EPAPER

Indian Doctors Showing Power in USA: తెలుగోడా మజాకా.. అమెరికాకు ఇండియన్ ట్రీట్మెంట్

Indian Doctors Showing Power in USA: తెలుగోడా మజాకా.. అమెరికాకు ఇండియన్ ట్రీట్మెంట్

అమెరికన్ హెల్త్‌ సెక్టార్‌లో ఎంత మంది పని చేస్తున్నారు. వారిలో ఇతర దేశాల నుంచి వచ్చిన వారి సంఖ్య ఎంత? అందులో ఏ దేశానికి చెందిన వారు ఎంత మంది ఉన్నారు? ఇలా అన్ని వివరాలతో ఓ రిపోర్ట్‌ను రూపొందించింది ఓ అమెరికన్ బేస్‌డ్ కంపెనీ.. ఈ డేటా చెబుతున్నది ఏంటంటే.. మొత్తం 34 లక్షల 10 వేల మందికిపైగా ఇతర దేశాల నుంచి వచ్చిన వారు ఉన్నారు. ఇందులో డాక్టర్లు ఉన్నారు. నర్సులూ ఉన్నారు. వీరిలో అత్యధికంగా ఇతర దేశాల నుంచి వచ్చిన వారే ఉన్నారు. ఫస్ట్‌ డాక్టర్స్.. అమెరికాలోని మొత్తం డాక్టర్ల సంఖ్య 9 లక్షల 90 వేలు.. అందులో విదేశాల నుంచి వచ్చి అమెరికాలో పనిచేస్తున్న వారు అంటే వలసదారుల సంఖ్య 2 లక్షల 60 వేల మంది.

అంటే మొత్తం డాక్టర్లలో 26.5 శాతం మంది వలసదారులే. ఇందులో ఇండియన్స్ సంఖ్య ఎంతో తెలుసా.. అక్షరాలా 59 వేల మంది.. అంటే ప్రతి ఐదుగురు వలసదారుల్లో ఒకరు ఇండియన్‌ అన్నమాట. ఇది మొత్తం వలసదారుల్లో 22 శాతం.. మన తర్వాత చైనా నుంచి వచ్చిన వారి సంఖ్య 16 వేలు.. 13 వేల మంది డాక్టర్లతో మూడో స్థానంలో పాకిస్థాన్ ఉంది. అంటే అమెరికాలోని ఇండియన్ డాక్టర్స్‌ సంఖ్య 22 శాతం కాగా.. చైనా ఆరు శాతం.. పాకిస్థాన్‌ 5 శాతంగా ఉంది. మన ఇండియన్‌ డాక్టర్స్ అంతా ఎక్కువగా న్యూజెర్సీ, ఫ్లోరిడా, న్యూయార్క్‌లోనే ఎక్కువగా తమ సేవలు అందిస్తున్నట్టు తెలుస్తుంది.


నెక్ట్స్‌ నర్సులు.. అయితే నర్సుల విషయంలో మాత్రం మన ఇండియన్స్ వెనకపడ్డారు. అమెరికాలో నర్సులుగా పనిచేస్తున్న వారి సంఖ్య 34 లక్షల మందికిపైగా.. వీరిలో 5 లక్షల 40 వేల మందికిపైగా వలసదారులే ఉన్నారు. అంటే నర్సులుగా పనిచేస్తున్న వారిలో 16 శాతం మంది వలసదారులే.. అయితే ఇందులో ఎక్కువగా అంటే ఏకంగా లక్షా 40 వేల మందికిపైగా ఫిలిప్పిన్స్‌ నుంచి వచ్చిన వారే ఉన్నారు. ఫిలిప్పిన్స్‌ తర్వాత సెకండ్ ప్లేస్‌లో ఇండియన్స్ ఉన్నారు. మన ఇండియన్‌ నర్సుల సంఖ్య 32 వేల మంది. ఆ తర్వాత 24 వేల మందితో నైజీరియన్స్ ఉన్నారు. అయితే ఇలా వలసవచ్చిన నర్సులంతా కాలిఫోర్నియా, నెవడా, న్యూజెర్సీలో ఎక్కువగా పనిచేస్తున్నారు.

Also Read: ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడర్‌కు కట్టుబడి ఉన్నాం.. ప్రధాని మోదీతో జీ7 దేశాల ప్రతినిధులు

డాక్టర్స్, నర్సులు మాత్రమే కాదు.. యూఎస్‌ హెల్త్ సెక్టార్‌లో పనిచేస్తున్న వారిలో 18 శాతం అంటే 2 కోట్ల 70 లక్షల మంది వరకు వలసదారులో.. వీరిలో దాదాపు 2 లక్షల మంది మన ఇండియన్సే.. అయితే మనకంటే ముందు అంటే మూడున్నర లక్షల మందితో ఫిలిప్పీన్స్.. రెండు లక్షల 70 వేల మందితో మెక్సికో ముందున్నాయి. కానీ వీరంతా ఇతర డిపార్ట్‌మెంట్స్‌లో పనిచేస్తున్నారు. కానీ అత్యంత ముఖ్యమైన డాక్టర్స్‌ మాత్రం మన ఇండియన్స్ అనడంలో ఎలాంటి డౌట్‌ లేదు. నిజానికి అమెరికాను ట్రీట్‌ చేయడంలో మన ఇండియన్స్‌దే పైచేయి.

నిజానికి ఇంత మంది వలసదారులు సేవలందిస్తున్నా.. అమెరికాను ఇంకా డాక్టర్ల కొరత వేధిస్తుంది. అక్కడ ఒక ఫిజిషియన్ అపాయింట్‌మెంట్ దొరకాలంటే 20 రోజుల సమయం పడుతుందని తెలుస్తోంది. దీన్ని బట్టే అర్థమవుతుంది అక్కడి పరిస్థితి ఎలా ఉందో.. అయితే 2034 నాటికి ఏకంగా లక్షా 24 వేల మంది డాక్టర్ల కొరత ఏర్పడుతుందనేది ఓ అంచనా.. ఈ కొరత తీర్చేందుకు వారికి ఉన్న ఆప్షన్స్‌లో మెరుగైనది ఇండియా.. మరి అగ్రరాజ్యం అమెరికాకు ఇంత కష్టం ఎందుకు అని మీకు డౌట్ రావొచ్చు.

దీనికి ఆన్సర్ అమెరికాలో మెడిసిన్ చేయడం అంత ఈజీ కాదు.. మనలాగా అక్కడ ఇంటర్మిడియెట్ తర్వాతా మెడిసిన్ చేయలేరు. అక్కడ ముందుగా గ్రాడ్యుయేషన్ చేయాలి. ఆ తర్వాత నాలుగేళ్ల పాటు మెడిసిన్ చేయాలి. ఆ తర్వాత మరో మూడేళ్ల పాటు పీజీ.. మరో మూడేళ్ల పాటు సూపర్ స్పెషాలిటీ..
ఇంకో రెండేళ్లు ఫెలోషిప్.. అంటే డిగ్రీ తర్వాత 12 ఏళ్లపాటు చదువుతూ ప్రాక్టీస్‌ చేయాలి. అక్కడితో పోలిస్తే మన దగ్గర కొంచెం ఈజీనే.. అందుకే టాలెంట్ ఉన్న ఇండియన్ డాక్టర్స్‌కి అమెరికా బెస్ట్ డెస్టినేషన్ అంటారు ఎక్స్‌పర్ట్స్.

Tags

Related News

Conflict: మూడో ప్రపంచ యుద్ధం తప్పదా..?

Dominica Citizenship: ‘ఎవరైనా రావొచ్చు’.. తక్కువ ధరకే పౌరసత్వం విక్రయిస్తున్న దేశం ఇదే..

Elon Musk Brazil: బ్రెజిల్‌లో ట్విట్టర్ ఎక్స్ ఆగని కష్టాలు.. తప్పుడు బ్యాంకులో ఫైన్ చెల్లింపులు!

India’s Iron Dome: ఇండియాపై శత్రువులు మిసైల్ దాడి చేస్తే పరిస్థితి ఏంటి? ఇజ్రాయెల్ తరహా యాంటి మిసైల్ టెక్నాలజీ మన దగ్గర ఉందా?

Israel India Iran: ‘దాడి చేయవద్దని ఇండియా ద్వారా ఇరాన్‌కు ముందే హెచ్చరించాం’.. ఇజ్రాయెల్ అంబాసిడర్

Indonesia Pleasure Marriages: వ్యభిచారానికి మారుపేరుగా టెంపరరీ పెళ్లిళు.. ఇండోనేషియాలో కొత్త బిబినెస్

Israel-Iran Impact on India: ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంతో భారత్ కు నష్టాలు.. అంతర్జాతీయ వాణిజ్యంపై ప్రభావం

Big Stories

×