EPAPER
Kirrak Couples Episode 1

India Rebutes Pakistan: ‘కశ్మీర్ టెర్రరిజంపై మాకు నీతులా?’.. ఐరాస సమావేశాల్లో పాకిస్తాన్‌కు గట్టి కౌంటర్ ఇచ్చిన భారత్..

India Rebutes Pakistan: ‘కశ్మీర్ టెర్రరిజంపై మాకు నీతులా?’.. ఐరాస సమావేశాల్లో పాకిస్తాన్‌కు గట్టి కౌంటర్ ఇచ్చిన భారత్..

India Rebuttal To Pakistan| ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి 79 సమావేశాల్లో పాకిస్తాన్ ప్రధాన మంత్రి షహ్‌బాజ్ షరీఫ్ కశ్మీర్, టెర్రరిజంపై భారత్ పై విమర్శలు చేయడంతో ఇండియా ప్రతినిధి ఆయనకు గట్టి కౌంటర్ సమాధానం ఇచ్చారు. ఉగ్రవాదులకు, డ్రగ్స్ వ్యాపారానికి పేరుపొందిన పాకిస్తాన్ ఇండియాకు నీతులు బోధించడం కపటత్వమే అవుతుందని ఇండియా తరపున ఐక్యరాజ్యసమితి ఫస్ట్ సెక్రటరీ భావికా మంగళానందన్ అన్నారు.


ఐరాస సమావేశాల్లో భారత ప్రతినిధిగా ఫస్ట్ సెక్రటరీ భావికా మాట్లాడుతూ.. ”పాకిస్తాన్ మిలిటీర చెప్పుచేతల్లో అక్కడి ప్రభుత్వం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా జరిగిన చాలా ఉగ్రవాద దాడుల ఘటనల్లో పాకిస్తాన్ ప్రమేయం ఉంది. అంతేకాదు సరిహద్దుల్లో టెర్రరిస్టు చర్యలకు పాల్పడిన చరిత్ర పాకిస్తాన్ కు ఉంది. అలాంటి పాకిస్తాన్.. భారత్ పై విమర్శలు చేయడం చాలా రిడికులస్” అని భావికా అన్నారు.

”భారతదేశంలో పార్లమెంటు పై జరిగిన ఉగ్రవాదదాడి, ముంబైలో జరిగిన టెర్రరిజం ఘటన వెనుక పాకిస్తాన్ హస్తం ఉంది. ఇలాంటి చర్యలకు పాల్పిడితే భారత్ తప్పకుండా సమాధానం చెబుతుందని పాకిస్తాన్ అర్థం చేసుకోవాలి. పాకిస్తాన్ లో మైనారిటీలు వేధింపులకు గురవుతున్నారు. 1971లో అయితే పాకిస్తాన్ లో నరసంహారం జరిగింది. ఇలాంటి చరిత్ర కలిగిన పాకిస్తాన్.. జమ్మూ కశ్మీర్, టెర్రరిజంపై భారత్ కు నీతులు చెబుతోంది.” అని భావికా మంగళానందన్ ఐరాస సమావేశాల్లో చెప్పారు.


Also Read: రొటీన్ గా సూపర్ మార్కెట్ వెళ్లాడు.. అనుకోకుండా రూ.8 కోట్ల జాక్ పాట్ కొట్టాడు!

ఇంతకుముందు పాకిస్తాన్ ప్రధాన మంత్రి షష్‌బాజ్ షరీఫ్ ప్రసంగిస్తూ.. ”2019లో భారత ప్రభుత్వం జమ్మూ కశ్మీర్ కు స్పెషల్ స్టేటస్ తొలగించింది. అక్కడి ముస్లిం జనాభాను అణచివేస్తూ ఉంది. కశ్మీర్ లో భారతదేశం తన సైనికుల సంఖ్యను మరింతగా పెంచుతోంది. ఈ చర్యలు పాకిస్తాన్ కు వ్యతిరేకంగా జరుగుతున్నాయని భావిస్తున్నాను. కశ్మీర్ లో శాంతి, భద్రతా ఏర్పాట్లను కోరుకునే భారత్ ఇప్పుడు తన తీరు మార్చుకుంది. జమ్మూ కశ్మీర్ లో వెంటనే ఆర్టికల్ 370 ని తిరిగి అమలు పరచాలి. ముస్లింలపై జరుగుతున్న దాడులు ఆగిపోవాలి. భారత సైన్యం పాకిస్తాన్ కు వ్యతిరేకంగా వ్యవహరిస్తే దానికి పాకిస్తాన్ తప్పకుండా సమాధానం చెబుతుంది. ” అని కశ్మీర్ అంశంపై చెప్పారు.

ఆ తరువత పాక్ ప్రధాని గాజా, ఉక్రెయిన్, ఆఫికా దేశంలో జరిగే యుద్ధాల గురించి కూడా ప్రస్తావించారు. ఈ యుద్ధాల వల్ల ప్రపంచదేశాలన్నీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆయన అన్నారు.

Also Read: ‘ఇరాన్ లో ఏ మూలలోనైనా ఇజ్రాయెల్ దాడి చేయగలదు’.. ఐరాసలో నెతన్యాహు వార్నింగ్!

Related News

Hurricane Helene: అమెరికాలో హరికేన్ బీభత్సం.. 44 మంది మృతి

Trump Campaign Hacked: ట్రంప్ క్యాంపెయిన్‌ హ్యాక్ చేసిన ఇరాన్?.. అమెరికా కోర్టులో కేసు..

Myopia In Kids Globally: లాక్ డౌన్ తరువాత పిల్లల్లో కంటి సమస్యలు.. బిబిసి నివేదికలో వెల్లడి!

Netanyahu At UN: ‘ఇరాన్ లో ఏ మూలలోనైనా ఇజ్రాయెల్ దాడి చేయగలదు’.. ఐరాసలో నెతన్యాహు వార్నింగ్!

Frano Selak: ప్రపంచంలోనే అత్యంత అదృష్టవంతుడు.. 7 సార్లు మృత్యువు నుంచి తప్పించుకొని జాక్ పాట్ కొట్టాడు!

UNSC India: ‘ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఇండియాకు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలి’.. యుకె ప్రధాని

Big Stories

×