EPAPER

Sahara Desert Floods: ఎడారిలో వరదలు.. ఒక్కరోజులో 100mm భారీ వర్షంతో రికార్డ్!

Sahara Desert Floods: ఎడారిలో వరదలు.. ఒక్కరోజులో 100mm భారీ వర్షంతో రికార్డ్!

Sahara Desert Floods| మీరెప్పుడైనా ఇలాంటి వింత గురించి విన్నారా?.. ఎడారిలో భారీ వర్షం కారణంగా వరదలు వచ్చాయని. ప్రపంచంలో ఇప్పుడు ఇలాంటివి కూడా జరుగుతన్నాయి. మొరాక్కో దేశానికి సమీపంలో సహారా ఎడారిలో ఇటీవల రెండు రోజుల పాటు కురిసిన భారీ వర్షం కారణంగా ఆ ఎడారిలో వరదలు వచ్చాయి. ఈ వరదల కారణంగా దాదాపు 18 మంది చనిపోయారు.


మొరాక్కో రాజధాని రబాత్ కు 450 కిలోమీటర్లు దూరంలో దక్షిణం వైపు ఉన్న టగౌనైట్ అనే గ్రామం ఎడారికి ఆనుకొని ఉంది. ఆ ప్రాంతంలో సెప్టెబంర్ నెలలో ఒకరోజు అంటే 24 గంటల వ్యవధిలో 100mm స్థాయి వర్షం కురిసిందని మొరాక్కో వాతావరణ శాఖ ఏజెన్సీ తెలిపింది. అమెరికా అంతరిక్ష కేంద్రం నాసా ఇటీవల విడుదల చేసిన ఫొటోల్లో సహారా ఎడారి లోని ఎండిపోయిన ఐరికీ చెరువు, జగోరా, టాటా లాంటి జలాశయాలు నిండిపోయి లోతట్టు ప్రాంతాలకు నీరు ప్రవహిస్తోంది. ఎడారి మధ్యలో ఉన్న మర్‌జౌగా పట్టణంలో భారీ వర్షం కారణంగా తాటి చెట్లు ప్రతిబింబాలు నీటిలో కనిపిస్తున్నాయి.

Also Read: విచిత్ర వివాహం.. 70 ఏళ్ల ముసలాడితో 25 ఏళ్ల యువతి పెళ్లి.. ఎలా కుదిరిందంటే?


వాతావారణ నిపుణులు ఇలాంటి భారీ వర్షం ఎడారిలో కురవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీని వల్ల భవిష్యత్తులో వాతావరణ సమస్యలు తలెత్తే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. ఎడారిలో భారీ వర్షం కురవడంపై మొరాక్కో వాతావరణ ఏజెన్సీ అధికారి హుసైన్ యుఆబెబ్ మాట్లాడారు. ఇలాంటి వర్షం ఎప్పుడో 50 ఏళ్ల క్రితం ఒకసారి కురిసింది. అది కూడా ఇంతటిస్థాయిలో లేదనుకుంటా.. ఇలాంటి భారీ వర్షం సహారా లాంటి ఎడారిలో కురిస్తే.. భవిష్యత్తులో ప్రతికూల ప్రభావాలుండే అవకాశం ఉంది. ఎందుకంటే వర్షం తరువాత చాలా కాలం పాటు గాలిలో తేమ ఉంటుంది. ఆ తేమను వాతవరణంలోని వేడి పీల్చుకొని ఎవాపొరేషన్ జరుగుతుంది. ఆ తరువాత తుఫాన్లు వచ్చే ప్రమాదముంది” అని హుసైనీ హెచ్చరించారు.

సెప్టెంబర్ లో సహారా ఎడారిలో కురిసిన భారీ వర్షం కారణంగా మొరాక్కో 18 మంది చనిపోయారు. ఎడారి చుట్టుపక్కల ఉన్న డ్యామ్, రిజర్వాయర్లు నీటితో నిండిపోయాయని సమాచారం. 2023లో మొరాక్కో దేశంలో భూకంపం వల్ల నష్టం నుంచి ఆ దేశ ప్రభుత్వం ఇంకా కోలుకోలేదు. ఇంతలోనే ఇలాంటి భారీ వర్షాలు కురవడంతో ప్రభుత్వానకి మరిన్ని సమస్యలు మొదలయ్యాయి.

ప్రపంచంలోని అతిపెద్ద ఎడారి.. సహారా ఎడారి. ఇది 9 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్లలో చదరంగా విస్తరించి ఉంది. ఉత్తర ఆఫ్రికా నుంచి పశ్చియ ఆఫ్రికా, మధ్య ఆఫ్రికా దేశాలకు దీని విస్తరణ ఉంది. గ్లోబల్ వార్మింగ్ వల్ల ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయని ఇలాంటి అరుదైన వర్షాలు భవిష్యత్తులో తరుచూ జరిగే ప్రమాదముందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా సహారా ఎడారి ఉన్న దేశాల్లో ఇకపై విపరీత వేడి వాతావరణం ఉంటుందని అభిప్రాయపడ్డారు.

ప్రపంచ వాతావరణ సంస్థ సెక్రటరీ జెనెరల్ సెలెస్ట్ సౌలో మాట్లాడుతూ.. “ఎడారిలో ఇంతటి భారీ వర్షాలు కురవడం అసాధారణ విషయం. దీనివల్ల ఊహించన పరిణామాలుంటాయి. వాతావరణంలో మరింత వేడి పెరుగుతుంది. ఎప్పుడు వేడిగా ఉంటుందో ఎప్పుడు భారీగా వర్షాలు కురుస్తాయో చెప్పలేని స్థితి ఏర్పడుతోంది. వర్షాలు లేక కరువు పరిస్థితులు రావొచ్చు.. లేక భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించవచ్చు. ఇదంతా హైడ్రాలాజికల్ సైకిత్ వేగంగా తిరగడం వల్లే జరుగుతోంది. భారీ వర్షాల తరువాత విపరీతంగా ఉష్ణోగ్రత పెరిగిపోయి భూమి ఎండిపోతుంది.. తద్వారా కరువు పరిస్థితులు ఏర్పడతాయి.” అని చెప్పారు.

Related News

Iran Warns Gulf Countries: ‘ఇజ్రాయెల్ కు సాయం చేయొద్దు.. లేకపోతే’.. అరబ్బు దేశాలకు ఇరాన్ గట్టి వార్నింగ్

PM Modi ASEAN SUMMIT: ‘వ్యాపారమే కాదు ఆర్థిక, సామాజిక అవసరాల్లో సహకారం కావాలి’.. ఆసియా దేశాలతో ప్రధాని మోదీ

Trump Biopic: థియేటర్లలోకి ‘ది అప్రెంటీస్’, ట్రంప్ కు ఎదురు దెబ్బ తప్పదా?

PM MODI East Asia Summit: ‘యుద్ధాలతో గ్లోబల్ సౌత్ దేశాలకు నష్టం ‘.. లావోస్ లో ప్రధాని మోదీ!

20 Killed in Balochistan: పాకిస్తాన్ లో దారుణం.. బొగ్గుగనిలో 20 మంది హత్య!

Israel Hits UN Base: లెబనాన్ ఐరాస కేంద్రంపై దాడి చేసిన ఇజ్రాయెల్.. ఖండించిన ప్రపంచ దేశాలు

Big Stories

×