EPAPER
Kirrak Couples Episode 1

King Leopold : హిట్లర్ కన్నా అతిక్రూరుడు.. 2 కోట్ల మందిని చంపాడు

మహారాజు లియోపోల్డ్‌ గురించి వింటే ఒక మనిషి మరీ ఇంత దారుణంగా ప్రవర్తిస్తాడా అని అనుమానం కలుగుతుంది. లియోపోల్డ్ తన జీవితకాలంలో 2 కోట్ల మందిని చంపాడు. కొన్ని సంవత్సారాలపాటు నరమేధం చేశాడు. ఒక దేశ జనాభానే కనపడకుండా చేయగలిగాడు. కానీ ఇతడి కిరాతకాల గురించి అంతర్జాతీయ సమాజం తక్కువగా మాట్లాడుకుంటుంది. ఎందుకంటే అతను చంపింది ఆఫ్రికా దేశమైన కాంగోవాసులని. కాంగోదేశం అనగానే అంతా నల్లజాతీయులే కదా.. అని యూరప్, అమెరికా దేశాలు తేలికగా, చులకనగా మాట్లాడుతాయి. ఎందుకంటే వారికి నల్లజాతీయులంటే మానవులతో సమానం కాదు. వారంతా బానిస జీవులని హీనంగా మాట్లాడుతారు.

King Leopold : హిట్లర్ కన్నా అతిక్రూరుడు.. 2 కోట్ల మందిని చంపాడు

King Leopold : మన చూట్టూ ఇప్పుడు ఉన్న ప్రపంచం మానవ హక్కుల గురించి మాట్లాడుతోంది. ప్రపంచంలో ఎక్కడైనా పేదవారిపై బలవంతులు హింసిస్తే దానిని ప్రపంచ దేశాలు ముక్త కంఠంతో ఖండింస్తాయి. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో హిట్లర్ దాదాపు 60 లక్షల మంది యూదులును చంపితే అతడిని ఇంతవరకు అత్యంత క్రూర మానవుడిగా ఉదాహారణ చెబుతారు. కానీ అతడికన్నా మహాక్రూరమైన వ్యక్తి చరిత్రలో మరొకడున్నాడు. అతనే బెల్జియమ్ మహారాజు లియోపోల్డ్-2.


మహారాజు లియోపోల్డ్‌ గురించి వింటే ఒక మనిషి మరీ ఇంత దారుణంగా ప్రవర్తిస్తాడా అని అనుమానం కలుగుతుంది. లియోపోల్డ్ తన జీవితకాలంలో 2 కోట్ల మందిని చంపాడు. కొన్ని సంవత్సారాలపాటు నరమేధం చేశాడు. ఒక దేశ జనాభానే కనపడకుండా చేయగలిగాడు. కానీ ఇతడి కిరాతకాల గురించి అంతర్జాతీయ సమాజం తక్కువగా మాట్లాడుకుంటుంది. ఎందుకంటే అతను చంపింది ఆఫ్రికా దేశమైన కాంగోవాసులని. కాంగోదేశం అనగానే అంతా నల్లజాతీయులే కదా.. అని యూరప్, అమెరికా దేశాలు తేలికగా, చులకనగా మాట్లాడుతాయి. ఎందుకంటే వారికి నల్లజాతీయులంటే మానవులతో సమానం కాదు. వారంతా బానిస జీవులని హీనంగా మాట్లాడుతారు.

భారతదేశంలో బ్రిటీషర్లు బానిస పాలన నడిపి ఎంతోమందిని చంపారో.. అదే కథ కాంగో దేశంలోనూ నడచింది. ఇంకా చెప్పాలంటే ఇక్కడికంటే ఘోరంగా నరమేధం జరిగింది. అయినా ప్రపంచ చరిత్రలో హిట్లర్ అందరికంటే దుర్మార్గుడు ఎందుకంటే అతను చంపింది తెల్లవారిని కనుక. ఒక తెల్లవాడి ప్రాణం.. ఆసియా, ఆఫ్రికా దేశాల పౌరులకంటే చాలా విలువైనదని ఇప్పటికీ పాశ్చాత్య దేశాలు నమ్ముతాయి. ఉదాహరణకు ఒక అమెరికన్, ఒక బ్రిటన్ పౌరుడి భారత్ లాంటి దేశంలో హింసకు గురైతే.. అక్కడి ప్రభుత్వాల స్పందన తీవ్రంగా ఉంటుంది. అదే ఆసియా దేశాలైన భారత్, బంగ్లాదేశ్, శ్రీలంక పౌరులెవరైనా అమెరికా, ఆస్ట్రేలియా లాంటి దేశాలలో హత్య, దోపిడీకి గురైతే.. అంత సీరియస్ కాదు. కేవలం కొద్ది రోజుల వార్త మాత్రమే.


ఇక విషయానికి వస్తే.. లియోపోల్డ్-2 1835 ఏప్రిల్ 9న బెల్జియం రాజ కుటుంబలో జన్మించాడు. అతను 1885 బెల్జియం దేశానికి మహారాజు అయ్యాడు. అదే సంవత్సరం అతను తన సైన్యంతో కలిసి ఆఫ్రికా దేశమైన కాంగోని ఆక్రమించుకున్నాడు. ఆ సమయంలో యూరప్ దేశాలన్ని ఆఫ్రికా దేశాలను తమ బానిస దేశాలుగా పరిపాలన సాగిస్తుండేవి. కాంగో దేశంలో అప్పటివరకు ప్రకృతి సంపద అయిన రబ్బర్ చెట్లు ఉన్నాయని ఎవరూ గుర్తించలేదు.

రబ్బర్ చెట్లు కాంగోలో విపరీతంగా ఉన్నాయని తెలిసిన లియోపోల్డ్ ఆ దేశాన్ని ఆక్రమించుకొని రబ్బర్ ఉత్పత్తి చేయాలని అక్కడి నల్లజాతీయులను ఆదేశించాడు. యూరప్, అమెరికా అంతటా ఆ సమయంలో రబ్బర్‌తో వాహనాల టైర్లు, మనుషులు ధరించే బూట్లు, కోట్లు తయారు చేయబడేవి. దీంతో రబ్బర్‌కు మార్కెట్‌లో భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ క్రమంలో రబ్బర్ ఉత్పత్తిని భారీగా పెంచాలని లియోపోల్డ్ ఆదేశించాడు. కానీ ఈ పనిచేసేందుకు కాంగోలో నివసించే ప్రజలకు సరైన కూలీ లభించేదికాదు. దీంతో అక్కడి ప్రజలు పనిచేసేందుకు నిరాకరించారు.

అలా నిరాకరించిన వారి ఇళ్లను లియోపోల్డ్ సైన్యం నిప్పంటించేది. అయినా వినకపోతే వారి తలలను నరికి ఊరి మధ్యలో వేలాడదీసేవారు. ఈ భయంకర ఘటనలతో అక్కడి ప్రజలు చెప్పినట్లు వినే బానిసలుగా మారిపోయారు. అంత చేసినా వారికి భోజనం కూడా పెట్టేవారు కాదు. దీంతో ఆ నల్లజాతీయులు బలహీనంగా ఉండేవారు. రబ్బర్ డిమాండ్ భారీ పెరిగిపోవడంతో ఎక్కువ ఉత్పత్తి చేయాల్సి వచ్చేది. కావాల్సినంత రబ్బర్ ఉత్పత్తి కాకపోతే ఆ బానిసల చేతులు నరికేసేవారు. పనికి రానివారి కుటుంబంలో చిన్నపిల్లలను చంపేసేవారు. కొంతమంది చిన్నపిల్లల చేతులు కూడా నరికేసేవారు.

రబ్బర్ అమ్మకాల ద్వారా లియోపోల్డ్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో చేరిపోయాడు. దీంతో అతని దురాశ మరింత పెరిగిపోయింది. కాంగోలో ఆహార పంటలు పండించకూడదని, కేవలం రబ్బర్ పంటలే పండాలని ఆయన ఆజ్ఞాపించాడు. ఈ కారణంగా కాంగోలో ప్రజలకు తినేందుకు తిండి దొరికేదికాదు. తీవ్రమైన పని ఒత్తిడి, పనిగంటలలో భారీ పెంపు, తిండికి కరువు వల్ల చాలామంది కాంగో వాసులు అనారోగ్యం పాలై చనిపోయారు. దేశమంతా మలేరియా కారణంగా లక్షల్లో జనం చనిపోయారు.

లియోపోల్డ్ సైన్యంలో రెండు వర్గాలు ఉండేవి. ఒకటి తన బెల్జియం సైన్యం, మరొకటి అక్కడి నరమాంస భక్షకుల నల్లవారి సైన్యం. ఈ నరభక్షకుల సైన్యమంటే కాంగోవాసులు వణికిపోయేవారు. పైగా లియోపోల్డ్ ఈ నల్లసైనికులకు సరిగా జీతాలు చెల్లించేవాడు కాదు. జీతం బదులుగా కాంగో మహిళలపై ఉచితంగా అత్యాచారం చేయవచ్చునని చెప్పేవాడు. అలా 1890 నుంచి 1906 వరకు కాంగోలో నరమేధం జరిపాడు.

ఈ మారణకాండలో దాదాపు 2 కోట్ల జనాభా చనిపోయింది. కొందరు చరిత్రకారులు లియోపోల్డ్ పాలనలో కోటిమంది చనిపోయారని అంచనా వేస్తున్నారు. అయితే లియోపోల్డ్ 1906 సంవత్సరం వరకు బయటి ప్రపంచానికి తెలియకుండా ఈ హింసాత్మక పరిపాలన సాగించాడు. 1906 సంవత్సరం తరువాత కాంగో నరమేధం గురించి తెలిసినా అతనితో బ్రిటీషు వారికి మంచి సంబంధాలు ఉండడంవల్ల చాలా సంవత్సరాల వరకు ఈ మారణకాండ చరిత్రను ప్రపంచానికి తెలియకుండా దాచారు.

లియోపోల్డ్ 1909వ సంవత్సరంలో చనిపోయాడు. అతడికి మొదటి భార్య వలన పుట్టిన ముగ్గురు సంతానంలో ఇద్దరు చిన్నతనంలోనే చనిపోయారు. అతని భార్య అప్పటి నుంచి మానసిక రోగి అయిపోయింది. 65 ఏళ్ల వయసులో లియోపోల్డ్ ఫ్రాంస్ దేశానికి చెందిన ఒక 16 ఏళ్ల యువతితో సంబంధం పెట్టుకున్నాడు. వారిద్దరికీ ఒక కొడుకు జన్మించాడు. కానీ ఆ పుట్టిన పిల్లాడికి ఒక అవిటి చేయి ఉండడంతో చాలామంది అతడికి కాంగోవాసుల శాపం తగిలిందని అంటారు. లియోపోల్డ్ సంతానంలో ఒక కూతరు మాత్రమే మిగిలింది. లియోపోల్డ్ మరణం తరువాత అతని తమ్ముడి కుమారుడు ఆల్బర్ట్.. మహారాజు అయ్యాడు.

Related News

Hezbollah Chief Killed: హెజ్బొల్లాకు భారీ షాక్.. చీఫ్ హసన్ నస్రల్లా మృతి

NASA Will Launch Crew-9 Today: ఈ మిషన్ సక్సెస్ అయితే చాలు.. సునీతా విలియమ్స్ భూమి మీదికి వచ్చినట్లే..

Hurricane Helene: అమెరికాలో హరికేన్ బీభత్సం.. 44 మంది మృతి

Trump Campaign Hacked: ట్రంప్ క్యాంపెయిన్‌ హ్యాక్ చేసిన ఇరాన్?.. అమెరికా కోర్టులో కేసు..

India Rebutes Pakistan: ‘కశ్మీర్ టెర్రరిజంపై మాకు నీతులా?’.. ఐరాస సమావేశాల్లో పాకిస్తాన్‌కు గట్టి కౌంటర్ ఇచ్చిన భారత్..

Myopia In Kids Globally: లాక్ డౌన్ తరువాత పిల్లల్లో కంటి సమస్యలు.. బిబిసి నివేదికలో వెల్లడి!

Netanyahu At UN: ‘ఇరాన్ లో ఏ మూలలోనైనా ఇజ్రాయెల్ దాడి చేయగలదు’.. ఐరాసలో నెతన్యాహు వార్నింగ్!

Big Stories

×