EPAPER
Kirrak Couples Episode 1

Hurricane Helene: అమెరికాలో హరికేన్ బీభత్సం.. 44 మంది మృతి

Hurricane Helene: అమెరికాలో హరికేన్ బీభత్సం.. 44 మంది మృతి

Helene causes destruction and flooding in america: అమెరికాను హరికేన్ బీభత్సం వణికిస్తుంది. ఫ్లోరిడాలో హెలెనా హరికేన్ బీభత్సం సృష్టించడంతతో భారీగా వర్షాలు కురిశాయి. ఈ వర్షాలకు వరదలు పోటెత్తాయి. దీంతో 44 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. జార్జియా, నార్త్ కరోలినా, సౌత్ కరోలినా, వర్జీనియాలోనూ హరికేన్ ఎఫెక్ట్ ఉన్నట్లు తెలిపారు. దీని ప్రభావంతో 20 మిలియన్ డాలర్లకుపైగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.


ఫ్లోరిడా సహా జార్జియా, నార్త్ కరోలినా, వర్జీనియా, దక్షిణ కరోలినాలో గంటకు 225 కిలోమీటర్లకు పైగా వేగంతో కూడిన గాలులు వీస్తున్నాయి. ఫ్లోరిడా లోని బిగ్‌బెండ్ ప్రాంతంలో ఈ హెలీన్ హరికేన్ రాత్రి తీరం దాటింది. తీరం దాటే సమయంలో గంటకు140 కిలోమీటర్ల వేగంత గాలులు వీయడంతో బిగ్ బెండ్‌ ప్రాంతంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. హెలీన్ కేటగిరీ 4 హరికేన్ కాగా గతేడాది కూడా బిగ్ బెండ్ దగ్గర కేటగిరీ 3 స్టార్మ్ ఇదాలియా తీరం దాటింది.

జార్జియాలో, గవర్నర్ బ్రియాన్ కెంప్ ప్రాంతాల్లో చాలా భవనాలు కూలిపోయాయి. ఈ భవనాల శిథిలావస్థలో చాలామంది చిక్కుకున్నారని అధికారులు చెబుతున్నారు. అయితే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోని ఆసుపత్రులకు కరెంట్ సరఫరా నిలిచిపోయింది.


Also Read: ట్రంప్ క్యాంపెయిన్‌ హ్యాక్ చేసిన ఇరాన్?.. అమెరికా కోర్టులో కేసు..

ప్రస్తుతం రక్షక బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. రోడ్లను క్లియర్ చేస్తున్నారు. యునికోయ్ కౌంటీ హాస్పిటల్ పైకప్పు నుంచి 54 మందిని తరలించారు. నార్త్ కరోలినా కూడా తీవ్రమైన వరదలను ఎదుర్కొంది, ఆనకట్ట సమీపంలోని ప్రాంతాల నుంచి స్థానికులను బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారు.

Related News

Hezbollah Chief Killed: హెజ్బొల్లాకు భారీ షాక్.. చీఫ్ హసన్ నస్రల్లా మృతి

NASA Will Launch Crew-9 Today: ఈ మిషన్ సక్సెస్ అయితే చాలు.. సునీతా విలియమ్స్ భూమి మీదికి వచ్చినట్లే..

Trump Campaign Hacked: ట్రంప్ క్యాంపెయిన్‌ హ్యాక్ చేసిన ఇరాన్?.. అమెరికా కోర్టులో కేసు..

India Rebutes Pakistan: ‘కశ్మీర్ టెర్రరిజంపై మాకు నీతులా?’.. ఐరాస సమావేశాల్లో పాకిస్తాన్‌కు గట్టి కౌంటర్ ఇచ్చిన భారత్..

Myopia In Kids Globally: లాక్ డౌన్ తరువాత పిల్లల్లో కంటి సమస్యలు.. బిబిసి నివేదికలో వెల్లడి!

Netanyahu At UN: ‘ఇరాన్ లో ఏ మూలలోనైనా ఇజ్రాయెల్ దాడి చేయగలదు’.. ఐరాసలో నెతన్యాహు వార్నింగ్!

Big Stories

×