EPAPER

S Jai Shanker : పాకిస్థాన్‌లో అడుగుపెట్టి.. వారికే చురకలంటించిన భారత విదేశాంగ మంత్రి జైశంకర్.. చైనాకూ మొట్టికాయలు

S Jai Shanker : పాకిస్థాన్‌లో అడుగుపెట్టి.. వారికే చురకలంటించిన భారత విదేశాంగ మంత్రి జైశంకర్.. చైనాకూ మొట్టికాయలు

S JAI SHANKER : పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ సమావేశంలో జైశంకర్ చైనా పాకిస్తాన్‌లపై విరుచుకుపడ్డారు. దేశాల మధ్య సహకారం పరస్పర గౌరవం, సార్వభౌమ సమానత్వంపై ఆధారపడి ఉండాలని సూచించారు. పాక్‌కు చెందిన షెహబాజ్ షరీఫ్, చైనీస్ లీ కియాంగ్ సమక్షంలోనే భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.


పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ అధ్యక్షఇస్లామాబాద్‌లో షాంఘై సహకార సంస్థ (ఎస్​సీవో) సదస్సు జరుగుతోంది. అయితే భారత ప్రతినిధి బృందానికి భారత విదేశాంగ శాఖ మంత్రి (ఈఏఎం) జైశంకర్‌ సారథ్యం వహించారు.

సదస్సులో భాగంగా మాట్లాడిన ఎస్ జైశంకర్ తీవ్రవాదం, ఉగ్రవాదంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు పరోక్షంగా ఆతిథ్య దేశానికి, పొరుగున ఉన్న డ్రాగన్ దేశానికి నర్మగర్భంగా పలు ప్రశ్నలు సంధించారు.


సరిహద్దుల్లో తీవ్రవాదం, ఉగ్రవాద, వేర్పాటువాద కార్యకలాపాలు కొనసాగుతుంటే ఇక వాణిజ్యం, ఇంధనం, కనెక్టివిటీ లాంటి అంశాల్లో సహకారం వృద్ధి ఎలా ఉంటుందని నిలదీశారు.

దేశాల మధ్య పరస్పర నమ్మకం, సహకారం, స్నేహం లోపించకూడదని, ఒకవేళ అవి లేకపోతే ఆయా దేశాలతో సత్సంబంధాలు కూడా తెగిపోతాయన్నారు.

దేశాల మధ్య పరస్పర గౌరవం, సార్వభౌమ సమానత్వంపై స్నేహం ఆధారపడి ఉండాలన్నారు. సభ్య దేశాల ప్రాదేశిక సమగ్రత, సారభౌమత్వాన్ని గుర్తించుకోవాలని హితవు పలికారు. ఈ మేరకు అందరూ కలిసి ఐక్యంగా ముందుకు సాగాలన్నారు. అప్పుడే ఎస్​సీఓ సభ్య దేశాలు ప్రయోజనం పొందుతాయున్నారు.

రెండు రోజుల సదస్సును బుధవారంతో ముగించుకున్న జైశంకర్ బుధవారం సాయంత్రం ఇస్లామాబాద్ నుంచి దిల్లీకి బయలుదేరారు. ఈ నేపథ్యంలోనే తమకు ఆతిథ్యం ఇచ్చినందుకు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఉప ప్రధాని విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ లకు ధన్యవాదాలు తెలియజేశారు.

also read : 10 రోజుల్లో మార్పు రాకుంటే అంతే, ఉచిత ఇసుకపై మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్

Related News

Fighter jets Escort Air India: ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు.. సింగపూర్ ఎయిర్ పోర్ట్ లో హై టెన్షన్

USA Road Accident: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్.. మృతుల్లో ముగ్గురు తెలుగు వాళ్లు!

Kim Jong Un: కిమ్ మామా మజాకా.. కోపంతో సౌత్ కొరియా రోడ్లు పేల్చివేత!

S JAI SHANKER : పాకిస్థాన్‌లో భారత విదేశాంగ మంత్రి జై శంకర్‌.. ప్రధాని షరీఫ్‌తో భేటీ

India-Canada diplomatic row: భారత్-కెనడా మధ్య దౌత్య వివాదం, వీసాల జారీ, విద్యార్థులకు ఇబ్బందులు తప్పవా?

Air India Flight : గాల్లో ఉండగానే దిల్లీ చికాగో విమానానికి బాంబు బెదిరింపు.. ఆ తర్వాత ఏం జరిగిదంటే ?

Big Stories

×