EPAPER

Citizens: ఆ దేశాల్లో మనవాళ్ల పాగా!

Citizens: ఆ దేశాల్లో మనవాళ్ల పాగా!

Citizens : ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్(OECD) దేశాల్లో అత్యధిక సంఖ్యలో పౌరసత్వం పొందుతున్నది మనవాళ్లే. 38 దేశాలతో కూడిన OECD‌లో భారత్ సభ్యదేశం కానే కాదు. అయితే OECD‌లోని పలు సభ్యదేశాలతో వ్యాపార సంబంధాలు కొనసాగుతున్నాయి. 1995 నుంచి భారత్‌కు OECD సహకారం అందిస్తోంది.


దాదాపు లక్ష మంది భారతీయులు అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా తదితర OECD సభ్యదేశాల్లో ఇప్పటికే పౌరసత్వం పొందారు. దేశం నుంచి ఆ మూడు దేశాలకు వలసలు కూడా ఎక్కువే. అమెరికాలో 56,085 మంది పౌరసత్వం పొందగా.. ఆస్ట్రేలియా 24,205, కెనడా 20,75 మంది భారతీయలకు పౌరసత్వం లభించింది.

11,598 మంది ఇండియన్లకు బ్రిటన్ పాస్‌పోర్టు లభించింది. 2021లో పై నాలుగు దేశాలకు కొత్తగా వచ్చి చేరిన పౌరుల్లో అత్యధికులు భారతీయులే. OECD లోని ఇతర సభ్యదేశాల్లో పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నం. ఇటలీ పౌరసత్వం 4,489 మంది, న్యూజిలాండ్ పౌరసత్వం పొందిన ఇండియన్లు 2727 మంది ఉన్నారు. న్యూజిలాండ్‌లో సిటిజన్‌షిప్ పొందిన విదేశీయుల్లో రెండో అతి పెద్ద గ్రూప్‌గా భారతీయులు నిలిచారు.


ఇక డెన్మార్క్‌లో 2,515 మంది, స్పెయిన్ 1,992, నెదర్లాండ్స్ 1736, స్వీడన్‌లో 1635 మంది ఇండియన్లు మాత్రమే సిటిజన్‌షిప్ పొందారు. ఇక OECD దేశాల్లో పౌరసత్వం పొందిన వారిలో భారత్‌తీయులతో పాటు ఇతర దేశాలకు చెందిన వారూ ఉన్నారు. భారత్ తర్వాత అత్యధిక సంఖ్యలో మెక్సికన్లు, సిరియన్లు OECD దేశాల సిటిజెన్‌షిప్ పొందగలిగారు.

Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Big Stories

×