EPAPER

Indians hunger strike in Canada: కెనడాలో భారతీయులు నిరాహార దీక్ష, ఉద్యోగాల కోత

Indians hunger strike in Canada: కెనడాలో భారతీయులు నిరాహార దీక్ష, ఉద్యోగాల కోత

Indians hunger strike in Canada: కెనడాలో ఇండియన్స్ తీవ్రఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్ ప్రావిన్స్‌‌లో మరీ ఎక్కువగా ఉంది. విదేశీ ఉద్యోగులను తగ్గించాలని స్థానిక ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో అక్కడున్నభారతీయులకు కష్టాలు రెట్టింపయ్యాయి. ఈ క్రమంలో రెండురోజులపాటు చార్లెట్ టౌన్‌లో నిరాహార దీక్షకు దిగారు.


ప్రస్తుతం తమ వీసాల గడువు పొడిగించాలన్నది భారతీయుల ప్రధాన డిమాండ్. ఈ విషయంలో ప్రభుత్వం వెనుకడుగు వేయకుంటే సంపూర్ణ నిరాహార దీక్షకు దిగుతామని ఎన్నారైలు ప్రకటించారు. పైస్థాయి అధికారుల నుంచి వేధింపులతో ఇప్పటికే 50 మంది కెనడాను వీడినట్టు నిరసనకారులు చెబుతున్నారు. ఇమిగ్రేషన్ చట్టంలో అక్కడి ప్రభుత్వం సడన్‌గా మార్పులు చేయడమే దీనికి కారణంగా మరికొందరు తెలిపారు.

స్థానిక ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయంతో శాశ్వతంగా నివాసం ఉండాలనుకునే వారికీ కొత్త నిర్ణయాలు శరాఘాతంలా మారాయని పేర్కొన్నారు. తమ డిమాండ్లకు ప్రభుత్వం వెనక్కి తగ్గని పక్షంలో నిరసనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.


స్థానికుల నుంచి తీవ్రస్థాయిలో నిరసనలు వెల్లువెత్తాయి. ఉద్యోగాల పేరుతో వివిధ దేశాల నుంచి ప్రజలు కెనడాకు చేరుకున్నారు. దీంతో అధిక జనాభా కారణంగా నివాసాలకు కొరత ఏర్పడింది. దీని ప్రభావం ఆరోగ్య వ్యవస్థపై పడింది. ఈ నేపథ్యంలో విదేశీ ఉద్యోగులను తగ్గించుకునే పనిలో స్థానిక ప్రభుత్వాలు పడ్డాయి.

ALSO READ: ప్రపంచ దేశాలకు హెచ్చరిక.. రాబోతున్న మరో సంక్షోభం ?

ముఖ్యంగా హాస్పటల్ సెక్టార్‌లో మరిన్ని కోతలు విధించేందుకు సిద్ధమవుతున్నారు. శాశ్వతంగా ఇక్కడే ఉండేవారి సంఖ్యను దాదాపు 25 శాతం మేరా తగ్గించాలని అక్కడి ప్రభుత్వాలు నాలుగునెలల కిందటే తేల్చి చెప్పేశాయి. పై పరిణామాల కారణంగా కెనడాలో ఉన్న భారతీయులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయంపైనే భారతీయులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Tags

Related News

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Longest working hours: ఈ దేశాలకి వెళ్లే అవకాశం వచ్చినా వెళ్ళకండి.. అత్యధిక పని గంటలు ఉన్న దేశాలు ఇవే..

Big Stories

×