EPAPER

Red Sea: హౌతీల దాడి.. ఎర్రసముద్రంలో నౌకను వదిలి వెళ్లిన సిబ్బంది..

Red Sea: హౌతీల దాడి.. ఎర్రసముద్రంలో నౌకను వదిలి వెళ్లిన సిబ్బంది..

Houthi attack on a ship in the Red Sea: ఎర్ర సముద్రంలో అలజడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. యెమెన్‌లోని హూతీ (Houthis) తిరుగుబాటుదారులు నౌకలను లక్ష్యంగా చేసుకుంటూనే ఉన్నారు. తాజాగా హౌతీలు ఓ భారీ నౌకపై దాడి చేశారు. దీంతో అందులో ఉన్న సిబ్బంది దాన్ని అక్కడే వదిలి పెట్టవలసి వచ్చిందని అధికారులు తెలిపారు.


మరో ఓడ గల్ప్ ఆప్ అడెన్ లో రెండు సార్లు దాడికి గురైంది. ఇరాన్-మద్దతు గల హౌతీలు కూడా తాము ఒ అమెరికన్ ఎంక్యూ-9 రీపర్ డ్రోన్ ను కల్చివేసినట్లు పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో అమెరికా దళాలు వెంనే అంగీకరించలేదు. అయితే హౌతీలు ఇంతకు ముందు యూఎస్ డ్రోన్ లను కూల్చివేశారు.

ఆదివారం సాయంత్రం బెలిజ్ జెండా ఉన్న రూబీమార్‌ నౌకపై హూతీలు రెండు బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేశారని అమెరికా సెంట్రల్ కమాండ్ ఎక్స్‌ వేదికగా వెల్లడించింది. దీంతో అందులోని సిబ్బంది నుంచి వచ్చిన ప్రమాద హెచ్చరికలకు ఒక యుద్ధనౌక, మరొక వ్యాపార నౌక స్పందించాయని పేర్కొన్నది. రూబీమార్ సిబ్బందిని వెంటనే స్థానిక ఓడరేవుకు తీసుకెళ్లినట్లు వెల్లడించింది. రూబీమార్ ఒక చిన్న రవాణా నౌక. దీని రిజిస్ట్రేషన్ ఇంగ్లాండ్‌లో నమోదై ఉంది.


Read More: అమెరికాలో మరో కొత్త వైరస్ కలకలం.. మనుషులకు సోకే చాన్స్..

మరోవైపు ఆదివారం నాటి తమ దాడిలో ఇంగ్లాండ్‌కు చెందిన నౌక పూర్తిగా మునిగి పోయిందని హూతీ అధికార ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు. అయితే ఎంత వరకు వాస్తవం ఉందనే అధికారిక ధ్రువీకరణ మాత్రం వెలువడలేదు. అమెరికా సెంట్రల్‌ కమాండ్ ప్రకటనలో దీనికి సంబందించిన ప్రస్తావన మాత్రం రాలేదు. తాజా దాడుల నేపథ్యంలో ఐరోపా సమాఖ్య తమ నౌకల రక్షణ కోసం ఓ నేవీ ఆపరేషన్‌ను చేపట్టాయి. దీనికి గ్రీస్‌ నేతృత్వం వహిస్తోంది.

2023 నవంబర్‌ నుంచి హూతీలు ఎర్ర సముద్రంలో (Red Sea) నౌకలపై దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. గాజాపై ఇజ్రాయెల్‌ సైనిక చర్యలకు ప్రతీకారంగానే ఇవి చేపడుతున్నామని హౌతీలు చెబుతున్నారు. వాటిని నిలిపివేసే వరకు ఈ దాడులు కొనసాగుతాయని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్యంలో 12 శాతానికి సమానమైన 30 శాతం కంటెయినర్‌ నౌకల రవాణా ఎర్ర సముద్రం మీదుగా జరుగుతోంది. వరుస దాడుల నేపథ్యంలో కొన్ని మార్గం మార్చుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

Tags

Related News

Crime: స్కూల్ బాత్రూంలో కాల్పులు.. బాలుడు మృతి

Russia president Putin: కమలా హ్యారిస్ కు జై కొట్టిన రష్యా అధ్యక్షుడు పుతిన్

USA Gun Fire: తండ్రి గిఫ్ట్‌గా ఇచ్చిన గన్‌తోనే స్కూల్‌లో అరాచకం.. ఐదుగురిని కాల్చి చంపిన ఆ నిందితుడి వయస్సు 14 ఏళ్లే!

PM Modi: భారత్‌లోనూ సింగపూర్‌లను సృష్టిస్తున్నాం: మోదీ

Muhammad Yunus: షేక్ హసీనాకు యూనస్ స్ట్రాంగ్ వార్నింగ్.. ఎందుకంటే ?

Japan Resignation Companies: ఉద్యోగుల చేత రాజీనామా చేయించడం కూడా ఒక బిజినెస్.. జపాన్ లో కొత్త వ్యాపారం

US’s Georgia school shooting: అమెరికాలో మళ్లీ కాల్పులు.. ఈసారి స్కూల్ లో.. నలుగురు మృతి

Big Stories

×