EPAPER

Indian Man Shot Dead in Canada: కెనడాలో దారుణం.. భారతీయుడ్ని కాల్చి చంపిన గుర్తు తెలియని వ్యక్తులు

Indian Man Shot Dead in Canada: కెనడాలో దారుణం.. భారతీయుడ్ని కాల్చి చంపిన గుర్తు తెలియని వ్యక్తులు

Indian Man Shot Dead in Canada: కెనడాలో దారుణం చోటు చేసుకుంది. ఓ ఇండియన్‌ని నడిరోడ్డుపై కాల్చి చంపారు గుర్తు తెలియని వ్యక్తులు. ఘటన తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటన నాలుగు రోజుల జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది అసలేం జరిగిందన్న డీటేల్స్‌లోకి వెళ్తే..


ఇండియా-కెనడా మధ్య సంబంధాలు దెబ్బ తింటున్నాయే తప్ప మెరుగుపడడం లేదు. అక్కడ జనాభా పెరుగుతోందన్న కారణంగా ఇప్పటికే అక్కడున్న చాలా మంది ఇండియన్స్‌ని పంపిస్తోంది ఆ దేశం. దౌత్యపరమైన ఒడుదుడుకులు కొనసాగుతున్న నేపథ్యంలో ఓ భారతీయుడ్ని కొందరు వ్యక్తులు నడిరోడ్డుపై కాల్చి చంపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన నాలుగు రోజుల కిందట జరిగింది.

మృతుడు పేరు యువరాజ్ గోయల్. వయస్సు 28 ఏళ్లు. సొంతూరు పంజాబ్‌లోని లుథియానా. ఐదేళ్ల కిందట కెనడాకు వెళ్లాడు. అక్కడే సేల్స్ ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల కెనడాలో శాశ్వత నివాస హోదా లభించింది. శుక్రవారం నాడు సర్రే ప్రాంతంలో జిమ్ నుంచి బయటకు వస్తుండగా కారును ఆపి దుండగులు కాల్పులు జరిపారు. స్పాట్‌ లోనే మృతి చెందాడు యువరాజ్ గోయల్.


Also Read: గాజాలో నెత్తురు.. నలుగురు బందీల కోసం 274 మంది మృతి

ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మృతుడ్ని గుర్తించారు. ఈ ఘటనలో నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సమాచారాన్ని పంజాబ్‌లో ఉన్న యువరాజ్ పేరెంట్స్‌కి తెలిపారు. అయితే మృతుడికి ఎలాంటి నేర చరిత్ర లేదు. కాకపోతే గోయల్‌ని కాల్చి చంపాల్సిన అవసరం వేరే వ్యక్తులకు ఎందుకొచ్చింది? ఈ ఘటనపై కేసు నమోదు చేసిన  కెనడా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tags

Related News

Crime: స్కూల్ బాత్రూంలో కాల్పులు.. బాలుడు మృతి

Russia president Putin: కమలా హ్యారిస్ కు జై కొట్టిన రష్యా అధ్యక్షుడు పుతిన్

USA Gun Fire: తండ్రి గిఫ్ట్‌గా ఇచ్చిన గన్‌తోనే స్కూల్‌లో అరాచకం.. ఐదుగురిని కాల్చి చంపిన ఆ నిందితుడి వయస్సు 14 ఏళ్లే!

PM Modi: భారత్‌లోనూ సింగపూర్‌లను సృష్టిస్తున్నాం: మోదీ

Muhammad Yunus: షేక్ హసీనాకు యూనస్ స్ట్రాంగ్ వార్నింగ్.. ఎందుకంటే ?

Japan Resignation Companies: ఉద్యోగుల చేత రాజీనామా చేయించడం కూడా ఒక బిజినెస్.. జపాన్ లో కొత్త వ్యాపారం

US’s Georgia school shooting: అమెరికాలో మళ్లీ కాల్పులు.. ఈసారి స్కూల్ లో.. నలుగురు మృతి

Big Stories

×