EPAPER

Democracy: మార్షల్ లా, డెమొక్రటిక్ లా మధ్య తేడా ఇదే.. బంగ్లా, పాక్‌లోనే అలా ఎందుకు జరుగుతుంది?

Democracy: మార్షల్ లా, డెమొక్రటిక్ లా మధ్య తేడా ఇదే.. బంగ్లా, పాక్‌లోనే అలా ఎందుకు జరుగుతుంది?

Democracy and Constitution: బంగ్లాదేశ్ ఇప్పుడు సైన్యం చేతుల్లో ఉంది. అయితే అది వారికి కొత్తేమీ కాదు. ఇదే చివరిసారి అనుకున్నా పొరపాటే. ఎందుకంటే.. అక్కడి ప్రజాస్వామ్యం అలాంటిది. తుమ్మితే ఊడిపోయే ముక్కులా అక్కడి ప్రభుత్వాలు ఉంటాయి. ఇటీవల బంగ్లాదేశ్‌లో చోటుచేసుకున్న పరిణామాలతో మీకు ఇప్పటికే ఆ క్లారిటీ వచ్చి ఉంటుంది. నాలుగుసార్లు వరుసగా ప్రైమ్ మినిస్టర్ గా ఎన్నికైన షేక్ హసీనాని 45 నిమిషాల్లో రాజీనామా చేయాలని ఆర్డర్ పాస్ చేశాడు బంగ్లాదేశ్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ వకార్‌ ఉజ్‌ జమాన్. ఆ ఆదేశాలకు హసీనా తలొంచక తప్పలేదు. ఫోర్ టైమ్స్ కంటిన్యూస్ గా, టోటల్ గా ఫైవ్ టైమ్స్ ప్రైమ్ మినిస్టర్ గా సేవలందించిన ఆమె కనీసం 4 నిమిషాలు కూడా ఆలోచించలేదు. రాజీనామా చేసి, ఢిల్లీ ఫ్లైటెక్కి ప్రాణాలు కాపాడుకుంది. విచిత్రం ఏంటంటే ఆర్మీ చీఫ్ వకార్.. ఈ ఏడాది జూన్ 23న ఆ పోస్ట్ లోకొచ్చారు. అంటే ఆయన ఎక్స్ పీరియన్స్ కేవలం నెలన్నర రోజులు మాత్రమే. కానీ 20 ఏళ్లు ప్రైమ్ మినిస్టర్ గా చేసిన హసీనాను ఆయన గడగడలాడించారు. విదేశాలకు పారిపోయేలా చేశారు. ప్రస్తుతం ఆర్మీ ప్రమేయం లేని తాత్కాలిక ప్రభుత్వం బంగ్లాదేశ్ లో ఏర్పాటవుతోంది.


ఇక్కడ మనకో విషయంలో క్లారిటీ వచ్చింది. బంగ్లాదేశ్ లో ప్రధాని కంటే ఆర్మీ చీఫ్ మోస్ట్ పవర్ ఫుల్ అని. కానీ అక్కడ పాలన అంతా ప్రధాని పేరుమీదే జరుగుతుంది. 1971లో బంగ్లాదేశ్ కి ఇండిపెండెన్స్ వచ్చింది. జస్ట్ నాలుగేళ్లలోనే, అంటే 1975లోనే అక్కడి సైన్యం తిరుగుబాటు చేసి ప్రధాని ముజిబుర్ రెహ్మాన్ ని దింపేసింది. దింపేయడం కాదు ఏకంగా ఆ కుటుంబాన్ని సైన్యం చంపేసింది. ఆ తర్వాత 1982లో మళ్లీ సైన్యం తిరుగుబాటు చేసింది. ఇప్పటి వరకు టోటల్ గా 29 సార్లు అక్కడ సైన్యం తిరుగుబాటుకి ట్రై చేసింది. మూడుసార్లు సక్సెస్ అయింది.

పాకిస్తాన్‌లోనూ అంతే..


పాకిస్తాన్ లో మరీ ఘోరం. ఆ దేశానికి ఇండియాతో పాటే 1947లో స్వాతంత్ర్యం వచ్చింది. 1953 నుంచే అక్కడ అంతర్యుద్ధం మొదలైంది. ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు ప్రధాన మంత్రుల్ని తొలగించారు అప్పటి అధ్యక్షుడు ఇస్కందర్ మీర్జా. అప్పట్లో మన ప్రధాని నెహ్రూ కూడా పాకిస్తాన్ పాలనపై ఓ జోక్ చేశారట. “పాకిస్తాన్‌లో ప్రధాన మంత్రులు మారినంత స్పీడ్ గా, నేను నా పంచెలు కూడా మార్చుకోలేనేమో” అన్నారట నెహ్రూ. అలా ప్రధాన మంత్రుల్ని మార్చేసిన తొలి అధ్యక్షుడు ఇస్కందర్ మీర్జా.. తర్వాత అసెంబ్లీని రద్దు చేసి 1958లో సైనిక పాలనకు లైన్ క్లియర్ చేశాడు. ఆర్మీ చీఫ్ అయూబ్ ఖాన్ ని “చీఫ్ మార్షల్ లా అడ్మినిస్ట్రేటర్” గా నియమించాడు. ఇస్కందర్ మీర్జా దయతో పాకిస్తాన్ చీఫ్ అయిన అయూబ్ ఖాన్ చివరకు ఆయన్నే దేశం నుంచి గెంటేశాడు. అలా ఉంటాయి పాకిస్తాన్ రాజకీయాలు. ఆ తర్వాత మరో రెండుసార్లు పాకిస్తాన్ లో లాంగ్ టర్మ్ ఆర్మీ రూల్ సాగింది. పాకిస్తాన్ లో సైన్యం ఒక్కసారి రంగంలోకి దిగిందంటే పదేళ్లపాటు దేశంలో ఎన్నికలు జరిగే ఛాన్సే లేదు. అలా మూడు దశాబ్దాల పాటు పాక్ ప్రజలు సైన్యం పాలనలో కష్టాలు పడ్డారు. మరో ఐదుసార్లు సైన్యం ప్రభుత్వాన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేసి ఫెయిలైంది.

Also Read: బంగ్లాదేశ్‌లో ఉద్దేశపూర్యకంగానే హిందువులను టార్గెట్ చేస్తున్నారు: రిపబ్లకన్ వివేక రామస్వామి

అదొక డెత్ గేమ్..

సైనిక పాలనపై పాకిస్తాన్ లో ఆర్మీచీఫ్ మనసుపడ్డారంటే డెత్ గేమ్ మొదలు పెట్టినట్టే లెక్క. అధ్యక్షుడయినా అక్కడ పారిపోవాలి, లేదా ఆర్మీచీఫ్ జీవితమైనా అక్కడితో ముగిసిపోవాలి. గతంలో ఎగ్జాంపుల్స్ అన్నీ ఇవే. 1999లో పర్వేజ్ ముష్రాఫ్ పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ని అరెస్ట్ చేసి, ప్రభుత్వాన్ని రద్దు చేసి, సైనిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత తనకు తానే రాజ్యాంగాన్ని సవరించుకుని అధ్యక్షుడైపోయాడు. ఆయన నియంతృత్వాన్ని భరించలేక అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు. ఓడిపోతాననే భయంతో ముష్రాఫ్ లండన్ పారిపోయాడు. చివరికి అతని జీవితం విదేశాల్లోనే ఎండ్ అయిపోయింది. పాకిస్తాన్ కి వచ్చే వీలు లేక, ఆరోగ్యం పాడైపోయి దుబాయ్ లో చనిపోయాడు ముష్రాఫ్.

లిస్టు పెద్దదేనండోయ్..

బంగ్లాదేశ్, పాకిస్తాన్.. ఇవే కాదు మార్షల్ లా తో ఇబ్బంది పడిన, పడుతున్న దేశాల లిస్ట్ చాలా పెద్దది. మయన్మార్, ఫిలిప్పీన్స్, దక్షిణ కొరియా, ఇజ్రాయెల్, ఈజిప్ట్.. ఇలా చాలా దేశాల్లో అప్పుడప్పుడు మార్షల్ లా అమలయ్యేది. మయన్మార్ పరిస్థితి మరీ ఘోరం. మూడేళ్ల క్రితం అక్కడి ఆంగ్ సాన్ సూకీ ప్రభుత్వాన్ని సైన్యం రద్దు చేసింది. ఆ తర్వాత జనరల్ ఎలక్షన్స్ జరిగినా కూడా ప్రభుత్వం ఏర్పాటు కాకుండా సైన్యం అడ్డుకుంది. ఈలోగా తిరుగుబాటుదారులు కొన్ని ప్రాంతాలను ఆక్రమించారు. అటు ప్రభుత్వం లేక, ఇటు సైన్యం పాలనలోకి రాక.. ఆ ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఇండియాలో అలా కాదు, ఎందుకంటే..

ఇండియాలో ఇప్పటి వరకు సైనిక పాలన జరగలేదు, జరిగే అవకాశం కూడా లేదని పొలిటికల్ అనలిస్ట్ ల అభిప్రాయం. ఎందుకంటే మన రాజ్యాంగం అంత స్ట్రాంగ్ గా ఉంది. ప్యూర్ డెమెక్రటిక్ కంట్రీగా భారత్ కి పేరు రావడానికి మన కాన్ స్టిట్యూషనే ప్రధాన కారణం. అయితే ఇందిరాగాంధీ హయాంలో మన దేశంలో ఎమర్జెన్సీ పేరుతో కాస్త గందరగోళం జరిగింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆమె ఓడిపోవడంతో ప్రజాస్వామ్యం మళ్లీ నిలబడింది. భారత్ కు స్వాతంత్రం ప్రకటించే సమయంలో దేశంలో మొదటి తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ జవహర్‌లాల్ నెహ్రూ.. భారత సైన్యం ప్రభుత్వం అదుపులో ఉండాలని గట్టిగా చెప్పారు. ఒక టైమ్ లో అప్పటి ఆర్మీ జనరల్ కరియప్ప ప్రభుత్వ ఆర్థిక విధానాలను విమర్శించారు. వెంటనే ఆయనకు నెహ్రూ వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని లేఖ రాశారు, డైరెక్ట్ గా పిలిచి మందలించారు. అక్కడితో ఆ ఇష్యూ క్లోజ్ అయింది.

ఆ తర్వాత ఇండియన్ ఆర్మీని మోడ్రనైజ్ చేశారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ప్రతి డిపార్టమెంట్ కి విడివిడిగా చీఫ్‌ లను నియమించారు. ఈ ముగ్గురు కూడా రక్షణ మంత్రి అధీనంలో ఉండాలి. అంటే భారత్ లో సైన్యానికి రక్షణ మంత్రి చీఫ్. ఆయన ప్రధానికి ఆదేశాలు పాటిస్తారు. ఇక భారత సర్వ సైన్యాధిపతి రాష్ట్రపతి. అంటే ఇక్కడ భారత సైనిక వ్యవహారాలను, వారి అధినేతల్ని.. రక్షణ మంత్రి, ప్రధాని, రాష్ట్రపతి కంట్రోల్ చేస్తుంటారు. టోటల్ గా ఇక్కడ ప్రభుత్వమే సుప్రీం అన్నమాట. 2020లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనే కొత్త పోస్ట్ కూడా క్రియేట్ చేశారు. అయితే ఆయనకు కూడా సైన్యంపై టోటల్ కమాండ్ ఉండదు.

ఇండియాలో మొత్తం 7 సైనిక కమాండ్‌లు ఉంటాయి. వాటికి ఏడుగురు కమాండర్లు ఉంటారు. ఆర్మీ చీఫ్ ఒకేసారి ఈ 7 కమాండ్‌లకు ఆదేశాలు ఇవ్వలేడు. ఇచ్చినా అది నియమాలకు విరుద్ధం. ఆయన ఒకేసారి ఇచ్చిన ఆదేశాలను ఏడుగురూ కమాండర్లు పాటించరు. వాస్తవానికి ఏ దేశంలోనైనా రాజకీయంగా డిస్ట్రబెన్స్ ఉంటే సైన్యం యాక్టివ్ అవుతుంది, తిరుగుబాటు చేస్తుంది. కానీ భారత్ లో సైన్యానికి ఆ అవకాశం లేదు. ఎమర్జెన్సీ టైమ్ లో కూడా భారత డిఫెన్స్ బలగాలు రాజకీయాలకు దూరంగా ఉన్నాయి. బ్రిటన్ పాలన నుంచి కూడా ఇదే రూల్స్ సైన్యం పాటిస్తోంది. అప్పట్లో సైన్యం బ్రిటన్ తరపున ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్ లో ఫైట్ చేసింది. భారత్ సైన్యంలో బీఎస్ఎఫ్, ఐటీబీపీ, అస్సాం రైఫిల్స్.. వంటి వేర్వేరు రెజిమెంట్లు ఉన్నా కూడా అన్నీ ప్రభుత్వానికి లోబడే ఉంటాయి. సో.. మన దేశంలో సైనిక తిరుగుబాటు అనేది అసాధ్యం అనే చెప్పాలి.

Also Read: ‘అమెరికాకు రావొద్దు.. గ్రీన్ కార్డ్ కోసం 100 ఏళ్లు వెయిట్ చేయాలి’.. ఇండియన్ టెకీ హెచ్చరిక!

ప్రజాస్వామ్యం అంటే మనల్ని మనమే పరిపాలించుకోవడం, అంటే ప్రభుత్వంలో ఎవరు ఉండాలి, ఏ పార్టీ అధికారంలో ఉండాలనేది నిర్ణయించేది మనమే. కానీ మార్షల్ లా అలా కాదు. మనల్ని ఎవరు రూల్ చేయాలనేది మన చేతుల్లో ఉండదు. మన రాజ్యాంగం బలంగా ఉంది కాబట్టే మార్షల్ లాకి భారత్ లో ఛాన్సే లేదు. అయితే భారత రాజ్యాంగంలోని 34వ ఆర్టికల్ లో మార్షల్ లా డిస్కషన్ ఉంది. అసాధారణ పరిస్థితులు ఏర్పడినప్పుడు మార్షల్ లా ప్రకటించవచ్చు అని మాత్రమే అందులో ఉంది. దానికి నిర్వచనం కూడా ఇవ్వలేదు. అంటే భారత్ లో మార్షల్ లా కు మన రాజ్యాంగ నిర్మాతలు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదని అర్థమవుతుంది. ఇంకా చెప్పాలంటే సైన్యంలోని ఉద్యోగులకు ప్రాథమిక హక్కులు పరిమితంగానే ఉంటాయి. వారు ట్రేడ్ యూనియన్స్ లో చేరకూడదు, పత్రికలతో సంబంధాలు పెట్టుకో కూడదు, ర్యాలీలు, సభల్లో పాల్గొన కూడదు.. అంటే ఎక్కడా వారి ఆధిపత్యం లేకుండా ముందుగానే కంట్రోల్ లో పెట్టారు. సో.. మార్షల్ లా అనే దాని గురించి భారత రాజ్యాంగంలో ప్రస్తావన ఉన్నా కూడా దాన్ని అమలు చేయడం అసాధ్యం అన్నమాట.

ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పుకోవాలి. భారత్ లో ఏ ప్రభుత్వం నచ్చకపోయినా ఎన్నికల్లో ప్రజల తిరుగుబాటు స్పష్టంగా కనపడుతుంది. నియంతగా మారాలనుకునే ఏ నాయకుడిని కూడా ప్రజలు రెండోసారి గెలిపించలేదు. సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడినా కూడా ప్రజాస్వామ్యానికి బలమైన పునాదులు ఉండటం వల్ల ప్రభుత్వాలే ఇప్పటి వరకు అధికారంలో ఉన్నాయి. రాష్ట్రపతి పాలన ఉన్నా కూడా ఎన్నికలు తప్పనిసరి కాబట్టి ఎప్పటికీ ప్రభుత్వాలదే ఇక్కడ అధికారం. భారత్ లో జ్యుడీషియల్ వ్యవస్థ కూడా బాగా స్ట్రాంగ్. ఎవర్ని పడితే వారిని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ప్రకటించే అధికారం ప్రైమ్ మినిస్టర్ కి కూడా లేదు. అది కొలీజియం నిర్ణయం. భారత్ లో అంతర్గత సమస్యలున్నా, ప్రజాస్వామ్యం కష్టాల్లో ఉన్నా వెంటనే జ్యుడీషియల్ పవర్ దాన్ని కంట్రోల్ లోకి తెస్తుంది.

బంగ్లాదేశ్‌లో పరిస్థితులపై జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లా కాస్త సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. బంగ్లా పరిస్థితులు ఆ దేశ నియంతకు ఓ హెచ్చరిక అని ఆయన అన్నారు. జమ్మూ కాశ్మీర్ స్వయంప్రతిపత్తిని రద్దు చేసిన విషయాన్ని ఆయన పరోక్షంగా చెప్పాలనుకున్నారు. బంగ్లాదేశ్ పరిణామాలు ఆ దేశానికే కాకుండా, ప్రతి నియంతకు ఒక హెచ్చరిక సందేశం అని చెప్పారు ఫరూక్ అబ్దుల్లా. అంటే నియంతలా వ్యవహరించి ఇష్టం వచ్చినట్టు రూల్ చేస్తామంటే భారత ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఎన్నికల్లో కచ్చితంగా తమ రివేంజ్ తీర్చుకుంటారు. తమకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. ఆ ఎన్నికల ప్రక్రియను అందరూ గౌరవిస్తారు కాబట్టి భారత్ లో ఎలాంటి నియంత పాలనకు, సైనిక పాలనకు అవకాశమే లేదు.

Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Big Stories

×