EPAPER
Kirrak Couples Episode 1

Trump Campaign Hacked: ట్రంప్ క్యాంపెయిన్‌ హ్యాక్ చేసిన ఇరాన్?.. అమెరికా కోర్టులో కేసు..

Trump Campaign Hacked: ట్రంప్ క్యాంపెయిన్‌ హ్యాక్ చేసిన ఇరాన్?.. అమెరికా కోర్టులో కేసు..

Iranian Hackers Target Trump Campaign: మరో రెండు నెలల్లో జరుగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇతర దేశాలు.. ముఖ్యంగా చైనా, ఇరాన్, రష్యా.. జోక్యం చేసుకుంటున్నాయని అమెరికా న్యాయ విభాగం ఆరోపణలు చేసింది. అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా మాజీ ప్రెసిడెంట్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రచారాన్నిహ్యాక్ చేశారని, ముగ్గురు ఇరానియన్ హ్యాకర్లపై ఆరోపణలు నమోదయ్యాయి. ఈ ముగ్గురు కూడా ఇరాన్ కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్(ఐఆర్‌జిసి)కి చెందిన వారని ఫెడరల్ ప్రాసిక్యూటర్లు అన్నారు.


ఈ ఇరానియన్ హ్యాకర్లు చాలా కాలంగా ట్రంప్ ఎన్నికల క్యాంపెయిన్ ని టార్గెట్ చేస్తున్నారని.. ట్రంప్ నకు మద్దతిస్తున్న పార్టీ నేతల ఆఫీసుల నుంచి కీలక డాక్యుమెంట్స్ దొంగతనం చేసి ఈ సమాచారాన్ని జర్నలిస్టులకు, ట్రంప్ ప్రత్యర్థి అయిన జోబైడెన్ మద్దతుదారులకు ఇచ్చారని అమెరికా అటార్నీ జెనెరల్ మెర్రిక్ గార్లాండ్ తెలిపారు.

Also Read: ‘ఇరాన్ లో ఏ మూలలోనైనా ఇజ్రాయెల్ దాడి చేయగలదు’.. ఐరాసలో నెతన్యాహు వార్నింగ్!


ఇరానియన్ హ్యాకర్లు ట్రంప్ మద్దుతుదారుల ఆఫీసులకు జూన్ 2024లో ఫిషింగ్ ఈమెయిల్స్ పంపినట్లు మైక్రోసాఫ్ట్ సంస్థ ధృవీకరించిందని వెల్లడించారు. ఇలాంటి ఫిషింగ్ ఈమెయిల్స్ బైడెన్ మద్దతుదారుల ఆఫీసులకు కూడా వచ్చినట్లు గూగుల్ సైబర్ సెక్యూరిటీ బ‌ృందం తెలిపిందని అన్నారు. ఇతర దేశాలు కాదు అమెరికా పౌరులకు మాత్రమే ఎన్నికల్లో నిర్ణయం తీసుకునే అధికారం ఉంది, అని అమెరికా అటార్నీ జెనెరల్ మెర్రిక్ గార్లాండ్ అన్నారు.

ఇదంతా జో బైడెన్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేస్తున్న సమయంలో జరిగింది. అయితే ఈ ఫిషింగ్ ఈమెయిల్స్ ద్వారా హ్యాకింగ్ చేయడంలో ఇరానియన్ హ్యాకర్లు విజయవంతమయ్యారా? దాని ప్రభావం ఎన్నికల్లో ఎంతవరకు ఉంటుందనే వివరాలు వెల్లడి కాలేదు.

ఈ ముగ్గురు ఇరాన్ హ్యాకర్లపై ఆంక్షలు విధించినట్లు అమెరికా ట్రజరీ డిపార్ట్ మెంట్ తెలిపింది.

Also Read: ‘కశ్మీర్ టెర్రరిజంపై మాకు నీతులా?’.. ఐరాస సమావేశాల్లో పాకిస్తాన్‌కు గట్టి కౌంటర్ ఇచ్చిన భారత్..

అమెరికా ఎన్నికల్లో చైనా, రష్యా ప్రభావం..
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో చైనా, రష్యా దేశాలు కూడా ప్రభావం చూపాలని ప్రయత్నిస్తున్నాయని అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంథోని బ్లింకెన్ ఏప్రిల్ 2024లో అన్నారు. రాజకీయ నాయకులపై చైనా దాడులు చేయించినట్లు ఆధారాలున్నట్లు ఆయన అప్పట్లో చెప్పారు. మరోవైపు రష్యా అధ్యక్షడు పుతిన్ కొన్ని రోజుల క్రితం కమలా హ్యారిస్ కే తన మద్దతు అని ఒక టీవి ఇంటర్‌వ్యూలో అన్నారు. దీంతో రష్యా మీడియా అమెరికా ఎన్నికలను ప్రభావితం చేస్తోందనే ఆరోపణలు వచ్చాయి.

అమెరికా అంతర్గత విషయాల్లో చైనా, రష్యా కలుగుజేసుకుంటున్నాయని గతంలోనూ ఆరోపణలు రాగా రెండు దేశాలు కూడా ఈ ఆరోపణలను ఖండించాయి.

Related News

Hezbollah Chief Killed: హెజ్బొల్లాకు భారీ షాక్.. చీఫ్ హసన్ నస్రల్లా మృతి

NASA Will Launch Crew-9 Today: ఈ మిషన్ సక్సెస్ అయితే చాలు.. సునీతా విలియమ్స్ భూమి మీదికి వచ్చినట్లే..

Hurricane Helene: అమెరికాలో హరికేన్ బీభత్సం.. 44 మంది మృతి

India Rebutes Pakistan: ‘కశ్మీర్ టెర్రరిజంపై మాకు నీతులా?’.. ఐరాస సమావేశాల్లో పాకిస్తాన్‌కు గట్టి కౌంటర్ ఇచ్చిన భారత్..

Myopia In Kids Globally: లాక్ డౌన్ తరువాత పిల్లల్లో కంటి సమస్యలు.. బిబిసి నివేదికలో వెల్లడి!

Netanyahu At UN: ‘ఇరాన్ లో ఏ మూలలోనైనా ఇజ్రాయెల్ దాడి చేయగలదు’.. ఐరాసలో నెతన్యాహు వార్నింగ్!

Big Stories

×