EPAPER

Iran Woman Hijab Protest: ఇరాన్ లో లోదుస్తుల్లో నిరసన చేసిన మహిళ మిస్సింగ్.. చంపేశారా?

Iran Woman Hijab Protest: ఇరాన్ లో లోదుస్తుల్లో నిరసన చేసిన మహిళ మిస్సింగ్.. చంపేశారా?

Iran Woman Hijab Protest| రెండు రోజుల క్రితం సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయింది. ఇరాన్ లో ఒక యూనివర్సిటీకి చెందిన ఆ వీడియోలో ఒక మహిళ అర్ధనగ్నంగా నిలబడి నిరసన చేస్తూ కనిపించింది. అయితే ఆ వీడియో చివర్లో ఇద్దరు సివిల్ దుస్తుల్లో ఉన్న పురుషులు ఆమెను ఒక కారులో బలవంతంగా కూర్చోబెట్టి తీసుకెళ్లారు.


సోషల్ మీడియా పోస్ట్ ప్రకారం.. ఆ మహిళ యూనివర్సిటీలో దుస్తుల నియమాన్ని పాటించలేదని సెక్యూరిటీ సిబ్బంది ఆమెను లోపలికి అనుమతించలేదు. దీంతో ఆమె తాను ధరించిన దుస్తులను కూడా విప్పేసింది. కేవలం లోదుస్తుల్లో నిలబడి నిరసన చేసింది. వీడియోలో ఆమె యూనివర్సిటీ బయట అటూ ఇటూ తిరుగుతూ కనిపించింది. ఆ తరువాత ఆమెను ఇద్దరు పురుషులు కారులో తీసుకెళ్లిపోయారు. ఈ ఘటన ఇరాన్ రాజధాని టెహ్రాన్ లోని ప్రతిష్టాత్మక ఇస్లామిక్ అజాద్ యూనివర్సిటీలో జరిగింది.

అయితే ఆ ఘటన జరిగినప్పటి నుంచి ఆ గుర్తు తెలియని మహిళ ఆచూకీ తెలియడం లేదు. దీంతో ఆమెను ఇరాన్ ప్రభుత్వం హత్య చేసిందా? అని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఈ కారణంగా అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం ‘ఆమ్నెస్టీ ఇంటర్నేష్నల్’ ఇరాన్ ప్రభుత్వాన్ని ఈ అంశంపై ప్రశ్నించింది. ఆ మహిళను వెంటనే విడుదల చేయాలని చెప్పింది. ఆ మహిళ ఎవరు, ఆమె వివరాలు బహిర్గతం చేసి, ఆమె జైల్లో ఉంటే ఆమె కుటుంబానికి సమాచారం అందించాలని.. ఆమె కోసం ఒక లాయర్ ను ఏర్పాట చేయాలని ఇరాన్ అధికారులను అడిగింది. అర్ధనగ్న నిరసన చేసిన ఆ మహిళను పోలీసులు కొట్టారని, ఆమెను లైంగికంగా వేధించారని సోషల్ మీడియాలో చర్చ మొదలుకావడంతో ఆమ్నెస్టీ ఇంటర్నేష్నల్ కలుగు జేసుకొని ఆ మహిళ సురక్షితంగా ఉందని తమకు వెంటనే స్పష్టత ఇవ్వాలని కోరింది.


Also Read: కెనడాలో హిందు దేవాలయంపై దాడి.. భక్తులపై అటాక్ చేసిన సిక్కు కార్యకర్తలు

ఈ అంశంపై ఇస్లామిక్ అజాద్ యూనివర్సిటీ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ అమిర్ మహ్‌జోబ్ స్పందించారు. మహిళ పేరు బహిర్గతం చేయకుండా ఆయన ట్విట్టర్ ఎక్స్ లో ఆయన ఓ పోస్ట్ చేశారు. “యూనివర్సిటీ బయట డ్రెస్ కోడ్ కు వ్యతిరేకంగా నిరసన చేసిన మహిళ ఇద్దరు పిల్లల తల్లి. ఆమె తన భర్త నుంచి విడిపోయి.. యూనివర్సిటీలో చదువుకుంటోంది. అయితే మానసిక సమస్యలు ఉండడంతో ఆమెను ఒక మెంటల్ ఆస్పత్రికి చికిత్స కోసం తీసుకెళ్లారు.” అని డైరెక్టర్ అమిర్ మహ్‌జోబ్ తన పోస్ట్ లో రాశారు.

మరోవైపు ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంఘం ఇరాన్ ప్రత్యేక రిపోర్టర్ మాయి సాటో కూడా ఈ విషయంపై ఇరాన్ అధికారులను వివరణ కోరామని అన్నారు.

ఇస్లామిక్ దేశమైన ఇరాన్ లో మహిళలు బహిరంగ ప్రదేశాల్లో తలపై స్కార్ఫ్ (హిజాబ్) ధరించడం, లూజు దుస్తులు వేసుకోవడం తప్పనిసరి. 2022లో ఇరాన్, కుర్దిష్ మూలాలున్న ‘మహ్సా అమిని’ అనే మహిళ ఇలాంటి దుస్తులను వ్యతిరేకించింది. ఆ సమయంలో ఆమెను పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు. ఆ తరువాత ఆమె పోలీస్ కస్టడీలో మరణించినట్లు వార్తలు వచ్చాయి. ఈ ఘటన తరువాత దేశ వ్యాప్తంగా నిరసనలు జరిగాయి. చాలా మంది మహిళలు తమ స్కార్ఫ్ లు తీసి బహిరంగంగా నిప్పంటించారు. ఇరానియన్ నటి హెంగామెహ్ గాజియానీ కూడా హిజాబ్ కు వ్యతిరేకంగా ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్‌లు చేయడంతో ఆమెను కూడా అరెస్టు చేశారు. ఆ తరువాత దాదాపు 500 మంది నిరసనకారులు చనిపోయారని అంతర్జాతీయ మీడియా తెలిపింది.

Also Read:  ‘ఎక్కువ కాలం బతకడు.. త్వరలోనే లేపేస్తాం’.. హిజ్బుల్లా కొత్త నాయకుడిపై ఇజ్రాయెల్ వ్యాఖ్యలు

నిరసనకారులను ఇరాన్ మోరల్ పొలీస్ ‘గష్తె ఎర్షాద్’ ఉందని కథనాలు ప్రచురితమయ్యాయి. బహిరంగ ప్రదేశాల్లో స్కూళ్లు, కాలేజీలలో మహిళలు తప్పనిసరిగా నియమాల ప్రకారం శరీరమంతా కనబడకుండా దుస్తులు ధరించకపోతే గష్తె ఎర్షాద్ అధికారులు అరెస్ట్ చేస్తారు. 2022లో మహ్సా అమిని పోలీస్ కస్టడీలో మరణించినట్లే.. తాజాగా యూనివర్సిటీ వద్ద నిరసన చేసిన మహిళ కూడా చనిపోయిందా? అనే ప్రచారం జరుగుతోంది.

Related News

US Election 2024: మరికొద్ది గంటల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు, ఎలక్షన్ ప్రక్రియ ఎలా సాగుతుందంటే?

Trump WhiteHouse: ఓటమిని ట్రంప్ అంగీకరించడా?.. 2020లో వైట్ హౌస్‌ని వీడి తప్పుచేశానని వివాదాస్పద వ్యాఖ్యలు!

Newborn Baby Facebook Sale : పసిబిడ్డను ఫేస్‌బుక్‌లో అమ్మకానికి పెట్టిన తల్లి అరెస్ట్.. ఆ డబ్బులు దేనికోసమో తెలుసా?..

Nigeria Kids Death Sentence: 29 మంది పిల్లలకు ఉరిశిక్ష?.. జైల్లో ఆహారం ఇవ్వకుండా వేధింపులు..

Canada Hindu Attacks: కెనడాలో హిందు దేవాలయంపై దాడి.. భక్తులపై అటాక్ చేసిన సిక్కు కార్యకర్తలు

Irani Women Protest : నియంత దేశంలో.. ఈ యువతి గుండె ధైర్యానికి ప్రపంచమంతా సెల్యూట్

Big Stories

×