EPAPER

Italy Population : 3 నెలల్లో ఒక్క బిడ్డా పుట్టలేదు.. ఎందుకంటే?

Italy Population : ఈ మధ్య ఒక యూరప్ దేశం ఒక వింత రికార్డ్ సాధించింది. కానీ రికార్డ్‌లో సంతోషపడాల్సినది కాదు. ఎందుకంటే ఆ దేశంలో పిల్లలు పుట్టడం లేదు. 3 నెలల్లో ఒక్క బిడ్డ కూడా జన్నించకపోవడం ఆ దేశం సాధించిన రికార్డ్.

Italy Population :  3 నెలల్లో ఒక్క బిడ్డా పుట్టలేదు.. ఎందుకంటే?

Italy Population : ఈ మధ్య ఒక యూరప్ దేశం ఒక వింత రికార్డ్ సాధించింది. కానీ రికార్డ్‌లో సంతోషపడాల్సిన విషయం లేదు. ఎందుకంటే ఆ దేశంలో పిల్లలు పుట్టడం లేదు. 3 నెలల్లో ఒక్క బిడ్డ కూడా జన్నించకపోవడం ఆ దేశం సాధించిన రికార్డ్. విన్నారుగా, ఈ వార్త వింటే ఎవరికి మాత్రం సంతోషం కలుగుతుంది. ఆ దేశం యూరోప్ దేశాలలో ఒకటైన ఇటలీ.


ఇండియాలో రోజూ 80వేల మంది దాకా పుడుతుంటే.. మరి ఇటలీ లాంటి దేశంలో 3 నెలల్లో ఒక్క బిడ్డ కూడా పుట్టకపోవడం అనేది షాకింగ్ విషయమే కదా. ఆ దేశ ప్రజలను జనాభా తగ్గుదల, పిల్లలు పుట్టకపోవడం గురించి ప్రశ్నిస్తే.. వింత సమాధానాలు చెబుతున్నారు.

ఓ ఆంగ్ల సమాచార వెబ్‌సైట్ ప్రకారం.. మనుషులు జీవించడానికి ప్రపంచం సరైనది కాదని ఇటలీ ప్రజలు భావిస్తున్నారు. ఇక్కడ సంతోషం ఉండదు.. అంతా అవినీతి ఉందని, అందువల్ల కొత్తగా ఎవరినీ పుట్టించాలని వారు కోరుకోవట్లేదు.


ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో వృద్ధుల సంఖ్య మరింతగా పెరిగిపోతోంది. చైనా, జపాన్‌ లాంటి దేశాలు దీనికి పెద్ద ఉదాహరణగా నిలిచాయి. ఇప్పుడు ఇటలీ కూడా ఈ జాబితాలో చేరింది. దీనికి కారణం అక్కడ పిల్లలు పుట్టక పోవడమే.

గత 3 నెలల్లో ఒక బిడ్డ కూడా పుట్టకపోవడం అనేది జాతీయ ఎమర్జెన్సీగా చూడాలని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ అన్నారు. నేషనల్‌ స్టాటిస్టిక్స్‌ బ్యూరో ఐఎస్‌టీఏటీ గణాంకాలను పరిశీలిస్తే.. జనవరి 2023 నుండి జూన్‌ 2023 వరకు ఇటలీలో జన్మించిన పిల్లల సంఖ్య జనవరి 2022 జూన్‌ 2022 మధ్య జన్మించిన వారి కంటే 3500 తక్కువ.

దేశంలో 15 నుంచి 49 ఏళ్లలోపు మహిళల సంఖ్య తక్కువగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. అంటే ఇటలీలో పునరుత్పత్తి వయసు గల మహిళల కొరత తీవ్రంగా ఉందని అర్థం. ఈ వయసు కలిగిన మహిళల సంఖ్య 2021తో పోలిస్తే 2023లో చాలా వరకూ తగ్గింది.

ఇటలీలో రోజుకు ఏడుగురు పిల్లలు పుడుతుండగా, అదే సమయంలో 12 మంది చనిపోతున్నారు. ఇలాగే కొన సాగితే ఇటలీ జనాభా వేగంగా తగ్గిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి సమస్యనే ఎదుర్కొంటున్న జపాన్ దేశం.. దీనికి పరిష్కార మార్గాలను అన్వేషిస్తోంది. అక్కడ పెళ్లి చేసుకోవడానికి సుముఖంగా లేని యువత పథకాల ద్వారా ప్రోత్సహిస్తోంది.

Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Big Stories

×