EPAPER

Israel PM Benjamin Netanyahu Meets Donald Trump: నేను ఓడిపోతే మూడో ప్రపంచ యుద్ధమే.. ఇజ్రాయెల్ ప్రధానితో ట్రంప్

Israel PM Benjamin Netanyahu Meets Donald Trump: నేను ఓడిపోతే మూడో ప్రపంచ యుద్ధమే.. ఇజ్రాయెల్ ప్రధానితో ట్రంప్

Israel PM Benjamin Netanyahu Meets Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెలన్యాహు కలిశారు. ఈ మేరకు ఫ్లోరిడాలోని ట్రంప్‌నకు చెందిన మార్ ఎ లాగోలోని నివాసంలో నెతన్యాహుతో పాటు ఆయన భార్య సారాకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇద్దరు భేటీ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియోను ఇజ్రాయెల్ ప్రధాని ఎక్స్ వేదికగా పంచుకున్నారు.


అక్టోబర్ 7న ఇజ్రాయెల్ దేశంపై హమాస్ ఉగ్రదాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే అంతకుముందు ఎన్నికల్లో తాను గెలిస్తే..గాజాలో యుద్ధం జరిగేది కాదని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. అయితే రానున్న ఎన్నికల్లో తాను గెలవపోతే మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయని ట్రంప్ పేర్కొన్నారు.

అయితే ఈ భేటీలో రెండు దేశాల మధ్య సంబంధాన్ని పునరుద్ధరించడానికి కట్టుబడి ఉండాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఈ యుద్ధానికి తొందరగా ముగింపు పలకాలని నెతన్యాహును ట్రంప్ కోరారు. కాగా, కమలా హారిస్.. ఇజ్రాయెల్ పై స్నేహపూర్వకంగా లేదని అభివర్ణించాడు.


Also Read: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నామినేషన్ దాఖల చేసిన కమలా హ్యారిస్.. ట్రంప్‌ను ఢీకొట్టేందుకు రెడీ అంటూ ప్రకటన

ఇదిలా ఉండగా, ఈ ఇద్దరు గతంలో కలుసుకున్నారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అమెరికా రాయబార కార్యాలయాన్ని జెరూసలెంకు మార్చారు. దీంతో ఇజ్రాయెల్ సార్వభౌమాధికారాన్ని గుర్తించి నెతన్యాహుకు ట్రంప్ సపోర్టు అందించారు. ఆ తర్వాత ఇజ్రాయెల్, హమాస్ యుద్ధంపై పెరుగుతున్న ఒత్తిడి కారణంగా అమెరికాతో సంబంధాలు పెంచుకునేందుకు బెంజుమన్ నెతన్యాహు వరుసగా పర్యటిస్తూ ప్రముఖ నేతలను కలుస్తున్నారు.

Related News

Crime: స్కూల్ బాత్రూంలో కాల్పులు.. బాలుడు మృతి

Russia president Putin: కమలా హ్యారిస్ కు జై కొట్టిన రష్యా అధ్యక్షుడు పుతిన్

USA Gun Fire: తండ్రి గిఫ్ట్‌గా ఇచ్చిన గన్‌తోనే స్కూల్‌లో అరాచకం.. ఐదుగురిని కాల్చి చంపిన ఆ నిందితుడి వయస్సు 14 ఏళ్లే!

PM Modi: భారత్‌లోనూ సింగపూర్‌లను సృష్టిస్తున్నాం: మోదీ

Muhammad Yunus: షేక్ హసీనాకు యూనస్ స్ట్రాంగ్ వార్నింగ్.. ఎందుకంటే ?

Japan Resignation Companies: ఉద్యోగుల చేత రాజీనామా చేయించడం కూడా ఒక బిజినెస్.. జపాన్ లో కొత్త వ్యాపారం

US’s Georgia school shooting: అమెరికాలో మళ్లీ కాల్పులు.. ఈసారి స్కూల్ లో.. నలుగురు మృతి

Big Stories

×