EPAPER

International:కమలా హ్యారిస్ పై జూనియర్ ట్రంప్ అంతమాట అనేశాడా?

International:కమలా హ్యారిస్ పై జూనియర్ ట్రంప్ అంతమాట అనేశాడా?

Jr.Trump criticizes kamala harris(Latest world news): అమెరికా అధ్యక్ష ఎన్నికలు రసవత్తరంగా మారాయి. నిన్నటి దాకా జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్ మధ్య ఉన్న పోటీలో అనూహ్యంగా జో బైడెన్ తప్పుకున్నారు. కేవలం పోటీ నుంచి మాత్రమే తప్పుకున్నానని..అధ్యక్షుడిగా కొనసాగుతానని బైడెన్ ప్రకటించారు. అయితే ఆయన స్థానంలో ట్రంప్ కు పోటీగా ఎవరు నిలబడతారని కొంతకాలంగా చర్చలు నడుస్తున్నాయి. అమెరికా తొలి ఉపాధ్యక్షురాలిగా ఎంపికైన భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ పోటీచేయడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనయుడు జూనియర్ ట్రంప్ కమలా హ్యారిస్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు.


తన తండ్రి స్థాయికి సరిపోదు

డెమొక్రాటిక్ పార్టీ తరపున కమలా హ్యారిస్ అధ్యక్ష పదవికి పోటీ చేయడం దాదాపు ఖాయం అనుకుంటున్న తరుణంలో జూనియర్ ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తన తండ్రి ట్రంప్ స్థాయికి కమలా హ్యారిస్ ఏ మాత్రం సరిపోరని..ఆమెకు జనం మద్దతు లేదని, ఆ విషయంలో హ్యారిస్ కన్నా జో బైడెన్ చాలా బెటర్ అని వ్యాఖ్యానించారు. సొంత పార్టీలోనే ఆమెకు వ్యతిరేకులు ఉన్నారని..ఆమె అధ్యక్ష పదవికి పోటీ చేస్తే ఓడిపోవడం ఖాయం అని అంటున్నారు జూనియర్ ట్రంప్ . ఉపాధ్యక్షురాలి హోదాలో కనిసం ఆమె తన ప్రభావం చూపలేకపోయారని..సరిహద్దు సమస్యలు తీర్చడంలో పూర్తిగా విఫలం అయ్యారని జూనియర్ ట్రంప్ వ్యాఖ్యానించారు. జూనియర్ ట్రంప్ తన తండ్రి తరపున ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జూనియర్ ట్రంప్ పై గతంలో వివాదాలు నడిచాయి. ఓబ్రా ఓడే అనే ఓ మహిళ తనకు జూనియర్ ట్రంప్ తో సన్నిహిత సంబంధం ఉందని తనతో లైంగిక కార్యకలాపాలు చేశానని బహిరంగంగా ప్రకటించింది. పైగా తనని లైంగికంగా జూనియర్ వేధించేవాడని తప్పని సరి పరిస్థితిలో జూనియర్ తనని లోబరుచుకున్నాడని ప్రకటించింది. ఈ విషయంలో జూనియర్ అప్పట్లో ఏ రకంగానూ స్పందించలేదు. కనీసం తన తప్పు లేదని కూడా చెప్పలేదు.


భారత ఓటర్లే కీలకం

భారత ఓటర్లు అమెరికా అధ్యక్ష ఎన్నికలలో కీలక పాత్ర పోషించనున్నారు. వీరు వేసే ఓట్లపైనే అమెరికా అధ్యక్షుడి భవిత ఆధారపడి ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో భారత ఓటర్లకు అనేక రకాలుగా గాలం వేస్తున్నారు. భారత్ కు అండగా ఉంటామని చెబుతున్నారు. అయితే జో బైడెన్ అధ్యక్ష పోటీ బరినుంచి తప్పుకుని కమలా హ్యారిస్ కు మద్దతు తెలపడం వెనక కూడా ఇదే కారణంగా కనిపిస్తోంది. భారత సంతతి వ్యక్తి నుంచుంటే తప్పనిసరిగా భారతీయు ఓట్లన్నీ హ్యారిస్ కే పడతాయి. పైగా కమలా హ్యారిస్ గత ఎన్నికలలోనూ బైడెన్ కు రైట్ హ్యాండ్ గా పనిచేశారు. ఉపాధ్యక్షురాలిగా అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ప్రజా మద్దతు కూడగట్టుకుంటున్నారు.

హ్యారిస్ కు పెరుగుతున్న మద్దతు

హ్యారిస్ పట్ల భారతీయ ఓటర్లకే కాదు..అక్కడి ఓటర్లకూ సదభిప్రాయమే ఉంది. పైగా వివాదాస్పద అధ్యక్షుడిగా ట్రంప్ పై చాలా కేసులే ఉన్నాయి. కమలా హ్యరిస్ పై అలాంటి అవినీతి మరకలు లేవు. పైగా భారత సంతతి వ్యక్తి అధ్యక్షురాలైతే భారత్ కు మేలే జరుగుతుందని భావిస్తున్నారు. ఇవన్నీ కమలా హ్యరిస్ కు అనుకూలించే అంశాలే కావడం విశేషం. కమలా హ్యారిస్ అధ్యక్ష పోటీలో నుంచోవడమే కాదు..తప్పనిసరిగా గెలవాలని..భారత సంతతి వ్యక్తి తొలి సారిగా అమెరికా అధ్యక్షులవడం ఎప్పుడా అని భారతీయులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

Related News

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Longest working hours: ఈ దేశాలకి వెళ్లే అవకాశం వచ్చినా వెళ్ళకండి.. అత్యధిక పని గంటలు ఉన్న దేశాలు ఇవే..

Big Stories

×