EPAPER

Womens Day Special: ప్రతి రంగంలో ప్రతిభ.. స్పూర్తి దాయకంగా నిలుస్తున్న మహిళలు

Womens Day Special:  ప్రతి రంగంలో  ప్రతిభ.. స్పూర్తి దాయకంగా నిలుస్తున్న మహిళలు
womens day
 

Women Are Path Success Various Fields: మహిళలు లేకపోతే దేశ అభివృద్ధి ఉండదు. ఏ పక్షి అయినా ఒక రెక్కతో ఎగరలేదు అన్న స్వామి వివేకానంద మాటలు స్మరిస్తూ.. జయహో.. జనయత్రి . ఏటా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటారు. ఈ సందర్బంగా మహిళామూర్తులకు శుభాకాంక్షలు.


సమాజ నిర్మాణంలో సగ భాగమైన మహిళల సమానత్వమే మన ప్రగతికి మూలం. ఇదే నినాదంతో ఐక్యరాజ్య సమితి మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకను ప్రతి సంవత్సరం నిర్వహిస్తోంది. మహిళలు సమాజంలో ఆత్మ గౌరవంతో, స్వశక్తితో తమ ఆర్ధిక అవసరాలను తానే నిర్మించుకోగలిగే ఉన్నత స్థితికి చేరుకుంది. స్త్రీ శక్తి ఏంటో ప్రపంచానికి తెలిసేలా ముందడుగు వేస్తున్నారు. వైద్య, విద్య, వ్యాపార రంగాల్లో పురుషులతో సమానంగా.. క్రీడలు, రాజకీయాలు, బ్యాంకింగ్, అంతరిక్షం, టెక్నాలజీ రంగాలలో మహిళలు సాధికారక సాధన దశగా అడుగులు వేస్తున్నారు.

వినీత సింగ్(కాస్మోటిక్)


“వినీత సింగ్ డిజిటల్- ఫస్ట్ కాస్మటిక్ బ్రాండ్ సుగర్” తో ఎంటర్ ప్రెన్యూర్ గా విజయకేతనం మొదలు పెట్టింది. ఆమెకు తండ్రి తేజ్ సింగ్ స్పూర్తి ప్రధాత. తండ్రి శాస్త్ర వేత్త.. 365 రోజులు పని చేస్తూనే ఉంటారు. వినీత ఐఐటీ మద్రాస్ నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి అహ్మదాబాద్ లో తన బిజినెస్ స్టడీని కొనసాగించింది. తన కోర్స్ ముగిసే సమయానికి వినీత స్టార్టప్ పెట్టాలనుకుంది. అందుకోసం ఆమెకు క్యాంపస్ సెలక్షన్స్ లో కోటి రూపాయల వేతనం వచ్చిన ఉద్యోగ ప్రతిపాదనను తిరస్కిరించింది. 2012లో మనదేశంలో ఇ- కామర్స్ ఊపందుకుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని మహిళలకు ప్రతినెలా తక్కువ ధరకు బ్యూటీ ప్రొడక్ట్స్ ను అందించే “ఫ్యాబ్ బ్యాగ్” అనే సబ్ స్క్రిప్షన్స్ వ్యాపారాన్ని మొదలు పెట్టింది. ఈ వ్యాపారం మంచి విజయం సాదించింది. 2015లో డైరక్ట్ -టు- కన్స్యూమర్ మేకప్ బ్రాండ్ గా సుగర్ కాస్మటిక్ కంపెనీని ప్రారంభించి తిరుగులేని విజయం అందుకుంది.

హార్దిక షా (ఫిన్ టెక్)
ముంబైలోని మధ్య తరగతి కుటుంబంలో పెరిగింది. చిన్ననాటి నుంచి తల్లి పడిన కష్టాలను చూసింది. యూఎస్ లో కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసింది. ఆ తర్వాత కొలంబియాలో ఎంబీఏ పూర్తి చేసింది. మన దేశంలో చిన్న చిన్న వ్యాపారం చేస్తున్న వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి నిపుణులతో మాట్లాడి ఎన్నో విషయాలు తెలుసుకుంది. బెంగుళూరు కేంద్రంగా కినారా క్యాపిటల్ అనే “ఫిన్ టెక్” సంస్థను ప్రారంభించింది. ఈ ఫిన్ టెక్ సంస్థ ఆరు రాష్టాల్లో 110 కంపెనీలు ఉన్నాయి. గ్యారెంటీ లేని బిజినెస్ రిస్క్ ఎందుకు అన్నారు అందరూ.. కాని ఆ మాటలేమి హార్దిక షాపై ప్రభావం చూపలేదు. తొలి దశలోనే కస్టమర్లు, ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని గెలుచుకుంది. ఫిన్ టెక్ ఫీల్డ్ లో విజయకేతనం ఎగరవేసింది.

Read more: అంతర్జాతీయ మహిళా దినోత్సవం.. మహిళా సాధికారత కోసం 2024 థీమ్ ఇదే..

నేహా సతక్ (ఆస్ట్రోమ్ టెక్నాలజీ)
“నన్ను నేను ఒక ఇన్నోవేటర్ గా భావిస్తాను” అంటుంది నేహా సతక్. బెంగుళూరు లోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి ఇంజనీరింగ్ లో మాస్టర్స్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా మారు మూల ప్రాతంలో ఇంటర్నెట్ సేవలు తక్కువ ధరకే అందుబాటులో ఉండేలా ఆస్ట్రోమ్ టెక్నాలజీ ప్రవేశపెట్టింది నేహా సతక్. ఆస్ట్రోమ్ టెక్నాలజీ చుట్టు ప్రక్కల ఉన్న నాలుగు డివైజ్ లను కనెక్ట్ చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఈ సాంకేతక పరిజ్ఞానం ఒక పరికరాన్ని మాత్రమే కనెక్ట్ చేయగలదు అంటుంది నేహా సతక్.

అశ్వినీ అశోకన్ (ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్)
అమెరికాలో కార్నెగీ మెలన్ యూనివర్సిటీలో ఇంటరాక్షన్ డిజైన్ కోర్స్ చదువుతున్న అశ్వని అశోకన్ చిన్నప్పటి నుంచే కంప్యూటర్ కి సంబంధించిన విషయాలపై ఆసక్తి ఉండేది. ఇంటెల్ లోని వివిధ రంగాల్లో ఇంటర్నెట్ కు సంబంధించిన పలు విభాగాల్లో పనిచేసింది. ఆ తర్వాత తన అనుభవ జ్ఞానంతో మ్యాడ్ స్ట్రీట్ డెన్ ను ప్రారంభించింది. డిజిటల్, ఏఐ ట్రాన్స్ ఫర్ మేషన్ కు సంబంధించిన కంపెనీల జర్నీలో “మ్యాడ్ స్ట్రీట్” పలు రకాలుగా ఉపయోగపడుతుంది. అన్ని రంగాల్లో మహిళలు ముందుండాలి అని కోరుకుంటున్న అశ్వినీ అశోకన్ ఈ భూభాగంలో ప్రతి ఉద్యోగి, ప్రతి వ్యక్తిని ఏఐ నేటివ్ గా చూడాలనుకుంటుంది.

 

 

 

Tags

Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Big Stories

×