EPAPER

Lebanon Indian Embassy| ‘లెబనాన్ వెళ్లొద్దు’.. భారతీయులకు ప్రభుత్వ హెచ్చరిక

Lebanon Indian Embassy| ‘లెబనాన్ వెళ్లొద్దు’.. భారతీయులకు ప్రభుత్వ హెచ్చరిక

Lebanon Indian Embassy| ఇజ్రెయెల్ – హెజ్బుల్లా మధ్య మొదలైన యుద్ధం కారణంగా లెబనాన్ లో దాడులు జరుగుతున్నాయి. లెబనాన్ లోని హెజ్బుల్లా మిలిటరీ స్థావరాలపై ఇజ్రాయెల్ సైన్యం మిసైల్ దాడులు చేస్తోంది. ఈ కారణంగా లెబనాన్ రాజధాని బేరుట్ లో ఉన్న ఇండియన్ ఎంబసీ గురువారం ఆగస్టు 1, 2024న ఒక అడ్వైజరీ జారీ చేసింది. లెబనాన్ కు భారతీయులు ప్రయాణ రాకపోకలు చేయవద్దని.. వీలైనంత వరకు ప్రయాణం వాయిదా వేసుకోవాలని ఇండియన్ ఎంబసీ.. భారత పౌరులకు సూచించింది.


”భారతీయులు.. లెబనాన్ ప్రయాణం చేయవద్దు. అత్యవసరమైతేనే ప్రయాణించండి. వీలైనంత వరకు ప్రయాణం వాయిదా వేసుకోండి. లెబనాన్ లో నివసిస్తున్న భారతీయులు కూడా ఇళ్ల నుంచి బయటికి రావొద్దు. సాయం కోసం ఇండియన్ ఎంబసీని సంప్రదించండి,” అని అడ్వైజరీలో ప్రకటించింది. ఎటువంటి ఎమర్జెన్సీ వచ్చినా email ID: [email protected], లేదా ఫోన్ నెంబర్: +96176860128 ద్వారా సంప్రదించాలని సూచించింది. లెబనాన్ లో యుద్ధ వాతావరణం కారణంగా ఈ అడ్వైజరీ జారీ చేసినట్లు ఇండయన్ ఎంబసీ అధికారులు తెలిపారు.

Also Read: ఇజ్రాయెల్ మరో యుద్ధం ప్రారంభించబోతోందా?.. గాజా లాగా లెబనాన్ లో కూడా వినాశనం తప్పదా?..


హెజ్బుల్లా సీనియర్ మిలిటరీ కమాండర్ చంపిన ఇజ్రాయెల్ ఆర్మీ
లెబనాన్ లో మిసైల్ దాడి చేసి హెజ్బుల్లా సీనియర్ కమాండర్ ‘ఫుఆద్ షుక్ర్ సయ్యిద్ ముహ్సన్’ ని అంతం చేసినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ అధికారికంగా తెలిపింది. చనిపోయిన ఫుఆద్ షుక్ర్.. హెజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా కు కుడి భజం లాంటివాడు. ఇటీవలే ఇజ్రాయెల్ భూభాగంలోని గోలన్ హైట్స్ లో హెజ్బుల్లా మిలిటెంట్లు రాకెట్ దాడి చేశారు. ఆ రాకెట్ గోలన్ హైట్స్ లోని ఓ ఫుట్ బాల్ గ్రౌండ్ లో పడింది. ఆ సమయంలో అక్కడ ఫుట్ బాల్ మ్యాచ్ జరుగుతోంది. ఈ ఘటనలో 12 మంది టీనేజర్లు చనిపోయారు. ఈ దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ సైన్యం.. లెబనాన్ లోని హెజ్బుల్లా మిలిటరీ స్థావరాలపై దాడులు చేసింది. అయితే ఈ దాడుల్లో హెజ్బుల్లా కమాండర్ తో పాటు ఇద్దరు లెబనాన్ పౌరులు కూడా చనిపోయారు.

చనిపోయిన హెజ్బుల్లా సీనియర్ కమాండర్ గతంలో చాలాసార్లు ఇజ్రాయెల్ పై జరిగిన దాడులకు కారణమని ఇజ్రాయెల్ సైన్యాధికారి తెలిపారు. హెజ్బుల్లా వద్ద ఉన్న అడ్వాన్సడ్ మిలిటీరీ ఆయుధాలు, మిసైల్ రాకెట్ లు, యాంటీ మిసైల్ పరికరాలు సమకూర్చడంలో సీనియర్ కమాండర్ షుక్ర్ ఫుఆద్ కీలక పాత్ర పోషించాడు. అతన్ని చంపేందుకు ఇజ్రాయెల్ సైన్యం మొత్తం 10 మిసైల్స్ లెబనాన్ పై వేసింది.

ఈ దాడులు జరుగుతుండడంతో లెబనాన్ లో యుద్ధ వాతావరణం నెలకొంది. అందుకే భద్రతా కారాణాల రీత్యా భారతీయులు లెబనాన్ కు ప్రయాణం మానుకోవాలని ఎంబసీ హెచ్చిరించింది.

Also Read: హమాస్ తదుపరి అధ్యక్షుడు ఖాలిద్ మిషాల్.. ఇతన్ని చంపడం అంత సులువు కాదు!

Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Big Stories

×