EPAPER

Canada: కెనడాలో భారతీయ విద్యార్థుల నిరసన, కారణమిదే !

Canada: కెనడాలో భారతీయ విద్యార్థుల నిరసన, కారణమిదే !

Indian Students On Canada Immigration Rules: కెనడాలోని ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐస్ లాండ్ ప్రావిన్స్ ఇమిగ్రేషన్ నిబంధనలు మార్చడంతో భారతీయ విద్యార్థులు నిరసన చేపట్టారు. కొత్త నిబంధనలతో తాము దేశ బహిష్కరణను ఎదర్కుంటున్నామని వాపోతున్నారు. భారతీయ విద్యార్థులు చేస్తున్న నిరసన కార్యక్రమాలు రెండవ వారానికి చేరాయి. తమ నిరసనలు కొనసాగిస్తామని విద్యార్థులు తెలిపారు.


అయితే ఈ విషయంపై భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణ్ ధీర్ జైశ్వాల్ స్పందించారు. భారత్ నుంచి పెద్ద  సంఖ్యలో విద్యార్థులు చదువుకోవడానికి కెనడా వెళుతున్నారు. విద్యార్థులు దేశ బహిష్కరణ పరిస్థితులు ఎదుర్కుంటున్నట్లు తమ దృష్టికి రాలేదని తెలిపారు. అయితే అక్కడ విద్యార్థులకు సంబంధించి వారు సమస్యలు ఎదుర్కుంటున్నట్లు కనిపించడం లేదన్నారు.

తమ హక్కుల కోసం చేస్తన్న పోరాటం రెండో వారానికి చేరిందని భారతీయ విద్యార్థులు తెలిపారు. ధైర్యంగా పోరాడుతున్నాం.. నిరసనలు కొనసాగిస్తామని ఎక్స్ లో పేర్కొన్నారు. అయితే ఇటీవల కెనడాలోని ఎడ్వర్డ్ ఐస్ లాండ్ వలస దారులను తగ్గించుకోవడం కోసం ఇమిగ్రేషన్ నిబంధనలను మార్పు చేసింది.


Also Read: అంతరిక్షయానం చేసిన తొలి తెలుగు వ్యక్తి.. ఈయనే

భారీగా వివిధ దేశాల నుంచి వలస దారులు రావడంతో హెల్త్ కేర్, నివాస సదుపాయాలపై ప్రభావం పడుతోందని అక్కడి అధికారులు వెల్లడించారు. ఒక్కసారిగా ఇమిగ్రేషన్ నిబంధనలు మార్చడంతో వర్క్ పర్మిట్లు రద్దై తాము బహిష్కరణను ఎదుర్కోవలసి వస్తోందని భారతీయ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Image

 

Tags

Related News

Israel kills Hamas chief: హమాస్‌ అధినేత యాహ్య సిన్వార్ మృతి.. ధృవీకరించిన ఇజ్రాయెల్

Israel-Gaza War: శవాలను పీక్కుతింటున్న కుక్కలు.. గాజాలో దారుణ పరిస్థితులు, ఫొటోలు వైరల్

Oswal Daughter Uganda: ’90 గంటలు బాత్ రూమ్ లో బంధించారు’.. ఉగాండాలో భారత బిలియనీర్ కూతురు ‘కిడ్నాప్’

Justin Trudeau Nijjar Killing: ఇండియాకు వ్యతిరేకంగా ఆధారాలు లేవు కానీ హత్య వెనుక కుట్ర.. : కెనెడా ప్రధాని వ్యాఖ్యలు

Lawrence Bishnoi: భారత్-కెనడా దౌత్య యుద్ధంలో ‘లారెన్స్ బిష్ణోయ్’, ఇంతకీ ఈ గ్యాంగ్‌స్టర్ బ్యాగ్రౌండ్ ఏంటి?

S Jai Shanker : పాకిస్థాన్‌లో అడుగుపెట్టి.. వారికే చురకలంటించిన భారత విదేశాంగ మంత్రి జైశంకర్.. చైనాకూ మొట్టికాయలు

Fighter jets Escort Air India: ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు.. సింగపూర్ ఎయిర్ పోర్ట్ లో హై టెన్షన్

Big Stories

×