EPAPER

Haiti Prime Minister: హైతీ ప్రధాని రాజీనామా.. కారణం ఇదే!

Haiti Prime Minister: హైతీ ప్రధాని రాజీనామా.. కారణం ఇదే!

Ariel Henry Resigned


Ariel Henry Resigned(Telugu news live today): హైతీ ప్రధాని ఏరియల్ హెన్రీ తన పదవికి రాజీనామా చేశారు. హైతీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో తీవ్ర ఒత్తిడి కారణంగా ఆ దేశ ప్రధాన మంత్రి ఏరియల్ హెన్రీ రాజీనామా చేశారు. హెన్రీ రాజీనామాను ఆమోదించినట్లు చైర్ ఆఫ్ ద కరేబియన్ కమ్యూనిటీ ఇర్ఫాన్ అలీ తెలిపారు. సాయుధ మూకల దాడులలో కరేబియన్ దేశం హైతీలో గందరగోళ పరిస్థిలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో తీవ్ర ఒత్తిడి కారణంగా ఆ దేశ ప్రధాన మంత్రి ఏరియల్ హెన్రీ రాజీనామా చేశారు. గయానా అధ్యక్షుడు ఇర్ఫాన్ అలీ హైతీలో హెన్రీ చేసిన సేవకు ధన్యవాదాలు తెలిపారు.

అయతే దేశంలో తిరుగుబాటు చేసిన సాయుధ గ్యాంగులతో పోరాటంలో సహకరించాల్సిందిగా ఐక్యరాజ్య సమితి ఇంటర్నేషనల్ సెక్యూరిటీ మిషన్ ను కోరేందుకు గత నెల హెన్రీ కెన్యాకు వెళ్లారు. సరిగ్గా అదే రోజు రాజధాని పోర్ట్ ఆఫ్ ప్రిన్స్ లో ఒక్కసారిగా అక్కడ పెద్ద ఎత్తున హింస చోటుచేసుకుంది. దీంతో హెన్రీ అమెరికా దేశమైన పూర్టో రికో ప్రాంతంలో ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.


Read more: సముద్ర తాబేలు మాంసం తిని 9 మంది దుర్మరణం.. 78 మందికి అస్వస్థత

ఇక హైతీలో చాలా కాలంగా సాయుధ తిరుగుబాటు జరుగుతోంది. ఈ నేపథ్యంలో దేశ రాజధానిలోని నేరగాళ్ల మఠాలు ఒక్కసారిగా రెచ్చిపోయాయి. ఈ ముఠా ప్రధానమంత్రి ఏరియల్ హెన్రీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, హెన్రీ రాజీనామా చేయకపోతే ప్రభుత్వాన్ని కూల్చివేస్తామని చెప్పారు. అక్కడ పోలీస్ స్టేషన్లు, విమానాశ్రయాలు, జైళ్లను లక్ష్యంగా చేసుకొని దారుణమైన హింసకు పాల్పడ్డారు. దేశంలోనే పెద్ద పెద్ద నేరగాళ్లను ఉంచే పోర్ట్ ఒ ప్రిన్స్ జైలు పైనా తీవ్రమైన దాడులు చేశారు. ఆ తర్వాత పెద్ద సంఖ్యలో ఖైదీలు జైలు నుండి తప్పించుకున్నారు.

దీంతో ఆ దేశ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అక్కడి నుంచి ఇళ్లను వదిలి పారిపోతున్నారు. ఇప్పటికే 3,62,000 మంది వలసబాట పట్టారు. సాయుధ గ్యాంగులు హెన్రీ దిగిపోవాల్సిందే అని డిమాండ్ చేస్తున్న క్రమంలో హైతీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సోమవారం జమైకాలో ప్రాంతీయ నేతల సమావేళం జరిగింది. ఇంతలోనే తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. 2021 లో అప్పటి దేశాధ్యక్షుడు మెయిస్ హత్య తరువాత హెన్రీ ప్రధాన మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు.

ఈ నేపథ్యంలో ఆంటోని బ్లింకన్ మాట్లాడుతూ.. హెన్రీ పూర్తిగా అవినీతిలో కూరకుపోయారని , ఎలక్షన్స్ జరగకుండా వాయిదా వేస్తున్నారని ఆయనపై తీవ్ర వ్యతిరేకత పెరిగింది. హైతీలో శాంతి భద్రతలు పునరుద్ధించాలని ఆయన కోరారు. 2016 నుంచి హైతీలో ఎన్నికలు జరగలేదన్నారు.

Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Big Stories

×