EPAPER

JD Vance Wife| రిపబ్లికన్ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి జెడి వాన్స్ భార్య.. ఉషా చిలుకూరి వాన్స్ ఎవరో తెలుసా?

JD Vance Wife| రిపబ్లికన్ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి జెడి వాన్స్ భార్య.. ఉషా చిలుకూరి వాన్స్ ఎవరో తెలుసా?

JD Vance Wife| అమోరికాలో రిపబ్లికన్ పార్టీ అధికారికంగా ప్రెసిడెంట్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత డొనాల్డ్ ట్రంప్‌.. అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఒక ప్రకటన చేశారు. ఒహాయోకు చెందిన రిపబ్లికన్ సెనేటర్ జెడీ వాన్స్‌ని వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా ప్రకటించారు. ఇది ఎవరూ ఊహించని పరిణామం. ఎందుకంటే గతంలో జెడి వాన్స్.. డొనాల్డ్ ట్రంప్‌ పై చాలా విమర్శలు చేశారు.


రిపబ్లికన్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా జెడి వాన్స్ ఎన్నికల్లో పోటీ చేస్తుండడంతో ఆయనపై మీడియా ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యంగా ఆయనకు భారతదేశంతో మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రమైన ఆంధ్ర ప్రదేశ్‌తో ప్రత్యేక సంబంధముంది. ఆయన భార్య ఉషా చిలుకూరి తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు.

Also Read:  భార్యతో శృంగారం చేస్తూ వీడియో తీసిన యూనివర్సిటీ చాన్సెలర్.. అడల్ట్ వెబ్‌సైట్‌లో వీడియో పోస్ట్..


జెడి వాన్స్.. ఒక రచయిత, రిపబ్లికన్ సెనేటర్.. ఇప్పడు అమెరికా ఉపరాష్ట్రపతి అభ్యర్థి. రాజకీయంగా విజయవంతమైన ప్రయాణంలో ఆయనకు ఎల్లప్పుడూ తోడుగా నిలిచారు.. ఆయన సతీమణి ఉషా చిలుకూరి వాన్స్. గత సోమవారం.. జరిగిన రిపబ్లికన్ జాతీయ కన్వెన్షన్ లో పార్టీ డెలిగేట్స్.. సెనేటర్ జెడి వాన్స్ పేరు వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా ప్రకటించగానే ఉషా వాన్స్.. తన భర్త పక్కనే నిలబడి గట్టిగా తప్పట్లతో అభినందించారు. ఓటింగ్ విధానం ద్వారా జెడి వాన్స్ అభ్యర్థిత్వం ఖరారు చేశారు. అంటే వాన్స్.. ఆ అభ్యర్థిత్వానికి అర్హత సాధించినట్లే.

ఉషా చిలుకూరి వాన్స్ ఎవరు?
ఉషా చిలుకూరి తల్లిదండ్రులు చాలాకాలంగా అమెరికాలోని శాన్ డియాగో లో స్థిరపడ్డారు. కాలేజీలో లా చదువుకునే సమయంలో ఉష, జెడి వాన్స్ కు పరిచయం ఏర్పడింది. ఉష ఎంతో ప్రతిభావంతురాలని గుర్తించిన వాన్స్.. ఆమెను ప్రేమిస్తున్నట్లు తెలిపారు. అలా వారిద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ తరువాత ఇద్దరూ 2014 లో కెన్ టకీలో వివాహం చేసుకున్నారు. హిందూ సంప్రదాయాల ప్రకారం.. ఇద్దరూ దంపతులయ్యారు. వీరిద్దరికీ ముగ్గురు పిల్లలు ఉన్నారు. పెళ్లి తరువాత కూడా ఉషా తన జీవితంలో హిందూ మత ఆచారాలను పాటిస్తే.. ఆమె భర్త వాన్స్ రోమన్ కాథలిక్ గా జీవనం సాగిస్తున్నారు. ఒకరి మతం పట్ల మరొకరు గౌరవభావం చూపిస్తారు.

అయితే ఉషా, వాన్స్ ల జోడీ ఒక పవర్ ఫుల్ కాంబినేషన్ అని చెప్పాలి. ముఖ్యంగా ఉష తెరవెనుక ఉండి.. తన భర్త కెరీర్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఉషా చిలకూరి వాన్స్‌కు జెడి వాన్స్ భార్య కంటే ముందే ఆమె కంటే ఒక గుర్తింపు ఉంది. ఆమె ఒక జాతీయ కంపెనీకి లిటిగేటర్(లాయర్) గా పని చేశారు. ఆమె విద్యార్హత విషయానికి వస్తే.. యేల్ యూనివర్సిటీ నుంచి ఉష హిస్టరీ బ్యాచిలర్స్ డిగ్రీ పొందారు. అదనంగా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి ఫిలాసఫీలో మాస్టర్స్ డిగ్రీ పొందారు. కేంబ్రిడ్జ్ లో గేట్స్ స్కాలర్ గా ఉన్నప్పుడు ఆమెకు రాజకీయ పరిచయాలు ఏర్పడ్డాయి.

ఆ తరువాత ఆమె అమెరికా సుప్రీం కోర్టు న్యాయమూర్తుల వద్ద క్లర్క్ ఉద్యోగం చేసేవారు. అంతేకాకుండా యేల్ జర్నల్ ఆఫ్ లా అండ్ టెక్నాలజీకి మేనేజింగ్ ఎడిటర్‌గా.. ఎగ్జిక్యూటివ్ డెవలప్మెంట్ ఎడిటర్ గా సేవలందించారు.

జెడి వాన్స్‌ తనకు వృత్తిరీత్యా ఏ సలహా కావాలన్నా ముందుగా తన భార్య ఉషనే సంప్రదిస్తానని చెప్పడం.. ఉష టాలెంట్‌కు నిదర్శనం.

Tags

Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Big Stories

×