EPAPER

Japan population: ఆందోళనకరంగా జపాన్ జనాభా తగ్గుదల.. వరుసగా 15వ ఏడాది తగ్గిన జననాల సంఖ్య!

Japan population: ఆందోళనకరంగా జపాన్ జనాభా తగ్గుదల.. వరుసగా 15వ ఏడాది తగ్గిన జననాల సంఖ్య!

Japan population| జపాన్ దేశంలో రోజురోజుకీ జనాభా తగ్గిపోతోంది. వరుసగా 15 సంవత్సరం కూడా జనాభా తగ్గిపోయినట్లు జపాన్ ప్రభుత్వం బుధవారం డేటా విడుదల చేసింది. అధికారిక గణాంకాల ప్రకారం.. గత సంవత్సరం కంటే దేశ జనాభా సంఖ్యలో 5 లక్షల మందికి పైగా తగ్గిపోయారు. దేశంలో మరణాల సంఖ్య పెరిగిపోవడం.. జననాల రేటు తగ్గిపోతుండడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. గత సంవత్సర కాలంలో 7,30,000 మంది చనిపోగా.. 15 లక్షల 80 వేల మంది చనిపోయారు.


ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. జనవరి 1, 2024 వరకు జపాన్ జనాభా 12.5 కోట్లు. ఈ డేటాలో విదేశియుల సంఖ్య 11 శాతం పెరిగింది. జపాన్ జనాభా మొత్తంలో విదేశియులు 3 శాతం మంది ఉన్నారు. అందులోనూ ఎక్కువగా 15 నుంచి 64 ఏళ్ల మధ్య వయసుగల ఉద్యోగం చేసేవారున్నారు.

Also Read:  ‘నువ్వు ఆడదానివి.. నీకేం తెలుసు.. మాట్లాడకు..’ మళ్లీ నోరుజారిన బిహార్ సిఎం!


2009లో జపాన్ జనాభా 12.7 కోట్లు ఉండగా.. ఆ సంవత్సరం నుంచే జపాన్ లో పిల్లల జననాల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ప్రాంతాల వారీగా చూస్తే.. జపాన్ రాజధాని టోక్యోలో మాత్రమే జనాభా పెరిగింది. జనాభా తగ్గుదల సమస్యకు జపాన్ లో గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నా.. ఫలితాలు కనిపించడం లేదు. ఒకవైపు పిల్లలు పుట్టడం లేదు కానీ వయసు మీరిన వారు చనిపోతున్నారు. ఈ విధంగా తగ్గిపోతున్న జనాభా ఒక తీవ్ర సమస్యగా మారింది. జపాన్ లో ముఖ్యంగా యువత, పనిచేసే వయసు గల జనాభా తగ్గిపోతుండడంతో.. దేశ ఆర్థిక, సామాజిక మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.

జనాభా తగ్గుదల సమస్యకు కారణాలు తెలుసుకునేందుకు చాలా సంస్థలు సర్వేలు చేశాయి. వీటికి ముఖ్యమైనది.. పిల్లలు కనడానికి, వారిని పోషించే బాధ్యత తీసుకోవడానికి యువత అనాసక్తిగా ఉండడం. చాలా మంది తమ సంపాదన తక్కువగా ఉందని అందుకే వివాహం చేసుకోవడానికి ఇష్టపడడం లేదు. వేగంగా పెరిగిపోతున్న జీవన ప్రమాణాలు, ఖర్చులతో పోలిస్తే వచ్చే జీతాలు అంత వేగంగా పెరగడం లేదని అభిప్రాయపడ్డారు. పైగా మహిళలకు ఉద్యోగాలు ఇచ్చేందుకు కార్పొరేట్ కంపెనీలు ఇష్టపడడం లేదు. మహిళలు ఉద్యోగాలు చేస్తే.. వారు గర్భవతిగా ఉన్న సమయంలో, ఆ తరువాత పిల్లలు పుట్టాక ఎక్కువ సమయం ఉద్యోగానికి సెలవు కోరుకుంటారని కార్పొరేట్ కంపెనీలు చెబుతున్నాయి.

Also Read: ‘ఇరాన్ కోసం పనిచేసే మూర్ఖులు’.. అమెరికా నిరసనకారులపై మండిపడిన ఇజ్రాయెల్ ప్రధాని

ఈ సమస్యను పరిష్కరించడానికి అక్కడి ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించింది. వివాహం చేసుకొని ఎక్కువ మంది పిల్లలు కనే వారికోసం జపాన్ ప్రభుత్వం 2024 బడ్జెట్ లో 5.3 ట్రిలియన్ యోన్ (జపాన్ కరెన్సీ).. భారత కరెన్సీలో దాదాపు మూడు లక్షల కోట్ల రూపాయలు నిధిని కేటాయించింది. ఈ నిధులు.. పిల్లల సంరక్షన, వారి చదువుపై ఖర్చు చేస్తుంది. ఈ నిధులకు అదనంగా మరో రెండు లక్షల కోట్లు దశల వారీగా మూడేళ్ల పాట కేటాయించాలని నిర్ణయించింది.

ప్రస్తుతమున్న పరిస్థితులు ఇలాగే కొనసాగితే మరో 40 ఏళ్ల లో జపాన్ జనాభా 30 శాతం తగ్గిపోయి.. 8.7 కోట్లకు పడిపోతుంది. అది కూడా ఇందులో ప్రతి పది మందిలో నలుగురు ముసలి వాళ్లుంటారని అంచనా. ఈ రేటు ఇలాగే కొనసాగితే మరో వందేళ్ల తరువాత జపాన్ క్రమంగా ప్రపంచ పటం నుంచి కనుమరుగవుతుందేమో!.

 

Related News

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Longest working hours: ఈ దేశాలకి వెళ్లే అవకాశం వచ్చినా వెళ్ళకండి.. అత్యధిక పని గంటలు ఉన్న దేశాలు ఇవే..

Nigeria boat accident : నైజీరియాలో బోటు ప్రమాదం..64 మంది మృతి

Sunita williams: అంతరిక్ష కేంద్రం నుంచి ఓటేస్తానంటున్న సునీతా విలియమ్స్

US Teacher Student Relation| 16 ఏళ్ల అబ్బాయితో టీచర్ వివాహేతర సంబంధం.. విద్యార్థి తండ్రి తెలుసుకొని ఏం చేశాడంటే?..

Big Stories

×