EPAPER

Citizenship Amendment Act : సీఏఏపై అమెరికా రియాక్షన్.. భారత్ అభ్యంతరం..

Citizenship Amendment Act :  సీఏఏపై అమెరికా రియాక్షన్.. భారత్ అభ్యంతరం..

Citizenship Amendment Act latest news


India Reacts Strongly To US Remarks To CAA(International news in telugu): భారత్ లో ఇటీవల పౌరసత్వ సవరణ చట్టం .. సీఏఏ అమల్లోకి వచ్చింది. ఈ చట్టంపై అగ్రరాజ్య అమెరికా స్పందించింది. ఈ చట్టం అమలవుతున్న విధానాన్ని సూక్ష్మంగా పరిశీలిస్తున్నామని యూఎస్ విదేశాంగ శాఖ పేర్కొంది. అదే సమయంలో సీఏఏపై ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి మథ్యూ మిల్లర్ ఆందోళన వ్యక్తమంటూ వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో మతాలన్నింటికీ స్వేచ్ఛ ఉంటుందని పేర్కొన్నారు.

సీఏఏ విషయంలో అమెరికా ప్రకటనపై భారత్ అభ్యంతరం తెలిపింది. ఇది తమ దేశ అంతర్గత వ్యవహారమని తేల్చి చెప్పింది. ఈ విషయంపై భారత్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రతినిధి రణ్ దీర్ జైశ్వాల్ కీలక ప్రకటన చేశారు.


పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్ఝానిస్థాన్ దేశాల్లో హింసకు గురైన వారికి ఈ చట్టం ద్వారా భారత పౌరసత్వం కల్పిస్తున్నామని తెలిపారు. ఆయా దేశాల నుంచి భారత్ కు వలస వచ్చిన హిందూ, సిక్కు, బౌద్ధ, జైన, క్రైస్తవ, పార్శీ మతాలకు చెందిన వారికి పౌరసత్వంతోపాటు భద్రత కల్పించడానికి సీఏఏ తీసుకొచ్చామని స్పష్టం చేశారు. సీఏఏ ఏ ఒక్క పౌరుడి హక్కులకు భంగం కలిగించదన్నారు.

Also Read : అణు యుద్ధానికి సిద్ధమంటున్న రష్యా.. సార్వభౌమాధికారానికి, స్వాతంత్య్రానికి ముప్పు తప్పదా ? 

సీఏఏ ఉద్దేశం పౌరసత్వం తీసేయడం కాదని రణ్ దీర్ జైస్వాల్ వివరణ ఇచ్చారు. అందరూ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని సూచించారు. ఏ దేశంలోనూ పౌరసత్వం లేని వారికి రక్షణ కల్పిస్తుందన్నారు. మానవ హక్కులను కాపాడటానికే సీఏఏ ఉపయోగపడుతుందన్నారు.

Tags

Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Big Stories

×