EPAPER

News Feature in Instagram: నగ్న చిత్రాలు పంపితే బ్లర్ అవుతాయి.. ఇన్‌స్టాలో కొత్త ఫీచర్‌!

News Feature in Instagram: నగ్న చిత్రాలు పంపితే బ్లర్ అవుతాయి.. ఇన్‌స్టాలో కొత్త ఫీచర్‌!
Instagram Introduces Nudity Blur Feature In DMs To Protect Young Users:

ఈ తరం యువతను ఎక్కువగా ఆకట్టుకుంటున్న సోషల్ మీడియా యాప్స్ లో ఇన్‌స్టాగ్రామ్ ఒకటి. అందులో రీల్స్ చూస్తూ ఈజీగా కాలం గడిపేస్తున్నారు జనాలు. అయితే కొన్ని అసభ్యకర వీడియోలు యువతను ఇబ్బంది పెడుతున్నాయి. యువత, చిన్నారుల ఆన్ లైన్ భద్రతా దిశగా ఇన్‌స్టా కొత్త ఫీచర్ ను తీసుకొస్తుంది. ఇన్‌స్టాగ్రామ్ లో డైరెక్ట్ మెసేజ్ క్రింద నగ్న చిత్రాలను పంపిన సందర్బాలలో ఈ టూల్ వాటిని ఆటోమేటిక్ గా బ్లర్ చేస్తుందని సామాజిక మాద్యమ వేదిక ఇన్‌స్టాగ్రామ్ తెలిపింది.


ఇమేజ్ అబ్యూజ్, లైంగిక స్కాముల నుంచి రక్షణ కల్పించేందుకు ఈ కొత్త తరహా ఫీచర్ ను డెవలప్ చేస్తున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ తెలిపింది. 18 ఏళ్ల లోపు వారి ముబైల్స్ లో ఈ ఫీచర్ డీఫాల్ట్ గా ప్రారంభమై ఉంటుందని, పెద్దలు ఎవరైన కూడ దీన్ని యాక్టివేట్ చేసేలా ప్పోత్సహించేందుకు నోటిఫికేషన్లు పంపిస్తామని ఇన్‌స్టాగ్రామ్ వర్గాలు వెల్లడించాయి.

యూజర్ల ముబైల్ ఫోన్లోని మెషిన్ లెర్నింగ్ టూల్ ఎండ్ టూ ఎండ్ ఎన్ క్రిప్షన్ విధానంలో చిత్రాల పరిశీలన జరుపుతుందని సంస్థ పేర్కొంది. ప్రస్తుతం మెటా మెసెంజర్, వాట్సాప్ లో ఈ ఎన్ క్రిప్షన్ అందుబాటులో ఉంది. యువతకు సోషల్ మీడియా ఓ వ్యసనంగా మారిపోయింది. దీనికి తోడు ఆన్ లైన్ లలో సైబర్ నేరగాళ్ల ఈ వేదికల ద్వారా లైంగిక దోపిడి, బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు.


Also Read: సైబర్ క్రైమ్ లో రష్యా టాప్.. భారత్‌ది 10వ స్థానం

ఈ నేపథ్యంలో ఇన్‌స్టాగ్రామ్ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే అనేక దేశాలు ఒత్తిడి పెంచారు. గతేడాది యూఎస్ లోని అటార్నీ జనరల్స్ ఫేస్ బుక్ పై కేసు పెట్టారు. చట్ట వ్యతిరేక హానికారక సమాచారం నుంచి చిన్నారులను రక్షించేందుకు మెటా ఏ చర్యలు తీసుకుంటుందో చెప్పాలని యూరోపియన్ కమీషన్ కూడా ఫేస్ బుక్ ను ఆదేశించింది.

Related News

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Longest working hours: ఈ దేశాలకి వెళ్లే అవకాశం వచ్చినా వెళ్ళకండి.. అత్యధిక పని గంటలు ఉన్న దేశాలు ఇవే..

Big Stories

×