EPAPER

India-Canada diplomatic row: భారత్-కెనడా మధ్య దౌత్య వివాదం, వీసాల జారీ, విద్యార్థులకు ఇబ్బందులు తప్పవా?

India-Canada diplomatic row: భారత్-కెనడా మధ్య దౌత్య వివాదం, వీసాల జారీ, విద్యార్థులకు ఇబ్బందులు తప్పవా?

India-Canada:  గత కొంతకాలంగా భారత్-కెనడా నడుమ కొనసాగుతున్న దౌత్య వివాదం తీవ్ర స్థాయికి చేరింది. ఖలిస్తానీ వేర్పాటు వాది హరిదీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత పరిస్థితి మరింత ఉద్రితంగా మారింది. ఈ హత్య కేసుతో సంబంధం ఉన్న నిందితుల లిస్టులో ఏకంగా భారత హైకమిషర్ సంజయ్ కుమార్ వర్మ పేరును చేర్చడం సంచలనం కలిగించింది. గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ బ్యాచ్ తో కలిసి భారత ఏజెంట్లు కెనడాలో ఉగ్రవాదాన్ని పెంచి పోషించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ కెనడా భారత్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికే భారత్ లోని తమ దౌత్యవేత్తలను మూడింట రెండు వంతుల మందిని వెనక్కి పిలిపించుకుంది. మరోవైపు ఆరుగురు భారతీయ దౌత్యవేత్తలను తమ దేశం విడిచి వెళ్లిపోవాల్సింది ఆదేశించింది. అటు వెంటనే వెనక్కి వచ్చేయాలని దౌత్య అధికారులకు భారత్ సూచించింది. కెనడా తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత్ ప్రతిష్టను దిగజార్చేలా అసత్య ప్రచారాలు చేస్తుందంటూ మండిపడింది. నిజ్జర్ హత్యతో భారత్ కు సంబంధాలు ఉన్నాయని ఆధారాలు చూపించకుండా అసత్య ఆరోపణలు చేస్తుందని ఫైర్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య దౌత్య యుద్ధం మొదలయ్యింది.


వీసాల జారీపై కెనడా-భారత్ వివాద ప్రభావం

భారత్, కెనడా నడుమ దౌత్య వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో వీసాల జారీతో పాటు ఇండియన్ స్టూడెంట్స్ మీద ప్రభావం పడే అవకాశం ఉంది. కెనడా ఇప్పటికే ఓకే చేసిన వీసాల సంఖ్యను తగ్గించే అవకాశం ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. అటు భారత్ గురించి కెనడా ప్రధాని నెగెటివ్ ప్రచారం మొదలుపెట్టిన నేపథ్యంలో కెనడాలోని భారత ఎంబసీ, కాన్సులేట్స్‌ లో స్థానిక సిబ్బందిని చాలా వరకు తగ్గించింది. అంతేకాదు, ఏకంగా నెల రోజుల పాటు కెనడా పౌరులకు వీసాల జారీని నిలిపేసింది. ఈ నేపథ్యంలో కెనడా పౌరులు భారత్ కు పర్యటనలు రద్దు చేసుకోవాల్సి వచ్చింది. భారత్ లోని తమ కుటుంబాలను కలిసేందుకు కెనడా పౌరసత్వం తీసుకున్న ఫ్యామిలీలు చాలా ఇబ్బందులు పడ్డాయి. అయితే, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డుతో పాటు భారత్ కు వెళ్లేందుకు చెల్లుబాటు అయ్యే వీసా ఉన్న కెనడియన్లకు ఎలాంటి ఇబ్బంది కలుగలేదు. నవంబర్ 2023 నుంచి నెమ్మదిగా వీసా సేవలు భారత్ పునరుద్దరించింది.


అటు కెనడా సైతం భారత్ లోని బెంగళూరు, చండీగఢ్, ముంబైలోని వీసా సేవలను టెంపరరీగా నిలిపివేసింది. కరోనా తర్వాత భారత్- కెనడా డైరెక్ట్ ఎయిర్ కనెక్టివిటీ కూడా మొదలుకాలేదు. అయితే, శాశ్వత నివాసం, వర్క్ పర్మిట్లు, స్టడీ వీసాలతో వేల సంఖ్యలో భారతీయులు కెనడాకు వెళ్తుంటారు. ఈ ఏడాది స్టార్టింగ్ లో కెనడా స్టూడెంట్ వీసాల సంఖ్యను రెండేళ్ల కాలానికి 3 లక్షల 60 వేలకు పరిమితం చేసింది. 2022తో పోల్చితే 35 శాతానికి తగ్గించింది. కెనడాలో ఉన్న విదేశీ విద్యార్థుల్లో ఏకంగా 41 శాతానికి పైగా విద్యార్థులు భారతీయులే ఉన్నారు. ప్రస్తుతం ఇరు దేశాల నడుమ కొనసాగుతున్న దౌత్య వివాదం నేపథ్యంలో విద్యార్థులతో పాటు వీసాల సమస్య ఏర్పడే అవకాశం ఉంది.

Read Also: ఆ గ్యాంగ్ స్టర్ తో ఇండియన్ ఏజెంట్లకు సంబంధాలు, భారత్ పై కెనడా చిల్లర ఆరోపణలు!

Related News

Kim Jong Un: కిమ్ మామా మజాకా.. కోపంతో సౌత్ కొరియా రోడ్లు పేల్చివేత!

S JAI SHANKER : ఎస్‌సీఓ సదస్సు కోసం పాక్ చేరిన జై శంకర్‌.. ప్రధాని షరీఫ్‌తో కరచాలనం

Air India Flight : గాల్లో ఉండగానే దిల్లీ చికాగో విమానానికి బాంబు బెదిరింపు.. ఆ తర్వాత ఏం జరిగిదంటే ?

Lawrence Bishnoi: ఆ గ్యాంగ్ స్టర్ తో ఇండియన్ ఏజెంట్లకు సంబంధాలు, భారత్ పై కెనడా చిల్లర ఆరోపణలు!

India canada diplomatic row: నిజ్జర్ హత్య కేసు చిచ్చు.. ఆరుగురు కెనడా దౌత్య వేత్తలను బహిష్కరించిన భారత్

UN Peacekeepers Netanyahu: ‘అడ్డుతొలగండి.. లేకపోతే మీకే నష్టం’.. లెబనాన్‌ ఐరాస కార్యకర్తలను హెచ్చరించిన నెతన్యాహు

Big Stories

×