EPAPER

International:దాడులకు భయపడి కెనడాని వీడే ప్రసక్తే లేదు: కెనడా ఎంపీ చంద్ర ఆర్య

International:దాడులకు భయపడి కెనడాని వీడే ప్రసక్తే లేదు: కెనడా ఎంపీ చంద్ర ఆర్య

Canada being polluted by Khalistanis.. Indian origin MP fired
కెనడాలో రోజురోజుకూ ఖలిస్తానీల ఆగడాలు శృతి మించిపోతున్నాయని..భారతీయులను తమ దేశాలకు తిరిగి వెళ్లిపోవాలని హెచ్చరిస్తున్న ఖలిస్తానీ వేర్పాటు వాద సంస్థలపై భారత సంతతికి చెందిన కెనడా ఎంపీ చంద్ర ఆర్య తీవ్రంగా ఆగ్రహించారు. ఖలిస్తానీలు కూడా భారతీయులే అన్న సంగతి మరచి విదేశాలలో తమ ఆగడాలతో భయోత్పాతం కలిగిస్తున్నారని మండిపడ్డారు. అక్కడ ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థకు చెందిన నేత గురుపత్వంత్ సింగ్ తనకి వార్నింగ్ ఇవ్వడం పట్ల తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చారు ఎంపీ చంద్ర ఆర్చ. తననే కాదు తన సహచరులను కూడా భారత్ కు వెళ్లిపోవాలంటూ చేసిన హెచ్చరికతో ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా ఓ వీడియోను కూడా విడుదల చేశారు.


ఎడ్మింటన్ లో హిందూ దేవాలదాడులపై ఖండనయంపై ఖలిస్తానీ దాడులను ఎంపీ చంద్ర ఆర్య ఖండించారు. కెనడా లో అనేక దేశాలనుంచి వచ్చి ఇక్కడే స్థిరపడి ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నారని..ఖలిస్తానీల ఆగడాలతో వారంతా భయబ్రాంతులకు గురవుతున్నారని అన్నారు. అంతేకాదు భారతదేశంలో వివిధ రాష్ట్రాలనుంచి కెనడాలో స్థిరపడిన భారతీయులెందరో ఉన్నారని..తామంతా ఖలిస్తానీలకు భయపడి ఎక్కడికీ వెళ్లబోమని అన్నారు. భారతదేశంలోనూ భిన్నత్వంలో ఏకత్వం కలిగిన నాగరికత ఉందని..అదే సంస్కృతి కెనడాలోనూ ఉందని..జాతి సమగ్రత కోసం పాటుపడతామని అన్నారు.

ఉగ్రవాదానికి ఊతమిస్తున్న ఖలిస్తాన్


దేశ సమగ్రతకు ఆటంకం కలిగించే ఉగ్రవాద చర్యలను ఎంతమాత్రం సహించబోమనా స్పష్టం చేశారు. భారత దేశ స్ఫూర్తితోనే కెనడాలోనూ ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతకర వాతావరణంలో ఉంటున్నామని అన్నారు. ఇక్కడ నుండే ఖలిస్తాన్ కార్యకలాపాలను కొనసాగిస్తూ భారత్ లోనూ విధ్వంసం సృష్టించాలని చూస్తున్నారని ..ఈ విషయంలో భారత్ కూడా ఖలిస్తాన్ కవ్వింపు చర్యలకు లోనవకుండా ఉగ్రవాదాన్ని అణిచివేస్తోందని అన్నారు. ఖలిస్తానీల చర్యలతో కెనడాకి కూడా చెడ్డ పేరు వస్తోందని..ఇలాంటివి ఇకపై ప్రోత్సహించబోమని స్పష్టం చేశారు. భారత సంతతికి చెందిన కెనడా పౌరుడు చంద్ర ఆర్య. కర్ణటక రాష్ట్రంలో పుట్టి కెనడాలో స్థిరపడిన చంద్ర ఆర్య ఎంపీగా పదవీ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు తన మాతృభాష కన్నడలోనే ప్రమాణం చేసి కన్నడిగుడల అభిమానాన్ని చూరగొన్నాడు. అప్పట్లో ఆయన స్ఫూర్తికి అందరూ ప్రశంసించారు.

Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Big Stories

×