EPAPER
Kirrak Couples Episode 1

Israel – Hamas War : ఇజ్రాయెల్ పై దాడులు అందుకే చేశాం.. సమర్థించుకున్న హమాస్..

Israel – Hamas War : ఇజ్రాయెల్ పై దాడులు అందుకే చేశాం.. సమర్థించుకున్న హమాస్..

Israel – Hamas War : హమాస్ పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్న వేళ.. హమాస్ ఒక ప్రకటన చేసింది. ఇజ్రాయెల్ తో అసలు యుద్ధానికి దారితీసిన అంశంపై హమాస్ స్పందించింది. ఈ సందర్భంగా తప్పనిసరి పరిస్థితుల నేపథ్యంలోనే తాము ఇజ్రాయెల్ పై కాల్పులు జరిపినట్లు చెబుతూ.. అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పై జరిపిన మెరుపు దాడులను సమర్థించుకుంది. తమ భవిష్యత్ ను నిర్ణయించుకునే హక్కు తమకు ఉందన్నారు.


పాలస్తీనా ప్రజలకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ చేస్తున్న కుట్రల్ని ఎదుర్కొనేందుకు.. దానిని అనివార్యమైన చర్యగా పేర్కొంది. అదొక సాధారణ ప్రతిస్పందనేనని తెలిపింది. ఈ మేరకు హమాస్ 16 పేజీలతో కూడిన లేఖను విడుదల చేసింది. ఇందులో ఇజ్రాయెల్ భద్రత, సైనిక వ్యవస్థ వేగంగా కుప్పకూలిపోవడం, గాజా సరిహద్దు ప్రాంతాల్లో ఏర్పడిన గందరగోళం కారణంగా కొన్ని లోపాలు సంభవించినట్లు వెల్లడించింది. హమాస్ ఈ విషయాలను ప్రస్తావించినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

కాగా.. గాజాపై ఇజ్రాయెల్ దురాక్రమణను, పాలస్తీనీయులపై నేరాలను, జాతి హననాన్ని తక్షణమే నిలిపివేయాలని హమాస్ డిమాండ్ చేసింది. గాజా యుద్ధానంతర భవిష్యత్ ను నిర్ణయించడంపై అంతర్జాతీయ సమాజం, ఇజ్రాయెల్ ప్రయత్నాలను సైతం తిరస్కరించింది. ఇదిలా ఉండగా.. అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పై హమాస్ జరిపిన దాడుల్లో 1200 మంది మృతి చెందగా.. 250 మందిని బంధీలుగా తీసుకెళ్లారు. ఆ తర్వాత హమాస్ నిర్మూలన లక్ష్యంగా టెల్ అవీవ్ గాజాపై విరుచుకుపడగా.. 25 వేల మంది వరకూ పాలస్తీనియట్లు మృతి చెందగా.. ఇజ్రాయెల్ లెక్కల ప్రకారం హమాస్ మిలిటెంట్లు 9 వేల మంది హతమయ్యారు.


Related News

Chiranjeevi : గిన్నిస్ రికార్డులో మెగాస్టార్ కి చోటు.. అమీర్ ఖాన్ చేతుల మీదుగా..!

Iran coal mine: ఇరాన్‌లో ఘోర విషాదం.. భారీ పేలుడుతో 30 మంది మృతి

World’s Tallest Bridges Guizhou: ప్రపంచంలోనే 100 ఎత్తైన వంతెనల్లో 49 ఒకే రాష్ట్రంలో.. ప్రకృతి ఒడిలో ఈ అందమైన బ్రిడ్జిలు ఒక్కసారైనా చూడాలి!

Gunfire in America: అమెరికాలో మరోసారి గర్జించిన తుపాకీ.. నలుగురు మృతి

PM Modi Quad: ‘ప్రపంచవ్యాప్తంగా సర్వికల్ క్యాన్సర్‌తో పోరాటంలో భారత్ కీలక పాత్ర’.. 75 లక్షల డాలర్లు ప్రకటించిన ప్రధానీ మోదీ

Indian stuck in Foreign for 23 years: పరాయి దేశంలో 23 ఏళ్లుగా చిక్కుకుపోయిన భారతీయుడు.. ఎలా తిరిగొచ్చాడంటే..

Elections: టెన్షన్ టెన్షన్… మరికొద్ది సేపట్లోనే ఆ ఎన్నికల ఫలితాలు..

Big Stories

×