వాన్స్‌ డ్ డిఫెన్స్ సిస్టమ్స్ ఈ వార్ హెడ్లను తయారు చేస్తున్నది. అయితే, అమెరికా నుంచి ఎగుమతి అవుతున్నట్లు కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీరుట్ లో స్మార్ట్ దాడికి ముందు రెండు చిన్నదాడులు చేసింది. ఆ తర్వాత ఇజ్రాయెల్ ఈ వార్ హెడ్ ను ఉపయోగించింది.

అత్యంత ప్రమాదకరమైన బాంబు

రాఫెట్ ఫైటర్ జెట్లు ఈ స్మార్ట్ బాంబును వాతావరణ పరిస్థితులతో సంబంధం లేకుండా ప్రయోగించే అవకాశం ఉంటుంది. ఫిక్స్ చేసిన టార్గెట్ ను ఏమాత్రం అటు ఇటు కాకుండా ధ్వంసం చేస్తుంది. అంతేకాదు, ఈ బాంబును ప్రయోగించే విమానానికి ఎలాంటి హాని కలగకుండా కాపాడుతుంది. సుమారు 2000 పౌండ్ల బరువుంటే ఈ వార్ హెడ్ ఏకంగా 60 కిలో మీటర్ల దూరంలో ఉన్న టార్గెట్ ను ఛేదిస్తుంది. జీపీఎస్ ఆధారంగా ఈ బాంబు లక్ష్యాన్ని నిర్దేశిస్తారు. జెట్ నుంచి ప్రయోగించిన ఈ ఆయుధం భూమి లోపలికి చొచ్చుకెళ్లి పెద్ద స్థాయిలో విధ్వంసాన్ని సృష్టిస్తుంది.

స్మార్ట్ బాంబు ఇజ్రాయెల్‌ లో తయారైందా?

ఈ బాంబులకు సంబంధించిన గైడెన్స్ కిట్ లు ఇజ్రాయెల్‌ లో రాఫెల్ తయారు చేసింది. అయితే, వీటి తయారీలో ఇజ్రాయెల్ అమెరికా సాయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2019లో  రాఫెల్, US రక్షణ కాంట్రాక్టర్ లాక్‌ హీడ్ మార్టిన్ USలో గైడెన్స్ కిట్లను నిర్మించడానికి  ఒప్పందం చేసుకున్నారు. ఇజ్రాయెల్ దగ్గర ఉన్న  స్మార్ట్ బాంబ్ సిస్టమ్‌లో 60 శాతానికి పైగా ఉత్పత్తి అమెరికాలో జరుగతున్నట్లు తెలుస్తోంది.  అక్టోబర్ 2023లో  హమాస్ దాడి తర్వాత US స్టేట్ డిపార్ట్‌ మెంట్ ఇజ్రాయెల్‌కు అదనపు స్మార్ట్ బాంబు అసెంబ్లీలను ఎగుమతి చేసింది. అయితే, ఈ బాంబులు అమెరికాలో తయారవుతున్నాయా? ఇజ్రాయెల్ లో తయారవుతున్నాయా? అనేది కచ్చితంగా తెలియదు.

Read Also: ప్రపంచాన్ని వణికిస్తున్న ISISకు ప్రాణం పోసింది అమెరికానా? చరిత్ర చెబుతోన్న వాస్తవాలేంటీ?

Related News

US Presidential Elections : అగ్రరాజ్యం అధ్యక్ష ఎన్నికల్లో కీలక పరిణామం, ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం

Justin Trudeau Resignation Demand : కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకి ఝలక్, రాజీనామాకు పట్టుబట్టిన సొంత పార్టీ ఎంపీలు

Hotel Bill Con couple: 5 స్టార్ రెస్టారెంట్‌లో తినడం.. బిల్లు ఎగ్గొటి పారిపోవడం.. దంపతులకు ఇదే పని!

BRICS INDIA CHINA: ‘బ్రిక్స్ ఒక కలగానే మిగిలిపోతుంది’.. ఇండియా, చైనా సంబంధాలే కీలకం..

INDIA CHINA BILATERAL TALKS : ఐదేళ్ల తర్వాత తొలిసారిగా భారత్ చైనా మధ్య ద్వైపాక్షిక చర్చలు, మోదీ జిన్‌పింగ్‌లు ఏం మాట్లాడారో తెలుసా ?

Foot Ball Match Fire: ఫుట్ బాల్ మ్యాచ్‌లో విషాదం.. మైదానంలో కాల్పులు.. ఐదుగురు మృతి

Big Stories

×